ఖమ్మం

చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఏప్రిల్ 15: చట్టానికి లోబడి ప్రతి ఒక్కరు నడుచుకోవాలని, శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తే చర్యలు తప్పవని ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్‌ఇక్బాల్ హెచ్చరించారు. శనివారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని, అందుకు కీలకమైన పోలీసులకు ప్రజలు సహకరించాలన్నారు. ఖమ్మం నగరంలో కొన్ని సమస్యలు తన దృష్టికి వచ్చాయని, ప్రధానంగా వాటర్ ప్లాంట్, ట్రాఫిక్ సమస్యలను అధిగమించాల్సి ఉందన్నారు. అనుమతులు లేని, ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించని వాటర్ ప్లాంట్లతో ప్రజలు ఆనారోగ్యం పాలవుతున్నారని, అటువంటి ప్లాంట్స్ మూసివేసేందుకు తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో గుట్కా దగ్గర నుంచి గంజాయి, గుడుంబా తయారీ, నల్లబెల్లం అమ్మకందారులపై గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్నవారిని, మహిళలు, చిన్నారులపై దాడులు చేస్తున్న వారిని క్షమించేది లేదన్నారు. షీ టీంలను అప్రమత్తం చేసి నేరాలను అదుపు చేస్తామన్నారు. శాంతి భద్రతలకు ఆటంకం కల్గించే వారి విషయంలో రాజీపడేది లేదన్నారు. ఖమ్మం కమిషనరేట్‌గా ఏర్పడిన నేపథ్యంలో ప్రత్యేక చట్టం అమలులోకి వస్తుందని, హైదరాబాద్ సిటీ పోలీస్ తరహా చట్టం వర్తిస్తుందన్నారు. రాస్తారోకోలకు అనుమతి తప్పనిసరని, వైన్ షాపులు, బార్లు నిర్దిష్ట సమయాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రతి నెల పోలీస్ స్టేషన్లను సందర్శించి, నాకాబందీ నిర్వహంచి నేరాలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. విలేఖరుల సమావేశంలో ఎసిపిలు గణేష్, సురేష్‌కుమార్, ప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రామయ్య ఆదాయానికి భారీగా గండి
భద్రాచలం టౌన్, ఏప్రిల్ 15: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో రామయ్య ఆదాయానికి భారీగా గండి పడింది. ఈ మేరకు దేవస్థానం శనివారం టిక్కెట్ల ఆదాయం వివరాలను వెల్లడించింది. మొత్తం కళ్యాణోత్సవానికి 22557 టిక్కెట్లు ముద్రించగా కేవలం 14143 టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. దేవస్థానం రూ.1,37,73,432 ఆదాయాన్ని ఆశించగా కేవలం రూ.95,20,700 మాత్రమే వచ్చాయి. మొత్తం 8414 టిక్కెట్లు మిగలగా రూ.42,52,732 ఆదాయానికి గండి పడింది. 2015లో రూ.94,49,160, 2016లో రూ.70,71,618 ఆదాయం రాగా 2017లో 95,20,700 మాత్రమే రావడం గమనార్హం. రూ.5000 విలువైన టిక్కెట్లు 1250 ముద్రించగా 303 మిగిలాయి. రూ.2 వేల టిక్కెట్లు 1700కు 760, రూ.1,116 టిక్కెట్లు 527కు 2, రూ.500 టిక్కెట్లు 1700కు 195, రూ.200 టిక్కెట్లు 7,598కి 2643, రూ.100 టిక్కెట్లు 6,032కి 1279 మిగిలాయి. ఇక పట్ట్భాషేకం టిక్కెట్లలో ఆదాయానికి భారీగా నష్టం వాటిల్లింది. రూ.250 టిక్కెట్లు 1250 ముద్రించగా 922 మిగిలాయి. రూ.100 టిక్కెట్లు 2500 ముద్రించగా 2310 టిక్కెట్లు మిగిలిపోయాయి.
మొత్తంగా బ్రహ్మోత్సవాల్లో శ్రీ సీతారామచంద్రస్వామి ఆదాయానికి కొందరు అధికారుల వైఖరి వల్ల గండిపడినట్లు తెలుస్తోంది. ప్రధానంగా పోలీసు అధికారులు తీరును ఏటా చూస్తున్న భక్తులు ఈసారి కళ్యాణం, పట్ట్భాషేకానికి రావడానికి జంకినట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయాన్ని ప్రారంభించినా ఈ స్థాయిలో నష్టం రావడం విశేషం.