ఖమ్మం

కళ్యాణం చూసి తరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, మార్చి 26: వైకుంఠ రాముని కళ్యాణ వైభోగాన్ని చూసి భక్తులు తరించాలని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. శ్రీరామనవమి కళ్యాణానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో శ్రీరామనవమి ఏర్పాట్లపై జిల్లా అధికారులతో మంత్రి ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాచలం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, ఇందుకోసం ప్రత్యేక పారిశుద్ధ్య కార్మికులను నియమించాలన్నారు. నవమి ఏర్పాట్లపై ఏప్రిల్ 1వ తేదీన రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి సమీక్షా సమావేశం నిర్వహిస్తారరరని, ఆ లోపుగా అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. శాఖల పరంగా అధికారులకు కేటాయించిన పనులనరు సమన్వయంతో చేసుకోవాలని సూచించారు. రహదారి మధ్యలో ఉన్న డివైడర్లలో అందమైన మొక్కలు నాటించాలన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ప్రధాన రహదారుల పక్కన వ్యర్థాలను వేస్తున్నారని, వ్యర్థాలు వేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం పోలీసు, రెవెన్యూ అధికారుల సహకారం తీసుకోవాలని డీపీవోను తుమ్మల ఆదేశించారు. భద్రాచలం పట్టణానికి ఎంతో ప్రాశస్త్యం ఉన్నందున పట్టణాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలన్నారు. రోడ్లకు ఇరువైపులా రంగులు వేయడంతో పాటు విద్యుత్ దీపాలతో పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. భక్తులకు ఏదైనా అనారోగ్య సమస్య ఏర్పడితే అత్యవసర వైద్యసేవలు అందించేందుకు ప్రథమ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ప్రధాన ఆసుపత్రిలో బెడ్లు సిద్ధంగా ఉంచాలని, 108,104 వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. భక్తులకు సురక్షిత మంచినీరు అందించేందుకు ప్రధాన కూడళ్లలో మంచినీటి డ్రమ్ములను ఏర్పాటు చేసి సరఫరా చేయాలన్నారు. భక్తులు గోదావరిలో స్నానమాచరించి దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదులు ఏర్పాటు చేయాలని, వీలైనన్ని మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, మురుగునీరు రోడ్లపైకి రాకుండా భూమిలోకి చేరుకునేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉత్సవాల సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. కరకట్టపై అందంగా విద్యుద్దీపాలు ఏర్పాటు చేయాలని, ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు కరకట్ట లోపల భాగంలో పూల మొక్కలు నాటించాలని సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున వీలైనన్ని ఎక్కువ బస్సులను ఏర్పాటు చేయాలని, బస్సుల్లో ప్రయాణించే వారికి స్వామి తలంబ్రాలు అందజేయాలని చెప్పారు. బస్టాండ్‌ను పరిశుభ్రంగా ఉంచాలని, కొత్తగూడెం రైల్వేస్టేషన్, భద్రాచలం బస్టాండ్లలో సీతారాముల విగ్రహాలను ఏర్పాటు చేయించాలని దేవస్థానం ఈవోను ఆదేశించారు. కళ్యాణ మండపంలో ఎల్‌ఈడీ టీవీలు, గోదావరి వద్ద ప్రమాద సూచికలు ఏర్పాటు చేసి గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. భక్తుల రద్దీని క్రమబద్దీకరించేందుకు, భద్రతను పర్యవేక్షించేందుకు పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి భక్తుడికి స్వామి తలంబ్రాలు అందేలా చూస్తున్నామని, 3లక్షల ప్రసాదాలను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. భక్తులకు సమాచారం అందించేందుకు సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు మాట్లాడుతూ ఈ ఏడాది వీవీఐపీలు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున సీటింగ్ కెపాసిటీని 400 వరకు పెంచినట్లు తెలిపారు. కళ్యాణ టిక్కెట్లను ఆన్‌లైన్ ద్వారా భక్తులు ఎక్కడి నుంచైనా బుక్ చేసుకునేందుకు ఆన్‌లైన్ విధానం ప్రవేశ పెట్టామని చెప్పారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని లక్ష మజ్జిగ ప్యాకెట్లు, ఓఆర్‌ఎస్ కలిపిన నీటిని అందుబాటులో ఉంచుతున్నామన్నారు. భద్రాచలంలో ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నామో పర్ణశాలలోనూ అలాగే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జడ్పీ ఛైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే సున్నం రాజరయ్య, ఎస్పీ అంబర్‌కిశోర్ ఝా, జేసీ రాంకిషన్, దేవస్థానం ఈవో రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.