ఖమ్మం

నేటి నుంచి శ్రీసీతారామచంద్రస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, మార్చి 28: శ్రీసీతారామచంద్రస్వామి తిరుకల్యాణ బ్రహోత్సవాలు నేటి నుంచి శ్రీరామదివ్యక్షేత్రం భద్రాచలంలో ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 11 వరకు వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామనవమి బ్రహోత్సవాలు జరపనున్నారు. ఈ సందర్భంగా శ్రీరామదివ్యక్షేత్రాన్ని ముస్తాబు చేశారు. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన ఈ బ్రహోత్సవాలకు శ్రీకారం చుట్టడం ఆనవాయితీగా వస్తోంది.
ఏప్రిల్ 1న అంకురారోపణ
బ్రహ్మోత్సవాల్లో కీలకఘట్టం ఉత్సవాలకు అంకురారోపణ ఏప్రిల్ 1న చేయనున్నారు. ఉగాది నాడు స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేసి, పెళ్లికొడుకుగా అలంకరించి పూజలు చేస్తారు. ఉగాది పచ్చడి పంపిణీ చేసి, పంచాంగ శ్రవణం చేస్తారు. పంచమి రోజున ఏప్రిల్ 1న అంకురార్పణ చేసి, 2న ధ్వజపట భద్రక లేఖనం, గరుడాధివాసం, తిరువీధి సేవ, 3న అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, చతుఃస్థానార్చన, 4న బ్రహోత్సవాల్లో కీలకమైన ఎదుర్కోలు ఉత్సవం, గరుడ సేవ నిర్వహించనున్నారు. 5న శ్రీరామనవమి వేళ సీతారాముల కల్యాణం మిథిలాస్టేడియంలో అంగరంగ వైభవంగా చేయనున్నారు. ఆ రోజు సాయంత్రం శ్రీరామపునర్వసు దీక్షలు ప్రారంభం కానున్నాయి. సీతారాముల కల్యాణానికి ముఖ్యమంత్రి కెసిఆర్ దంపతులు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలతో రానున్నారు. 6న జరిగే మహాపట్ట్భాషేకానికి గవర్నర్ దంపతులు పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరుపున తీసుకుని వస్తారు. పట్ట్భాషేకం రోజు రాత్రి కల్యాణ సీతారాములకు రథోత్సవం వైభవంగా చేస్తారు. 7న స్వామికి సదస్యము, హంసవాహన సేవ, 8న తెప్పోత్సవం, చోరోత్సవం, అశ్వవాహన సేవ, 9న ఊంజల్‌సేవ, సింహవాహన సేవ, 10న వసంతోత్సవం, హవనం, గజవాహన సేవ, 11న చక్రతీర్థం, పూర్ణాహుతి, ధ్వజావరోహణం, దేవతోద్వాసన, ద్వాదశ ప్రదక్షిణలు, ద్వాదశారాధనలు, శ్రీపుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
నిత్యకల్యాణాలు రద్దు
బ్రహ్మోత్సవాల సందర్భంగా నేటి నుంచి ఏప్రిల్ 11 వరకు శ్రీసీతారామచంద్రస్వామికి నిత్యకల్యాణాలు, వెండిరథ సేవలు రద్దు చేశారు. ఏప్రిల్ 1 నుంచి 11 వరకు దర్బారు సేవలు, ఏప్రిల్ 1 నుంచి 19 వరకు పవళింపు సేవలు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం ఈఓ తాళ్లూరి రమేశ్‌బాబు వెల్లడించారు.

యుద ధప్రాతిపదికన ఇళ్ళ నిర్మాణాలు
* జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్
ఖమ్మం రూరల్, మార్చి 28: జిల్లాలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన వేగవంతంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్ తెలిపారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు దత్తత గ్రామమైన మద్దులపల్లిలో నిర్మించిన 22 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ఆయన మంగళవారం సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది పర్వదినాన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ప్రారంభిస్తారని తెలిపారు. జిల్లాకు నిర్దేశించిన 3,600 గృహాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి లబ్దిదారులకు అందజేస్తామన్నారు. మద్దులపల్లిలో నిర్మితమైన 22 గృహాలకు సంబంధించి లాటరీ ద్వారా లబ్దిదారులను ఎంపిక చేసినట్టు వెల్లడించారు. బుధవారం వీరందరూ మంత్రి సమక్షంలో సామూహిక గృహ ప్రవేశాలు చేయనున్నట్టు తెలిపారు. జిల్లాలో ప్రతి పదిరోజులకు కాలనీ ప్రారంభోత్సవం చేసే విధంగా పనులను వేగవంతం చేశామన్నారు. సివిల్ పనులను త్వరితంగా పూర్తవుతున్నాయని, శానిటరీ, ఎలక్ట్రికల్ తదితర వౌలిక పనులకే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందన్నారు. అక్టోబర్ 2017 నాటికి జిల్లాలో నిర్మాణంలో ఉన్న 3,600 గృహాలను పూర్తి చేసి లబ్దిదారులకు అందిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఏప్రిల్ మొదటి వారంలో సత్తుపల్లి నియోజకవర్గంలోని లంకపల్లిలో 28 గృహాలను ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. మధిర నియోజకవర్గంలో కూడా నిర్మాణ పనులను చురుకుగా సాగుతున్నాయని కలెక్టర్ చెప్పారు. మద్దులపల్లి గృహాలను సందర్శించిన వారిలో జెసి వినయ్‌కృష్ణారెడ్డి, రూరల్ తహశీల్దార్ జి నరసింహారావు, ఎంపిడిఓ సిహెచ్ శ్రీనివాసరావు, ఆర్ అండ్ బి జెఇ విశ్వనాధ్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.