ఖమ్మం

హేమలంబ సంవత్సర రాశిఫలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు నూతన సంవత్సరాది హేమలంబ పసిడి కాంతులతో అడుగుపెట్టబోతోంది.
ఈ శుభ సందర్భాన ద్వాదశ రాశుల సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

కందాయ ఫలాలు

అశ్వని 1-1-4
భరణి 4-2-1
కృత్తిక 7-0-3
రోహిణి 2-1-0
మృగశిర 5-2-2
ఆర్ద్ర 0-0-4
పునర్వసు 3-1-1
పుష్యమి 6-2-3
ఆశ్రేష 1-0-0
మఘ 4-1-2
పూర్వఫల్గుణి 7-2-4
ఉత్తరఫల్గుణి 2-0-1
హస్త 5-1-3
చిత్ర 0-2-0
స్వాతి 3-0-2
విశాఖ 6-1-4
అనూరాధ 1-2-1
జ్యేష్ఠ 4-0-3
మూల 7-1-0
పూర్వాషాడ 2-2-2
ఉత్తరాషాడ 5-0-4
శ్రవణం 0-1-1
ధనిష్ట 3-2-3
శతభిషం 6-0-0
పూర్వాభాద్ర 1-1-2
ఉత్తరాభాద్ర 4-2-4
రేవతి 7-0-1
***

ఫలము : బేసి సంఖ్య ధనలాభము, సరిసంఖ్య సమలాభము, సున్న శూన్య ఫలమును ఇచ్చును. మొదటి కందాయము సున్నయగుచో వ్యాధి, మధ్య కందాయము సున్న యగుచో భయము, చివరి కందాయము సున్న యగుచో హాని కలుగును. మూడును సున్న యగుచో ఆరోగ్యమునకు హాని కలుగును.

గురువ్ఢ్యౌం: ఆశ్వీయుజ బ.సప్తమి గురువారం తేది.12-10-2017 రాత్రి గం.11-40 పశ్చిమ మందు గురు అస్తమయము మూఢమి ఆరంభం. తిరిగి కార్తీక బ.తదియ సోమవారం తేది.6-11-2017 సా.గం. 6-50 పూర్వోదయం మూఢ సమాప్తి
**
శుక్రవ్ఢ్యౌం: మార్గశిర బ.ద్వాదశి గురువారం తేది.14-12-17 ఉ.గం. 8-38 ప్రాగస్తమితో శుక్రః వ్ఢ్యౌరంభం మాఘ బ.తదియ శుక్రవారం తేది.3-2-2018 తె.గం. 5-45 పశ్చాదుదితో శుక్రః- మూఢ సమాప్తి.

**
రాజపూజ్యావమానములు

రాశి రాజ - అవ

మేషం 4 3
వృషభం 7 3
మిథునం 3 6
కర్కాటకం 6 6
సింహం 2 2
కన్య 5 2
తుల 1 5
వృశ్చికం 4 5
ధనుస్సు 7 5
మకరం 3 1
కుంభం 6 1
మీనం 2 4

***
ఆదాయ వ్యయములు

రాశి ఆ - వ్యయం

మేషం 8 14
వృషభం 2 8
మిథునం 5 5
కర్కాటకం 14 2
సింహ 2 14
కన్య 5 5
తుల 2 8
వృశ్ఛికం 8 14
ధనుస్సు 11 5
మకరం 14 14
కుంభం 14 14
మీనం 11 5
***
***

