ఖమ్మం

సామూహిక గృహప్రవేశాలకు అంతా సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మార్చి 28: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇళ్ళ పథకం ఖమ్మం జిల్లాలో కూడా ప్రారంభానికి నోచుకున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దత్తత గ్రామమైన ఎర్రబెల్లిలో మొట్టమొదటి సారిగా ‘డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు’ నిర్మించి ప్రారంభించారు. ఆ తరువాత రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు దత్తత గ్రామమైన ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లిలో 22 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళను నిర్మించి ఉగాది రోజున సామూహిక గృహప్రవేశాలు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మంత్రి మద్దులపల్లిని దత్తత తీసుకున్న తరువాత ఆ గ్రామం రూపురేఖలే మారిపోయాయి. గ్రామంలో ఇప్పటికే సిసి రోడ్లు, నాలుగు లైన్ల బిటి రోడ్ నిర్మాణం, డ్రైనేజీల నిర్మాణం, ఇంటింటికీ నల్లా, మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల పునరుద్ధరణ, మద్దులపల్లి స్టేజీ వద్ద బస్‌స్టాండ్ నిర్మాణం, కాళీమాతా ఆలయానికి ప్రత్యేక సిసిరోడ్డు, గ్రామపంచాయతీ కార్యాలయం, దోభీఘాట్ నిర్మాణం, నిరుద్యోగులకు రుణ సౌకర్యం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. దాంతోపాటు గ్రామంలోని ఇళ్లు లేని 22 మంది లబ్ధిదారులను ముందుగానే గుర్తించి కెసిఆర్ మానస పుత్రిక అయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళను కేటాయించారు. ఇటీవలే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ నిర్మాణాలు పూర్తయ్యాయి. తాగునీటి వసతి, సిసిరోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం, విద్యుత్ సరఫరా వంటి వౌలిక వసతులన్నింటినీ ఏర్పాటు చేశారు. సోమవారం నాడు అధికారులు, గ్రామపెద్దల సమక్షంలో లబ్ధిదారులకు లాటరీ విధానం ద్వారా ఇళ్ళను కేటాయించారు. గృహప్రవేశం చేసే వారికి జత దుస్తులు, ఓ దేవుని ఫోటో, సిఎం కెసిఆర్ ఫోటోను అధికారులు ఉచితంగా అందజేయనున్నారు. ముఖ్యమంత్రి దత్తత గ్రామంలో మినహ ఎక్కడ డబుల్ బెడ్‌రూం ఇళ్ళు నిర్మించటం లేదని వస్తున్న ఆరోపణలకు మద్దులపల్లి గ్రామాన్ని టిఆర్‌ఎస్ నేతలు సమాధానంగా చూపుతున్నారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే ప్రారంభమైన 3వేల డబుల్‌బెడ్‌రూం ఇళ్ళు త్వరలోనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ తెలిపారు.
భద్రాచలం రోడ్డు- సత్తుపల్లి రైల్వే లైన్ మంజూరు

ఖమ్మం/ కొత్తగూడెం మార్చి 28: దశాబ్దాల కాలంగా ప్రజలు ఎదురుచూస్తున్న భద్రాచలం రోడ్-సత్తుపల్లి రైల్వే లైన్ మార్గం మంజూరైంది. ఈ ప్రాంతంలో రైల్వే లైన్ మంజూరు చేయాలని డిమాండ్ వచ్చినప్పుడే కొంత భాగాన్ని తాము భరిస్తామని సింగరేణి యాజమాన్యం ముందుకు వచ్చింది. అప్పటి నుండి అనేక ఆందోళనలు, బడ్జెట్ సమయంలో విజ్ఞప్తులు జరుగుతునే ఉన్నాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వం రైల్వే లైన్ మార్గాన్ని మంజూరు చేస్తు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 703కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఈ మార్గానికి తొలి విడత భూసేకరణ కోసం 70కోట్ల రూపాయలు మంజూరు చేశారు. సింగరేణి బోగ్గును ఇతర ప్రాంతాలకు తరలించటంతో పాటు విజయవాడకు స్వల్ప వ్యవధిలో వెళ్ళేందుకు ఈ మార్గం తొడ్పడుతుందని అంచనాలు వేశారు. సత్తుపల్లి నుండి కొండపల్లి వరకు నిర్మించాల్సిన రైలు మార్గం పనులుపై కూడ సర్వే జరుగుతున్నది. భద్రాచలం రోడ్ నుండి కొవ్వూరు వరకు రైల్వే మార్గం నిర్మించాలని డిమాండ్ గత 3దశాబ్ధాలుగా ఉన్నది. తాజాగా సత్తుపల్లి వరకు రైల్వే మార్గం నిర్మిస్తే మరో 80కిలోమీటర్లు రైలు మార్గాన్ని పోడిగిస్తే కొవ్వూరు వరకు ఆ మార్గం వేళ్ళే అవకాశం ఉంది. వచ్చే ఆర్ధిక సంవత్సరంలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
