ఖమ్మం

నాడు మర్రిగూడెం.. నేడు రేగులగూడెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుండాల, మార్చి 28: తరతరాలుగా సాగుచేసుకుంటున్న ఆదివాసీ భూములను హరితహారం పేరుతో అటవీ శాఖ బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తుండటంతో ప్రత్యామ్నాయం లేక ఆదివాసీలు అటవీ, పోలీసు శాఖలపై తిరుగుబాటు సిద్ధమవుతున్నారు. గత ఏడాది చండ్రుగొండ మండలం మర్రిగూడెంలో ఆదివాసీలు సాగుచేసుకుంటున్న భూముల్లో అటవీ శాఖ అధికారులు హరితహారం పేరుతో ప్రవేశించి పంట చేలను తొలగించి, పొక్లెయిన్‌తో కందకాలు తవ్వుతుండగా అక్కడి ప్రజలు తిరగబడి అటవీ శాఖ, పోలీసు అధికారుపై దాడులు చేశారు. తాజాగా గుండాల మండలం రేగులగూడెంలో అదే పరిస్థితి తలెత్తింది. రేగులగూడెం ప్రాంతంలో పదేళ్లుగా గిరిజనులు సాగుచేసుకుంటున్న భూముల్లో మూడో విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు భూమి హద్దులను నిర్ణయిస్తూ కందకాలు తవ్వేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నించగా గిరిజనులు అడ్డుకున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం చందంగా ఏజన్సీలో అటవీ ఉద్యోగుల విధి నిర్వహణ తయారైంది. ప్రభుత్వం పోడు భూములు లాక్కునే ముందుగా గిరిజనులకు ప్రత్యామ్నాయం చూపి భూములను స్వాధీనం చేసుకుంటే సమస్య ఉత్పన్నమయ్యేది కాదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల కోసం
కార్మిక సంఘాల పోరుబాట
* 31న సింగరేణికి సమ్మె నోటీసు
కొత్తగూడెం, మార్చి 28: సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ కోసం కార్మిక సంఘాలు పోరుబాట పట్టనున్నాయి. సింగరేణిలో ఐదు జాతీయ కార్మిక సంఘాలు ఐక్య పోరాటాలకు పావులు కదుపుతున్నాయి. ఇందుకోసం గోదావరిఖనిలో కార్మిక సంఘాలు సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాయి. ఈ నెల 31వ తేదీన సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చి సమ్మె సైరన్ మోగించేందుకు సన్నద్ధమవుతున్నాయి. 12 ఏళ్ల క్రితం రద్దయిన వారసత్వ ఉద్యోగాలను తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది తెరపైకి తెచ్చింది. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను తిరిగి కొనసాగించేందుకు గత నవంబర్‌లో ఉత్తర్వులు జారీ చేసి జనవరి 1వ తేదీ నుంచి వారసత్వ ఉద్యోగాల దరఖాస్తులను స్వీకరించింది. వారసత్వ ఉద్యోగాలను సవాల్ చేస్తూ గోదావరిఖనికి చెందిన సతీష్‌కుమార్ అనే యువకుడు హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేయటంతో వారసత్వ ఉద్యోగాలను హైకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వాన్ని, సింగరేణి కాలరీస్ సంస్థతోపాటు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టిజిబికెఎస్)లను ఇరుకున పెట్టేందుకు ఐదు జాతీయ కార్మిక సంఘాలు సింగరేణిలో సమ్మెకు సన్నద్ధమవుతున్నాయి. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) అధ్యక్షుడు వై గట్టయ్య, సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్ (ఐఎన్‌టియుసి) కార్యదర్శి జనక్‌ప్రసాద్, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు కార్యదర్శి మందా నర్శింహారావు, హెచ్‌ఎంఎస్ కార్యదర్శి రియాజ్ అహ్మద్, బిఎంఎస్ నాయకులు లక్ష్మీనారాయణతోపాటు ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించి ప్రణాళిక రూపొందించారు. వారసత్వ ఉద్యోగాల సాధన కోసం సింగరేణిలో సమ్మె అనివార్యమవుతుందని నాయకులు ప్రకటించారు. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టిజిబికెఎస్) నాలుగేళ్లలో కార్మిక ప్రయోజనాలను కాపాడటంలో విఫలమైందని ఆరోపిస్తూ ఐదు జాతీయ కార్మిక సంఘాలతోపాటు కలిసొచ్చే కార్మిక సంఘాలతో ఐక్య పోరాటాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. మార్చి 31వ తేదీతో ఆర్థిక సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యంలో కార్మిక సంఘాలు గుర్తింపు కార్మిక సంఘాన్ని దృష్టిలో పెట్టుకుని కార్మికులకు దగ్గరయ్యేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నాయి.