మేషం
(అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1వ పాదము- చూ, చే, చో, లా, లీ, లూ, లే, లో, ల అను అక్షరములు పేరునకు మొదట గలవారు)
ఈ సంవత్సరం మేషరాశివారికి గురుడు 6వ యింట సంచారంతో ప్రారంభంలో అనుకూలంగా ఉంటాడు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ధనభారం ఉన్నా సమయానికి సహాయం లభిస్తుంది. బంధుమిత్రుల సహకారంతో కొంత ఊరట ఉంటుంది. వ్యాపారులకు చికాకు, వ్యవసాయరంగంవారికి కొంత నష్టాలు ఎదురవుతాయి. ఉద్యోగులకు స్థానచలనం, ప్రమోషన్లు కలుగును. గృహ వాతావరణం కొంత అసౌకర్యంగా వున్నా క్రమంగా శాంతి ఏర్పడుతుంది. పారిశ్రామిక రంగంలోని వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. వీరికి కోర్టు వ్యాజ్యములలో అతి కష్టంమీద విజయం లభిస్తుంది. సొంత ఇంటి ప్రయత్నాలలో పురోగతి ఉంటుంది. ఈ సంవత్సరం గురువు తులారాశియందు ప్రవేశంతో ఈ రాశివారికి పై ఇబ్బందులనుండి విముక్తి కలిగించును. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలించును. ఈ సంవత్సర ప్రారంభం నుండి శని ధనుస్సంచారం వీరికి లాభించును. 21-6-2017 నుండి 26-10-2017 వరకూ శని సంచారం వలన ధననష్టం, చోరభయం, వ్యవహారపు చిక్కులు, శారీరక బాధలు, ప్రమాదములు కలుగుటకు అవకాశం కలదు. సంవత్సర ప్రారంభంనుండి 5వ ఇంట రాహు సంచారము ఆర్థికంగా యోగించును. సంతానం వలన స్వల్పంగా మానసిక వ్యధ కలుగవచ్చును. 18-8-2017 నుండి సంవత్సరాంతం వరకు రాహువు కర్కాటక సంచారము యోగించదు. సంవత్సర ప్రారంభం నుండి 17-8-2017 వరకూ కేతువు యోగించును. ధనార్జనలో మంచి అభివృద్ధి యుండును. 18-8-2017 తదుపరి సంవత్సరాంతం వరకూ కేతు మకర సంచారంవలన వృత్తియందు చికాకులు, ఇబ్బందులెదుర్కోవలసి వచ్చును.

సింహం
(మఘ, పుబ్బ 1, 2, 3, 4, ఉత్తర 1వ పాదము-మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే )

సింహరాశివారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉండును. ముఖ్యంగా ధన సంబంధమైన విషయాలు లాభం కలిగించును. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సజ్జన సాంగత్యం లభిస్తుంది. ఈ సంవత్సరంలో బంధు వియోగము. మాతృవర్గీయులకు మంచిది కాదు. కుటుంబ, కోర్టు సంబంధమైన సమస్యలు పరిష్కారమగును. అకారణంగా కలహములు, మనోవైకల్యం, వక్రబుద్ధి వలన గౌరవ హాని. వీరికి గురు సంచారం అంత మంచి ఫలితాలు ఇవ్వవు. ధనమును, ఋణములు తేలికగా లభించును. సోదర సంబంధమైన ఆర్థిక నష్టములను, విద్యార్థులకు ఆశించిన విజయాలను, ధార్మిక సంబంధమైన వ్యయములను కలిగించును. కొంత ఇబ్బందులు కలిగినా చివరకు యోగించును. రాహు సంచారం వలన సింహరాశికి చెందిన గర్భిణిలు జాగ్రత్త వహించవలెను.
శని ప్రభావంవలన సమస్యలు తలెత్తవచ్చును. నిత్యం శనిగ్రహ స్తోత్రం చదువుకోగలరు. మిగిలిన విషయాలలో శని సామాన్య ఫలితాలను కలిగించును. వీరికి రాహువు అధిక శ్రమను, పట్టుదలలో లోపమును, అవమానములను కలుగజేయును. వారసత్వ సంపద, పిత్రార్జితం నుండి ఖర్చులు చేయుదురు. కేతు సంచారంతో ఈ సంవత్సరం మిక్కిలి చికాకులు ఏర్పడు సూచన. అనారోగ్యం, కష్టములు, ప్రమాదములు, కళత్ర విషయంలో ఇబ్బందులు కలుగజేయును. ఈ సంవత్సరం కేతు గ్రహశాంతి జరిపించి ఉపశమనం పొందగలరు. 1, 3, 9 సంఖ్యలు క్రమంగా మంచివి. కెంపు, పచ్చ మంగళ, గురువారములు క్రమంగా శుభ ఫలితములనిచ్చును.

