ఖమ్మం

కూలీ చేసిన నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం (ఖిల్లా), ఏప్రిల్ 15: వరంగల్‌లో ఈ నెల 27న జరగనున్న టిఆర్‌ఎస్ బహిరంగ సభకు నిధులు సమీకరించేందుకు టిఆర్‌ఎస్ నేతలు శనివారం కూలీ పని చేశారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బేగ్ ఖమ్మం నగరంలోని ఓ సూపర్ మార్కెట్‌లో సరుకులు విక్రయించారు. రైతుబజార్ వద్ద ఉన్న ఉల్లిగడ్డల దుకాణంలో ఉల్లిగడ్డలు విక్రయించి నిధులు సమీకరించారు. త్రీ టౌన్ ప్రాంతంలోని రైస్‌మిల్లులో బియ్యం బస్తాలు మోశారు. రూరల్ మండలంలోని బిఎన్‌ఆర్ క్రషర్ మిల్లులో కంకర ఎత్తిపోశారు. ముదిగొండ మండలం గోగినేపల్లి వద్ద కల్లు అమ్మారు. సభ నిర్వహణకు కావల్సిన నిధులను కూలీ పని చేసి సమీకరించాలని పార్టీ అధినేత ఇచ్చిన పిలుపు మేరకు ఈ పనులు చేస్తున్నట్లు నేతలు వెల్లడించారు. ఆయన వెంట పార్టీ నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు, పోట్ల నాగేశ్వరరావు, నాగచంద్రారెడ్డి, రాంబాబు తదితరులు ఉన్నారు.
కొత్తగూడెంలో...
కొత్తగూడెం: వరంగల్‌లో ఈ నెల 27న నిర్వహించే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తరలివెళ్లే కార్యకర్తలకు దారి ఖర్చుల కోసం కొత్తగూడెం శాసనసభ్యుడు జలగం వెంకటేశ్వరరావు శనివారం కూలీ పనులు చేశారు. టిఆర్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపు మేరకు బస్టాండ్ సెంటర్‌లోని హోటల్లో దోశలు వేసి విక్రయించారు. పెద్దబజార్‌లో పెయింటింగ్ షాపు, కిరాణా షాపుల్లో కూలీ పనులు చేశారు. వస్త్ర దుకాణాలు, పూల దుకాణాలు, హోటల్ పలు చోట్ల కూలీ పనులు చేసి డబ్బు సంపాదించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పులి గీత, టిఆర్‌ఎస్ నాయకులు కంచర్ల చంద్రశేఖర్‌రావు, తూము వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ కంభంపాటి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందులో...
ఇల్లందు: టిఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ, బహిరంగ సభల కోసం ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు నిధులు సమీకరిస్తున్నారు. రొటీన్‌కు భిన్నంగా కూలీ పనులు చేసి నిధులు సేకరిస్తున్నారు. ప్రజా ప్రతినిధులుగా శాసించే నేతలే తలకు తలపాగా చుట్టి కూలీ పనులు చేస్తుంటే వ్యాపారులు, వివిధ వర్గాల ప్రముఖుల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఇల్లందు ఎమ్మెల్యే కోరకం కనకయ్య నిర్వహిస్తున్న కూలీ పనులకు గిరాకీ జోరుగా సాగుతుంది. తొలిరోజు హమాలీ అవతారంతో చేసిన కూలీ పనికి రెండు లక్షలు వచ్చాయి. శనివారం నాటి రెండవ రోజు కార్మికుడి అవతారంతో చేసిన కూలీ పనికి లక్షకు పైగా అదాయం వచ్చింది. రైస్ మిల్లులో బియ్యం మూటలు మోశారు. ఆస్పత్రుల్లో చిన్నచితక అటెండర్ పనులు చేశారు. అంతటితో ఆగకుండా పెంకు ఫ్యాక్టరీలలో కూలీలతో కలసి పెంకులు మోసారు. దాంతో ముచ్చటపడ్డ ఆయా సంస్థల యజమానులు వేలల్లో కూలీ డబ్బులు చెల్లించారు. రెండు రోజుల్లో ఎమ్మెల్యే కనకయ్య కూలీ పని చేసిన రెండు లక్షలకు పైగా నిధులు సమకూరాయి. ఆయనతోపాటు టిఆర్‌ఎస్ డివిజన్ నాయకుడు మడతా వెంకట్‌గౌడ్, డి రాజేందర్, గడ్డం వెంకటేశ్వర్లు, బి నాగేశ్వరరావు, ఎస్ సత్యనారాయణ, ఎస్‌కె జానీపాషా, అక్కిరాజు గణేష్ తదితరులు ఎమ్మెల్యే నడచిన కూలీ బాటలోనే పయణించి నిధులు సేకరించారు. మొత్తంమీద ఇల్లందు ఏరియాలో ఎమ్మెల్యేతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీనేతలు పడిన కూలీ శ్రమకు రూ 5 లక్షలకు పైగానే గిట్టుబాటైంది.
చేనేత కార్మికునిగా పొంగులేటి
నేలకొండపల్లి: చేనేత వస్త్ర తయారీ కార్మికునిగా ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పనిచేశారు. శనివారం మండలంలో పలు అభివృద్థి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా నేలకొండపల్లిలోని సామల కోటేశ్వరరావు స్వగ్రామం నందు చేనేత మగ్గంను ఆయన పరిశీలించారు. టిఆర్‌ఎస్ పార్టీ వరంగల్‌లో జరిగే ప్లీనరీ సమావేశానికి నిధులు సమకూర్చేందుకు పార్టీ నాయకులు కార్మికుల్లా శ్రమించి వచ్చిన ఆదాయంతో ప్లీనరీ ఖర్చులు పెట్టాలని అధిష్టానం ఆదేశాల మేరకు ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేనేత కార్మికునిగా పనిచేశారు. స్వయంగా మగ్గాన్ని అల్లారు.

