ఖమ్మం

ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్లూరు, ఏప్రిల్ 9: గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశ పరీక్షలకు ఆదివారం 7పరీక్షాకేంద్రాల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు ఎంఇఓ కాకర్ల రంగారావు పేర్కొన్నారు. కల్లూరులో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రతిభా విద్యాలయం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, విఙ్ఞన్ పాఠశాల, తెలంగాణ పాఠశాల, జూనియర్ కళాశాల, బాలికోన్నత పాఠశాల, గురుకుల పాఠశాలల్లో మొత్తం 2,120 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 1984 మంది హాజరయ్యారు. ఏడు కేంద్రాల్లో మొత్తం 136 మంది గైర్హజరైనట్లు ఎంఇఓ తెలిపారు. ప్రవేశ పరీక్షలు జరుగుతున్న తీరును గురుకుల డిసిఓ ఎం పుల్లయ్య, గురుకుల ప్రన్సిపల్ కె సుధాకర్ పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి మాస్ కాపీ జరగకుండా ఎస్‌ఐ డి పవన్‌కుమార్ బందోబస్తు ఏర్పాటు చేసారు.

పేదల ఆవేదన నుంచి పుట్టిందే సమాచార చట్టం

ఏన్కూరు, ఏప్రిల్ 9: పేదల ఆవేదన నుండి పుట్టిందే సమాచార హక్కు చట్టమని దీనిపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, ఉమ్మడి రాష్ట్ర సమాచార హక్కు చట్ట కమిషనర్ లామ్ తాంతియాకుమారి అన్నారు ఆదివారం ఏన్కూరులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సమాచార హక్కు చట్టాన్ని ప్రజల వద్దకు తీసుకుపోయేందుకు సంబంధిత అధికారులంతా కృషి చేయలన్నారు. వ్వవస్థలో పారదర్శకత లేదని, అసమానతలు కనిపిస్తున్నాయన్నారు. సమాచార హక్కు చట్టం పల్లె పల్లెకు తీసుకువెళ్ళి గ్రామ సభలు నిర్వహించి వారికి అవగాహన కలిపించేందుకు కమిషన్ కృషి చేస్తుందని తెలిపారు. కొంత మంది ఐఎఎస్‌లు సమాచార హక్కు చట్టాన్ని పూర్తిగా తెలుసుకోకుండా చీకటి జిఒలు తెస్తున్నారన్నారు. కాని చట్టం తన పని తాను చేసుకొంటూ పోతుందని తెలిపారు. చట్ట ఉల్లంఘన, నియంత్రణ చేసే అధికారం ఎవరికి లేదన్నారు. అవినీతికి పాల్పడే ఎవరినైన సమాచార హక్కు చట్టం ద్వారా నిలదీయ వచ్చునని అన్నారు. కొంత మంది చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. అలాంటి వారిని నిలదీసేందుకు ప్రజలకు హక్కు ఉందని తెలిపారు. సమాచార హక్కు చట్టాన్ని వ్యతిరేకిస్తే అలాంటి వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవటం జరుగుతుందని అన్నారు. గతంలో కంటే ప్రస్తుతం కమిషన్ చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. చట్టం వచ్చి 12సంవత్సరాలు పూర్తి అయిన ఇంకా గ్రామీణ ప్రాంతాలలో దీనిపై అవగాహన లేక పోవటం వల్లనే సమాజంలో పారదర్శకత లోపించిందని అన్నారు. ప్రతి వ్యక్తి చట్టాన్ని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత వుందన్నారు.

ఘనంగా ఈస్టర్ డే ప్రదర్శన
కామేపల్లి, ఏప్రిల్ 9: మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో గుడ్‌ఫ్రైడేకు ముందు జరిగే ఈస్టర్స్‌డేను ఆదివారం క్రైస్తవ సోదరులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం మండల కేంద్రమైన కామేపల్లిలో ఇఎస్‌ఐ ఆధ్వర్యంలో మట్టలతో క్రైస్తవులు భక్తిగీతాలు ఆలపిస్తూ ప్రదర్శన నిర్వహించారు. క్రీస్తు సందేశాన్ని అనంతరం వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆంతోటి అచ్చయ్య, దానియేలు, వివిధ చర్చిపాస్టర్లు పాల్గొన్నారు.