ధనుస్సు
(మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదము - యే, యో, బా, బి, భూ, ధా, భా, డ, భే)

ఈ రాశివారు ఈ సంవత్సరంలో ప్రత్యేక ప్రయోజనాలను, ధనలాభములను పొందుతారు. సంతాన సంబంధమైన చికాకులుంటాయి. ధనవ్యయం. స్థిరాస్తి సంబంధ క్రయ విక్రయాలలో నష్టం. బంధువర్గం సహాయ సహకారములు ఉంటాయి. వారివలన కార్యసిద్ధి. పైఅధికారుల వలన ఇబ్బందులు. అధిక వ్యయము. ఆరోగ్య విషయాలు సామాన్యం. విద్యార్థులు శ్రమించవలెను. విదేశీయానం కొరకు ప్రయత్నించువారు విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారులకు మిశ్రమ ఫలితాలుంటాయి. నూతన గృహం కోరిక నెరవేరును. వీరికి గురువు సంవత్సరం అంతా చక్కటి శుభ ఫలితాలను కలిగించును. ప్రభుత్వోద్యోగం ఆశించువారికి ఆశాజనకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంలో అనుకూలం, శిష్టాచారము, న్యాయబద్ధమైన సంపాదన కలుగజేయును. ధనుర్‌రాశివారికి శని మంచి ఫలితాలను ఇవ్వడు. ఏల్నాటి శని దశ ప్రభావంవలన అనేక ఇబ్బందులను కలిగించవచ్చు.
వ్యవహారపు చిక్కులవలన బాధపడుదురు. శత్రు, రోగ, ఆర్థిక సమస్యలు హెచ్చుగా ఉండును. శనికి శాంతి జరిపించగలరు. వీరికి రాహువు ప్రారంభంలో అనుకూలమైన ఫలితాలను, తదుపరి విపరీత ఫలితాలను కలిగించును. కేతువు సంవత్సరం అంతా మంచి ఫలితాలను ఇచ్చును. ఆర్థిక ఇబ్బందులు తొలగుటకై ఋణహరణ గణపతి స్తోత్రము సర్వత్రా విజయమునకై దుర్గ, సుదర్శన నారసింహ స్తోత్రములు పఠించగలరు. శని రాహవులకు జప దానాదులు చేయించగలరు. పుష్యరాగము లేదా కెంపులు ధరించుట ద్వారా మానసిక శాంతి లభించును. గృహ కలహములు మరియు ఆర్థిక ఇబ్బందులు తొలగును.

కన్య
(ఉత్తర 2, 3, 4 , హస్త 4 , చిత్త 1, 2 పాదములు- ‘టో, పా, పి, పూ, షం, ణా, ఠా, పే, పో)

