ఖమ్మం

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తుపల్లి, మార్చి 28: సింగరేణిలో చట్టబద్ధంగా వారసత్వ ఉద్యోగాలు అమలు చేయాలని కోరుతూ ఏఐటియుసీ ఫిట్ కార్యదర్శి జోషి ఆధ్వర్యంలో మంగళవారం సత్తుపల్లి జెవిఆర్ ఓసి ప్రాజెక్టు మేనేజర్ వెంకటాచారికి వినతిపత్రం అందించారు. సందర్భంగా అసిస్టెంట్ కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ వారసత్వ ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకున్న వారికి న్యాయం చేయాలని హైకోర్టు కేసు మీద సిబిఐ విచారణ జరిపించాలని కోరారు. ఎల్‌ఎల్‌పి (సర్వీస్ లింక్‌డ్ ప్రమోషన్) పాత తేదీల నుంచి అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగారావు, కాయితం సుబ్బారావు, భీమయ్య, అశోక్, శ్రీను, రవి, చంద్రు, సంజీవరావు పాల్గొన్నారు.

ఇరు జిల్లాల కాంగ్రెస్ మహిళా సంఘం నూతన కమిటీ ఎన్నిక
ఖమ్మం(ఖిల్లా), మార్చి 28: కాంగ్రెస్ పార్టీ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల మహిళా సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సోమవారం ఆపార్టీ కమిటీ జిల్లా అధ్యక్షురాలు బండి మణి తెలిపారు. ఆయా నియోజకవర్గాలు, మండలాల కమిటీలను ఎన్నుకున్నట్లు ఆమె వెల్లడించారు. మహిళా కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రసిడెంట్‌గా శీలం శారదతో పాటు మరొ పది మందిని, కార్యదర్శులుగా నిమ్మతోట స్వర్ణతో పాటు మరొ 10మందిని, సహయ కార్యదర్శులుగా గుత్తా ద్రౌపతితో పాటు మరో పది మందిని ఎన్నుకున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. ఖమ్మం, మధిర, పాలేరు, సత్తుపల్లి, వైరా, భద్రాచలం, పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకర్గాల బాధ్యులు, ఆయా మండల కమిటీలను ఎన్నుకున్నట్లు ఆమె ప్రకటించారు.
ఉగాది శుభాకాంక్షలు
ఖమ్మం(మామిళ్ళగూడెం), మార్చి 28: జిల్లా ప్రజలకు పలువురు హేమలంబ ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వర్షాలు సమృద్ధిగాపడి పంటలు బాగా పండి జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జడ్పిచైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, మాజీ ఎంపి నామానాగేశ్వరరావు, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, జిల్లా కలెక్టర్ డియస్ లోకేస్‌కుమార్, నగరమేయర్ డాక్టర్ పాపాలాల్ జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరంలో జిల్లా ప్రజలకు మేలు జరగాలని వారు ఆకాంక్షించారు. జిల్లా రైతాంగానికి అన్ని పరిస్థితులు అనుకూలించి సిరిసంపదలతో తులతూగాలని ఆకాంక్షించారు.

రైతన్న సంతోషంగా ఉన్నది ఎక్కడ...?

ఖమ్మం(ఖిల్లా), మార్చి 28: రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, పెట్టిన పెట్టుబడులు రాని పరిస్థితులలో రైతులు సంతోషంగా ఉన్నారని రాష్ట్ర మంత్రులు చెప్పడం విడ్డూరంగా ఉందని, రైతన్న ఎక్కడ సంతోషంగా ఉన్నారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఐతం సత్యం ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రి వర్గం మొత్తం సిఎం కెసిఆర్ కనుసైగల్లో నడుస్తూ జరగని అభివృద్దిని మాటల గారడితో తెరపై చూపిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రైతాంగం సుభిక్షింగా ఉందని అసెంబ్లీలో మంత్రులు చెప్పడం హాస్యస్పదంగా ఉందన్నారు. జిల్లాలోని ఎవ్యవసాయ మార్కెట్‌కు వెళ్ళిన రైతుల ధీన పరిస్థితి కళ్ళకు కట్టినట్లు కన్పిస్తుందన్నారు. కళ్ళుండి కబోదిలాగా పాలకులు వ్యవహరించడం బాదాకరమన్నారు. మిర్చి దిగుబడి ప్రారంభంలో క్వింటా పదివేలు పలకగా తీరా పంట చేతికివచ్చిన తర్వాత నాలుగు వేలకు పడిపోయిందని అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రైతు పండించిన మిర్చి పంటను అమ్ముకోలేక, దాచుకోలేక సతమతవౌతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కోల్ట్‌స్టోరేజిలలో నిల్వ చేసేందుకు కూడా అవకాశం లేకుండ పోయిందన్నారు. మార్కెట్‌లో క్యూకట్టి రాత్రింబవళ్ళు కంటికి కులుకు లేకుండా పడిగాపులు కాస్తున్నారన్నారు. అపరాలు పండించాలని ఊదర గొట్టిన ప్రభుత్వం తీరా పంట అమ్ముకునేందుకు మార్కెట్‌కు రాగా కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే పాలకులు రైతులు సుఖసంతోషాలతో ఉన్నారని చెప్పడం వారికే చెల్లిందన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం వాస్తవ పర్ఘిస్థితులు గమనించి రైతాంగానికి మద్దతు ధర కల్పించాలన్నారు. విలేఖరుల సమావేశంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బండి మాధవి, కార్పొరేటర్ బాలగంగాధర్‌తిలక్, తాజుద్దీన్, దుర్గాప్రసాద్, బాలాజిరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.