మానవతా మూర్తులను ఆదర్శంగా తీసుకోవాలి

మధిర, ఏప్రిల్ 15: విద్యార్థులు మానవతామూర్తులైన మహా నేతలను ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలని మధిర శాసనసభ్యుడు మల్లు భట్టి విక్రమార్క, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ సూచించారు. శనివారం స్థానిక భరత్ విద్యా నికేతన్‌లో ఏర్పాటు చేసిన దశ విగ్రహాలను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ దేవతా విగ్రహలతో పాటు సమజానికి మార్గ దర్శకులుగా నిలిచి పునాదులు వేసిన వ్యక్తుల విగ్రహాలను పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. విద్యార్థులు మహా నేతలు ఆలోచన విధానాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకుని ఉన్నత స్థానాలకు ఎదిగి భవిష్యత్తులో సమజానికి మేలు చేయాలన్నారు. ఏదైనా సాధించాలి అనే లక్ష్యంతో ముందుకు సాగితే సాధించలేనిది ఏమీ లేదన్నారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా నిరాశ నిస్పృహలకు గురికాకూడదన్నారు. ప్రస్తుత సమాజంలో మానవత్వపు విలువలను మరిచి తల్లిదండ్రులను విస్మరిస్తూ వృద్ధాశ్రమాలలో చేర్పించడం బాధాకరమన్నారు. ఎవరెంత ఎత్తుకు ఎదిగినా మనుషులుగా జీవిస్తూ మానవత్వపు విలువలను పాటిస్తూ భారతీయ సాంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పాలన్నారు పిల్లలో ఉన్న ఆసక్తిని గమనించి వారిని ఆ రంగంలోనే ఎదిగేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భరత్ విద్యా సంస్థల అధినేత శీలం వెంకటరెడ్డి, కరస్పాండెంట్ విద్యాలత, యరమల రామలింగారెడ్డి, ఎంపిపి వేమిరెడ్డి, వెంకట్రావమ్మ, జడ్పిటిసి మూడ్ ప్రియాంక, నగర పంచాయతీ చైర్‌పర్సన్ మొండితోక నాగరాణి, గుర్రం శ్రీకాంత్, మువ్వా శ్రీనివాసరావు, ఎంఇవో ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన ఉర్సు ఉత్సవాలు
ఖమ్మం రూరల్, ఏప్రిల్ 15: మండలంలోని ఆరెంపుల హజరత్ సయ్యద్ యాఖూబ్ షాహ్‌వలీ దర్గా ఉర్సు ఉత్సవాలు శనివారంతో ముగిసాయి. వేడుకల్లో భాగంగా ఆరెంపులలోని ముతవల్లి (నిర్వాహకుల) వారి ఇంటి నుంచి గురువారం గంధం, శుక్రవారం ఖందిల్ కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం రాత్రి 8:30 గంటలకు ఆరెంపులలో మేళతాళాలు, నృత్య ప్రదర్శనలతో ప్రారంభమైన ఖందిల్ ఊరేగింపు బారుగూడెం మీదుగా శనివారం ఉదయం దర్గాకు చేరుకుంది. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఖందిల్‌ను స్వామికి సమర్పించారు. దర్గా వద్ద జరిగిన ఉర్సు మహోత్సవానికి ఖమ్మంతో పాటు భద్రాచలం, కృష్ణా, నల్గొండ, వరంగల్, హైద్రాబాద్, కరీంనగర్ తదితర జిల్లాలకు చెందిన వేలాది మంది భక్తులు తరలివచ్చారు. అనేకమంది భక్తులు దర్గా పరిసరాలలో జాగారం చేశారు. శుక్రవారం రాత్రి హైద్రాబాద్‌కు చెందిన జావిత్ ఖవాల్ బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఖవాలి భక్తులను ఆకట్టుకుంది. ఉర్సు మహోత్సవాన్ని విజయవంతం చేసిన భక్తులకు దర్గా ఉత్తరాధికారులు షేక్ ఖాజామియా, ఎండి నసీర్, షేక్ దావూద్ కృతజ్ఞతలు తెలిపారు.