కన్యారాశి వారికి గురువు 13-9-2017 వరకూ సంపూర్ణమైన శుభ ఫలితాలను ఇచ్చును. వీరికి ఆయుర్భాగ్యములు కలిగించును. కావేరి పుష్కరాల ప్రారంభం నుండి మిశ్రమ ఫలితాలను కలిగించును. ఆకస్మిక ధన నష్టములు, ప్రయాణమందు ఇబ్బందులు, అగ్ని లేదా చోర భయము, పై అధికారుల కోపతాములు, అధికారులతో మాట పడుట వంటి అనేక పరిస్థితులు కలుగును. మనోధైర్యం అవసరం. నిరుత్సాహం కూడదు.
సంవత్సరం చివరి మూడు నెలల అనగా పుష్యమాసం నుండి ఫలితాలు అనుకున్నంతగా వుండవు. ఆరోగ్య సమస్యలు కలిగించును. ఈ సంవత్సరంలో శని కూడా వీరికి మంచి ఫలితాలను కలిగించడు. పుత్ర సంతానం వలన నష్టం, కళత్ర విభేదాలు, పిత్రార్జితం దుర్వినియోగమగును. ఉద్యోగులకు సామాన్యంగా ఉండును. ఈ సంవత్సరం శనికి శాంతి జపములు చేయించుకోగలరు. ఈ సంవత్సరంలో రాహువు అపరిమితమైన ఖర్చును కలిగించును. స్వార్జితం కూడా వ్యయమగును. తీర్థయాత్ర లేదా దూర ప్రయాణములు చేయగలరు.
వీరికి కేతువు ఋణము వలన భూమి లేదా గృహము ద్వారా లాభించును. సంతాన ప్రయత్నములు చేయువారు కేతు శాంతి జరిపించిన మంచిది. 2, 3, 6 సంఖ్యలు కెంపు పచ్చ రత్నములు శుభమునిచ్చును. ఇబ్బందులు తొలగుటకై లక్ష్మీనారాయణ లేదా విష్ణుమూర్తిని పూజించుటవలన సుఖశాంతులు పొందగలరు. విద్యార్థులు హయగ్రీవ స్తోత్రమును పఠించుట లాభించును.

మకరం
(ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు. శ్రవణం 4 పాదములు, ధనిష్ఠ 1, 2 పాదముల - జో, జా, జీ, జూ, జే, భా, గా,గీ)

ఈ సంవత్సరంలో మకరరాశివారు మిశ్రమ ఫలితాలను పొందుతారు. వృత్తిపనులవారికి, ఉద్యోగులకు లాభములు. వ్యాపార రంగంలోనివారికి మిశ్రమ ఫలితాలు. స్వస్థలంలో అభివృద్ధి ఉండును. విదేశములలో ఉన్నవారికి కొద్దిపాటి కష్టనష్టములు. సొంత ఇంటి ప్రయత్నములు ఫలించును. భూసంబంధ లేదా వ్యవసాయ సంబంధ లాభములు కలుగును. సోదర వర్గంతో మరియు కళత్ర విషయాలలో అనుకూలత ఏర్పడును. పురాణ శ్రవణాదులు, పుణ్యక్షేత్ర సందర్శనలు చేయుదురు. మొత్తంమీద ఆదాయం బాగుంటుంది. తీవ్ర ప్రయత్నానంతరం విజయములు ఏర్పడును. వీరికి గురువు ఈ సంవత్సరం అంతా సామాన్య ఫలితాలను కలిగించును. మిక్కిలి పేరు ప్రతిష్ఠలను ఏర్పరచును. ఆధ్యాత్మిక భావన అధికమగును. వీరికి శని మంచి ఫలితాలను ఇస్తాడు. ఏల్నాటి శని దశ ప్రభావంవలన స్వార్జితం, పిత్రార్జితం ఖర్చు అయినా తిరిగి సంపాదింతురు. ఈ సంవత్సరంలో మకరరాశివారికి రాహువు అనుకూలమైన ఫలితాలను ఇవ్వడు. కళత్ర, పిత్రార్జిత సమస్యలను ఏర్పరచును. కేతువు కూడా మకరరాశివారికి మిశ్రమ ఫలితాలు కలిగించును. కాని తీవ్ర నష్టములు కలుగవు. ఈ రాశివారలు ఆదిత్య హృదయము, హనుమత్ స్తోత్ర పారాయణములు చేయుంచుకొనుట వలన ఇబ్బందులు తొలగును. ఋణవిమోచన అంగారక స్తోత్ర పారాయణము చేయవలెను. ఈ సంవత్సరం గురువు, రాహువు కేతులకు జపం చేయించుకోగలరు. నల్ల నువ్వులు దానం చేయుట, శనిగ్రహ శాంతి జపం చేయించుకొనుట మంచిది. నిత్యం రాహుగ్రహ స్తోత్రము చదువుకొనుట మంచిది. కేతువుకు శాంతి అవసరం.

