ఖమ్మం

ఓపెన్ ఫోరమ్‌లో ‘అంతా ఓపెన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతకాని, మార్చి 25: మహత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం 10వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదికలో ఫీల్డ్ అసిస్టెంట్ల నిర్లక్ష్యం, కూలీల వేతన సమస్యలు, పనుల నిర్వహణ తీరు బహిర్గతమైంది. స్థానిక మండల పరిషత్ కార్యలయంలో శనివారం జరిగిన ఓపెన్ ఫోరం కార్యక్రమంలో గ్రామ స్థాయిలో జరిగిన తనిఖీలలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. మండల పరిధిలోని నాగులవంచలో ప్రభుత్వ ఉద్యోగి భార్యకు ఉద్యానవన శాఖ ద్వారా నిమ్మతోట పెంపకానికి సుమారు 7 లక్షల రూపాయలకు పైగా నిధులు మంజూరు చేయడంపై గ్రామానికి చెందిన రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీతంపేట పనులలో మస్టర్లలో తేడాలున్నట్లు బయటపడడంతో అధికారులు సదరు సిబ్బందిని వివరణ కోరారు. కూలీలకు వేతనాలు అందకపోవడంపై బ్యాంక్ ఖాతాలు సాకు చెప్పారని గ్రామస్థాయి తనిఖీలలో కూలీలు అసహనం వ్యక్తం చేశారని తనిఖీ సభ్యులు వెల్లడించారు. పాతర్లపాడు, నాగులవంచ, మత్కేపల్లి, సీతంపేట, వందనం, నేరడ, వందనం, లచ్చగూడెం గ్రామాలలో జరిగిన ఉపాధి పనుల తనిఖీలో మస్టర్లు, హరితహారం, కాలువల పూడికతీత పనులలో ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవహారం నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఉందని ప్రజా ప్రతినిధులు విమర్శించారు. ఉపాధి పనులు చేసే వారికి సమాచారం ఇవ్వడం లేదని, దీంతో తమ పొలాలలో పనులు చేయించుకోలేకపోతున్నామని హాజరైన రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆరు నెలలుగా కూలీలకు వేతనాలు ఎందుకు చెల్లించ లేదని ప్రజాప్రతినిధులు ప్రశించడంతో అధికారులు సమాధానం చెప్పలేక నీళ్ళు నమిలారు. ఎపిడి వాసిరెడ్డి అశోక్‌కుమార్ పనులు సమర్థవంతంగా నిర్వహించకుంటే ఎలా అని ఫీల్డ్‌అసిస్టెంట్‌లు, టెక్నికల్ అసిస్టెంట్‌లపై అసహనం వ్యక్తం చేశారు. ఉపాధిపనులు సమర్థతంగా నిర్వహించాలని, అడిగిన ప్రతి ఒక్కరికి జాబ్‌కార్డులు ఇవ్వడంతో పాటు పనులు కల్పించాలని ఆదేశించారు. పనుల విషయంలో అలసత్వం ప్రదర్శిస్తె సహించేది లేదని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు సక్రమంగా విధులు నిర్వహిస్తె కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించ వచ్చని పేర్కొన్నారు.
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం, మార్చి 25: శ్రీసీతారామచంద్రస్వామికి శనివారం సువర్ణ తులసీ అర్చన జరిగింది. గర్భగుడిలో జరిగిన ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా గోదావరి నుంచి తీర్ధబిందెను తెచ్చారు. సుప్రభాత సేవ చేసి బాలభోగం సమర్పించారు. అనంతరం బంగారు తులసీ దళాలతో రామయ్యకు అర్చన చేశారు. ఆర్జిత సేవగా భక్తులు కూడా ఈ ఉత్సవంలో పాల్గొని స్వామి వారి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం కల్యాణమూర్తులను ఊరేగింపుగా పల్లకీలో ప్రాకార మండపానికి తీసుకెళ్లారు. నిత్యకల్యాణం చేశారు. రాజభోగం అనంతరం ఆలయం తలుపులు మూశారు. తిరిగి సాయంత్రం 3 గంటలకు ఆలయం తలుపులు తెరిచారు. సాయంకాల ఆరాధనలు అనంతరం స్వామికి దర్బారు సేవ జరిగింది.

రోడ్లపై మిర్చితో ఇబ్బందులు పడుతున్న ప్రజలు

* సిపిఐ నగర కార్యదర్శి జానీమియా
ఖమ్మం(జమ్మిబండ), మార్చి 25: త్రీటౌన్ పరిధిలోని మిర్చి మార్కెట్ ఏరియాలో రోడ్లపై మిర్చి బస్తాలు వేస్తుండటంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రోడ్లపై నడిచే పరిస్థితి లేదని, ఇళ్లల్లో ఉండలేకపోతున్నారని సిపిఐ నగర కార్యదర్శి ఎస్‌కె జానీమియా తెలిపారు. సిపిఐ త్రీటౌన్ ఏరియా కమిటీ సమావేశం శనివారం శశిధర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ నుంచి పన్నులు చెల్లించకుండా తప్పించుకునేందుకు కొందరు వ్యాపారులు రోడ్లపై మిర్చి బస్తాలు వేస్తున్నారని, దీంతో స్కూల్ పిల్లలతో పాటు ఈ ప్రాంత ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎండ వేడికి, మిర్చి ఘాటుతో ఈ ప్రాంత ప్రజలు తల్లడిల్లిపోతున్నారన్నారు. మార్కెట్ కమిటీ అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని ఇబ్బందికరంగా ఉన్న మిర్చి బస్తాలను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మిర్చి మార్కెట్‌లో క్రయవిక్రయాలు జరుపుకోవాలన్నారు. ప్రధాని మోడీ సంపన్న వర్గాలకు కొమ్ము కాస్తుండగా తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం నిర్బంధంతో పాలన సాగిస్తున్నారన్నారు. అధికార యంత్రాంగం పక్షపాత ధోరణి అవలంబిస్తోందని, ప్రజల నుండి పన్నులు వసూళ్ళు చేస్తూ అభివృద్ధి మరిచారని ఆరోపించారు. ఈ నెల 27న సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌ను ముట్టడించనున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిర్వహించే ఈ ముట్టడిలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు బొల్లేపల్లి సత్యనారాయణ, వీరన్న, రవి, సురేష్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.