సింగరేణి సిఎండి హర్షం
కొత్తగూడెం: కొత్తగూడెం - సత్తుపల్లి రైల్వే లైన్ నిర్మాణానికి అనుమతులు లభించటం పట్ల సింగరేణి కాలరీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ ఎం శ్రీ్ధర్ హర్షం ప్రకటించారు. రైల్వే లైన్ నిర్మాణం వలన సత్తుపల్లి నుంచి బొగ్గు రవాణా సురక్షితంగా జరుగుతుందని తెలిపారు. రైల్వే లైన్ నిర్మాణానికి భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని రైల్వే శాఖను కోరారు. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం రైల్వే లైన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం పట్ల కొవ్వూరు రైల్వే లైన్ సాధన సమితి నాయకుడు పాండురంగాచారి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
*మంత్రి తుమ్మల
వైరా, మార్చి 28: రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్టర్రోడ్లు భవనాల శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. మంగళవారం వైరా, ఏన్కూరు వ్యవసాయశాఖ మార్కెట్ కమిటీలకు నూతనంగా ఎన్నికైన చైర్మన్‌ల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. వైరా మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బాణోతు నర్సింహారావు, ఏన్కూరు మార్కెట్ కమిటి చైర్మన్‌గా భూక్యా సక్రునాయక్, ఇతర పాలకవర్గ సభ్యులు మంత్రి తుమ్మల నాగేశ్వరావు సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ పార్టీ రైతులకు అన్ని విధాల మేలు చేసేందుకు కృషి చేస్తుందని అన్నారు. అందులో భాగంగానే ఈసంవత్సరంతో పూర్తిగా రైతు సోదరుల ఋణమాఫీ చేసిందని అన్నారు. దళితులకు 3ఎకరాల భూమి పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్రంలో అమలు చేస్తుందన్న విషయాన్ని ఆయన ఈసందర్భంగా గుర్తుచేశారు. కేవలం ఖమ్మం జిల్లాలో డిసిసిబి ద్వారా అనేక మందిరైతుసోదరులకు అనేక రకాలుగా ఋణాలు అందజేస్తున్నదని అన్నారు. రాష్ట్రంలో ప్రతి మండలంలో వ్యవసాయ మార్కెట్ పరిధిలో గోడౌన్‌లు నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులేని రాష్ట్రం వెన్నుముక లేని మనిషి అనే నినాదంతో రైతుల శ్రేయస్సు కోసం రాష్టవ్య్రాప్తంగా ప్రాజెక్టులు అవసరమున్న ప్రతిచోట నిర్మించడానికి కృషి చేస్తున్నారని అన్నారు. పేదల కోసం డబుల్‌బెడ్‌రూం పేరుతో నిర్మించే రెండు పడకల గదుల నిర్మాణాన్ని ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ నిర్మించి తీరతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి విషయాన్ని ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయని ఆయన విమర్శించారు. అంతకుముందు స్థానిక అయ్యప్ప స్వామి ఆలయం నుండి మంత్రి తుమ్మలతో ప్రజాప్రతినిధులందరిని పూలు చల్లుకుంటూ, టపాసులు, బాణసంచా కాలుస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో వైరా, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు బాణోతు మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, జిల్లా జడ్పి చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, రాష్టవ్రిత్తనాభివృద్ధి చైర్మన్ కొండబాల కోటేశ్వరావు, జిల్లా టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ షేక్ బుడెన్ బేగ్, రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, టిఆర్‌ఎస్ మండల నాయకులు భాస్కర్‌రావు, తన్నీరు నాగేశ్వరావు, వనమా విశే్వశ్వరావు, నాగనబోయిన క్రిష్ణ, మాదినేని ప్రసాద్, మాదినేని సునీత తదితరులు పాల్గొన్నారు.