మిథునం
(మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు - కా, కి, కూ, ఖం, జ్ఞ, చ్ఛ, కే, కో, హో )

మిథున రాశి వారికి వ్యాపారములందు, వృత్తి వ్యాపారస్తులకు మంచి అనుకూలమైన ఫలితాలను, లాభములను కలిగించును. ధనప్రాప్తి, గౌరవం, చక్కటి ఆరోగ్యం, బహు విధములైన వైభవములు కలుగును. శత్రుభయం ఆందోళన కలగించును. సంతాన ప్రయత్నములు ఫలించును. సంతానం మంచి స్థితిని పొందును. రాజకీయ నాయకులకు పదవీ లాభం. వివాహ ప్రయత్నములు చేయువారికి చక్కటి జీవిత భాగస్వామి లభించును. తలచిన ప్రతీ కార్యం విజయం పొందుటకు అవకాశం కలదు. బంధువర్గంవారి సహాయలేమి, గృహంలో మార్పులు లేదా గృహ నిర్మాణం చేపట్టుటకు అవకాశం కలదు. వాయిదా పడిన పనులు తిరిగి ప్రారంభించి పూర్తిచేయగలరు. వీరికి గురువు సంవత్సరం అంతా యోగించును. వాహన లాభమును, భూ సంబంధమైన విషయాలలో అనుకూలతను కలిగించును. విశేష భాగ్యమును, ధనమును, పుత్ర సంతానమును, స్థిరాస్తి సంపదను ఏర్పరచును. వీరికి శని యోగించుడు. కళత్ర సంబంధ చికాకులు కలిగించును. శనిగ్రహ శాంతి అవసరం. ఆగస్టు 2017 వరకూ రాహువు అనుకూల ఫలితాలను కలిగించును. ఉద్యోగ జీవనంలో అభివృద్ధిని, విశేష ధనలాభములను, వంశాభివృద్ధిని కలిగించును. అధిక ధనవ్యయము అగును. ఆరోగ్య సమస్యలను ఏర్పరచును. ఈ సంవత్సరం రాహుగ్రహ శాంతి కూడా అవసరం. కేతువు వలన మిథునరాశివారు ఈ సంవత్సరంలో అనుకూలమైన ఫలితాలనే పొందుతారు. ఇబ్బందులు తొలగుటకై విష్ణు సహస్రనామ పారాయణము చాలా మేలు కలుగచేయును. 5, 3, 9 సంఖ్యలు మరియు పచ్చలు, పుష్యరాగం ధరించుట ద్వారా శుభములు కలుగును.

తుల
(చిత్త 3, 4 , స్వాతి 4 పాదములు. విశాఖ 1, 2, 3 పాదములయందు- రా, రి, రూ, రే, రో, త, తీ, తూ, తే)

ఈ ఏడాదిలో చక్కటి అనుకూలమైన ఫలితాలుండును. గృహ సౌఖ్యం, సంతాన సౌఖ్యం, వ్యాపార- ఉద్యోగ మరియు ఇతర వృత్తులయందు విజయం, సంతోషం పొందుదురు. విహారయాత్రలు, పుత్ర సంతానం వలన వృద్ధి, శుభకార్యములు. వ్యవహారంలో విజయం. వృత్తిలో పేరు, గౌరవం. ధనాదాయం పెరుగును. ప్రజాదరణ లభించును. బంధువులలో గౌరవములు, సర్వ సౌఖ్యములు ప్రాప్తించును. ఈ సంవత్సరం వీరికి గురువు మిశ్రమ ఫలితాలు కలుగజేయును. ధనం వృధాగా ఖర్చగును. అధిక వ్యయములు కలుగును. వీరు స్వల్ప అనారోగ్యంచే బాధపడతారు. శత్రువులవల్ల ఆటంకములు. ఈ సంవత్సరం గురువు సంచారంవల్ల వడ్డీ వ్యాపారము, సినీ ఫైనాన్స్ చేయువారికి కలిసి వచ్చును. వీరికి వ్యాపార పరంగా మంచి లాభములు ఏర్పడును.
ఈ రాశివారికి శనివలన ఆదాయ వ్యయములు సమానంగా ఉండును. ఎంత సంపాదించినా దానికి తగ్గట్టు అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. ఈ సంవత్సరం అంతా రాహువు అనుకూలమైన ఫలితాలనే ఇచ్చును. భూ సంబంధమైన వ్యవహారములు లాభించును. ప్రయాణములు చేయుదురు. కేతువు విద్యార్థులకు తీవ్ర ఒత్తిడి మరియు శ్రమను కలిగించును. స్ర్తి సంతానానికి ఆరోగ్య సమస్యలను ఏర్పడును. తల్లిగారికి లేదా మాతృ వర్గీయులకు మంచిది కాదు. వీరికి 5, 6 సంఖ్యలు సోమ, శుక్రవారములు, జాతి వజ్రం శుభ ఫలితములనిచ్చును. ఆరోగ్య విషయమై సూర్యకవచము కుటుంబ సఖ్యతకై గణపతి మరియు శని, కేతువులకు జపదానాదుల ద్వారా సర్వవిఘ్నములను తొలగి తలచిన కార్యములు నిర్విఘ్నంగా నెరవేరును.

కుంభం
(్ధనిష్ఠ 3, 4 పాదములు, శతభిషం 4 పాదములు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదముల గు, గే, గో, సా, ఈ, సు, సే, సో, దా)
కుంభరాశివారికి ఈ ఏడాది అనుకూలమైన ఫలితాలుంటాయి. వృత్తి వ్యాపారములలో విజ యం. ఉద్యోగ ప్రాప్తి. వివాహ ప్రయత్నములలో సఫలత. నూతన ఆలోచనలు కార్యరూపం దాల్చును. అధికార హోదా, ధన వస్తు, వాహనాదులు సమకూరును. గృహ నిర్మాణం పూర్తిచేయగలరు. సంతోషకరమైన వాతావరణం ఏర్పడును. ఆశించిన లాభములు లభించును. పాడి పరిశ్రమలు, క్రీడారంగం, వినోద రంగములవారికి మంచిది. వీరికి గురువు 12-9-2017 వరకూ మిశ్రమ ఫలితాలను, తదుపరి అనుకూలమైన ఫలితాలను కలిగించును. మిక్కిలి భాగ్యవంతమైన జీవనం ఏర్పడును. వీరికి శని సంచారం సంవత్సరం అంతా మంచి ఫలితాలను కలిగించును. పేరు ప్రఖ్యాతులు పెరుగును. విదేశీ ప్రయాణములందు కార్యానుకూలత కలుగును. వీరికి రాహువు ఈ సంవత్సరం ద్వితీయార్థం నుండి శుభ ఫలితాలను కలిగించును. శత్రుత్వములను, అనారోగ్యమును, జీవిత భాగస్వామితో ఇబ్బందులను ఏర్పరచును. కేతువు కూడా శుభుడు. గ్రహశాంతికై నవగ్రహ హోమము చేయించుట మంచిది. విష్ణుసహస్రనామ పారాయణం, హనుమత్ స్తుతి, కౌబేర పాశుపతం చేయించుకొనుట ద్వారా ఆర్థికాభివృద్ధి, మానసిక ప్రశాంతత, తలచిన కార్యాలు నిర్విఘ్నంగా నెరవేరుటకు ఉపయోగపడును. ఈ సంవత్సరం రాహు-కేతువులు ఇరువురికి శాంతి, శనిదేవునికి శాంతి జపములు జరిపించుకొనుట మంచిది. ఏప్రిల్‌లో వ్యయం, మేలో వివాదాలు, జూన్‌లో విజయం, జులైలో అనారోగ్యం, ఆగస్టులో అంతా అనుకూలత ఉంటాయ. సెప్టెంబర్‌లో తగాదాలు, అక్టోబర్‌లో మిశ్రమ ఫలితాలు, నవంబర్, డిసెంబర్‌లలో కష్టనష్టాలు. జనవరిలో ఇబ్బందులు, ఫిబ్రవరిలో శుభం. మార్చిలో ఆర్థికంగా అనుకూలత.

కర్కాటకం
(పునర్వసు 4వ పాదము. పుష్యమి 1, 2, 3, 4 పాదములు. ఆశే్లష 1, 2, 3, 4 పాదములు - హీ, హూ, హే, హో, డా, డీ, డూ, డే, డో)

వ్యవసాయదారులకు, భూసంబంధమైన వ్యాపారములు చేయువారికి చక్కటి విజయం ప్రాప్తిస్తుంది. వృత్తిపరంగా మరియు ఇతర వ్యాపారములు చేయువారికి అనుకూలంగా ఉంటుంది. రాజ్యగౌరవం, ఆశించిన ధనలాభములు ఏర్పడతాయి. ఉద్యోగ జీవనం చేయువారికి అనవసర ప్రయాణాలు, దూర ప్రాంతములకు బదిలీలు జరుగు సూచన కలదు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగ ప్రాప్తి. వివాహాది ప్రయత్నములు చేయువారికి మధ్యస్తంగా యుండును. వీరికి నరముల సంబంధమైన అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కుటుంబంలో బంధు బలగం పెరుగుతుంది. నూతన పరిచయాలు, ఆర్థిక లాభాలు కలిసివస్తాయి.
గురువు సంవత్సరం అంతా అనుకూలమైన ఫలితాలు కలిగిస్తాయి. విద్యార్థుల ఆశలు నెరవేరును. వీరికి భూ లేదా గృహ సంబంధమైన వసతులు ఏర్పడును. నూతన వాహనమును కొనుటకు అవకాశము. ఈ సంవత్సరారంభంలో శని వ్యతిరేక ఫలితాలను, తదుపరి మంచి ఫలితాలను కలిగిస్తాడు. నానాదేశ సంచారము, సంతాన అభివృద్ధి, ఖర్చుకు సరిపడు ఆదాయము ఉంటాయి. నల్లని వస్తువులు లాభములు కలుగచేయును. తీవ్ర చెడు ఫలితాలవలన బాధలను అనుభవించవలసి వస్తుంది. శనికి శాంతి జపములు చేసుకొనుట మంచిది. వీరికి రాహువు యోగించడు. ధనవ్యయమును, కఠినమైన ప్రవర్తనను కలిగించును. ఆగస్టువరకూ కేతువు కూడా యోగించడు. శారీరక శ్రమ, తగాదాలు, ఋణములు, కార్య అపజయములు, వ్యవహారపు చిక్కులు ఏర్పడతాయి. ఆగస్టునుండి జీవిత భాగస్వామి సంబంధ విషయములు అనుకూలంగా వుండవు.

వృశ్చికం
(విశాఖ 4వ, అనూరాధ 4 పాదములు. జ్యేష్ఠ 4 పాదములయందు - తో, నా, నీ, నూ, నే, నో, య, యా, యూ)

ఈ సంవత్సరంలో దీర్ఘకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఉపశమనం లభిస్తుంది. వ్యవసాయ రంగంవారికి లాభిస్తుంది. రాజకీయ రంగంవారికి మిశ్రమ ఫలితాలుంటాయి. ధనవ్యయం ఉంటుంది. సంతాన సంబంధమైన ప్రయత్నములు లాభించును. ఈ రాశివారు మిశ్రమ ఫలితాలను పొందుతారు. వ్యాపారులకు ఆశించినంత మేర లాభములుండవు. పరిస్థితులలో అంతమార్పుండదు. దాయాదులవలన ఇబ్బందులు, బంధువులతో కలహాలు, విదేశీయానమునకు ఆటంకములు, వివాహములు కుదురుటలో ఆలస్యము, జీవిత భాగస్వామితో అన్యోన్యత. వృత్తి మరియు వ్యాపార రంగంలోనివారికి మధ్యమ ఫలితాలు. ఉద్యోగులకు పదోన్నతి. ఈ రాశివారికి గురువు 12-9-2017 వరకూ లాభమందుండి ధనదాయమును కలిగించును. చక్కటి అనుకూలమైన ఫలితాలను ఏర్పరచును. సత్కార్యములను చేయుదురు. తదుపరి మిశ్రమ ఫలితాలను కలిగించును. ప్రభుత్వం, ఋణముల బాధవలన, ఆరోగ్య సమస్యలు ఏర్పడును. వీరికి శని మంచి ఫలితాలను ఇవ్వడు. ధనవ్యయమును, నేత్ర సంబంధ సమస్యలను, ప్రతీ విషయంలోను ఆటంకములు ఏర్పడుతాయి. శ్రమపడాల్సిన పరిస్థితులను ఏర్పరచును. ఏల్నాటి శనివలన ప్రభావం తీవ్రంగా ఉండును. శనికి శాంతి జపములు జరుపవలెను. ఈ సంవత్సరం అంతా రాహువు అనుకూలమైన ఫలితాలను కలిగించును. గృహ సంబంధమై చేయు ప్రయత్నములకు బలం చేకూరును. కేతువుకూడా మంచి ఫలితాలనే కలిగిస్తాడు. విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రము, వ్యాపారులు లక్ష్మీనారాయణ స్తోత్రము మరియు ఉద్యోగులు పంచాయుధ స్తోత్రము లేదా నారసింహ స్తుతివలన చిక్కులు తొలగును.

మీనం
(పూర్వాభాద్ర 4 పాదము, ఉత్తరాభాద్ర 4 పాదము, రేవతి 4 పాదములు- ది, దు, శ్యం, ఝా, దా, దే, దో, చా, చి)
ఈ సంవత్సరంలో మీనరాశివారు అనుకూలమైన ఫలితాలను పొందగలరు. శనిబలంవలన ఈ సంవత్సరంలో క్రమేపీ శుభ ఫలితాలు కలుగును. గత కాలపు చెడు ఫలితాలు క్రమేపీ తొలగును. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచిది. వీరికి గురువు సెప్టెంబర్ వరకూ స్వల్పంగా యోగించును. వివాహ ప్రయత్నాలు చేయువారికి మిక్కిలి యోగ్యమైన కాలం. వైవాహిక జీవనంలో సంతోషములు ఏర్పడును. సెప్టెంబర్ తదుపరి అంతగా మంచి ఫలితాలను ఇవ్వడు. ఆర్థికంగా కొద్దిపాటి ఇబ్బందులను కలిగించును. ఈ రాశివారికి శని ఈ సంవత్సరమంతా మంచి అనుకూలమైన ఫలితాలను కలిగించును. లోహ మరియు కమీషన్ సంబంధమైన వ్యాపారాలు చేయువారికి కలిసివచ్చును. మీనరాశివారికి రాహువు-కేతువు ఇరువురూ సంవత్సరం అంతా అనుకూలమైన ఫలితాలను ఇస్తారు. స్థానచలనం, మానసిక చాంచల్యత, వాహన విషయంలో జాగ్రత్త. గురు మంగళవారములు 3, 9, 1 సంఖ్యలు క్రమముగా లాభమును చేకూర్చును. విద్యార్థులు దక్షిణామూర్తి, హయగ్రీవస్తోత్రము పఠించుట ద్వారా తమ శక్తిని పెంపు చేసుకోగలరు. ఏప్రిల్‌లో చికాకులున్నా మే లో అంతా బాగుంటుంది. పశువులతో హానీ ఎదురవచ్చు. జూన్, జులైలలో ప్రశాంతత, ఆగస్టులో వివాదాలు, సెప్టెంబర్‌లో వ్యయం, అక్టోబర్‌లో సామాన్య ఫలితాలు. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మిశ్రమ ఫలితాలుంటాయ. మార్చిలో సమస్యలున్నా అంతిమ విజయం ఫలిస్తుంది.
*