ఖమ్మం

ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), ఏప్రిల్ 21: ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలన్నింటికి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అయినప్పటికీ ప్రైవేటు యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాలను తమకేమిటనే ధోరణితో తమ పాఠశాలలను యధావిధిగా నిర్వహిస్తున్నారు. రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. భానుడి తాపానికి ప్రజలే అల్లాడిపోతున్నారు. ఉష్ణోగ్రత తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులే సూచిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మాత్రం తమకేమి పట్టనట్లుగ వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ మండుటెండల్లో పాఠశాలలను నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఉదయం నుండి సాయంత్రం వరకు నడుపుతుండగా మరికొన్ని పాఠశాలలు మద్యాహ్నం వరకు నిర్వహిస్తున్నారు. జిల్లాలో దాదాపు 42డిగ్రీలకు పైగా ఉష్టోగ్రత నమోదు అవుతోంది. ఇంతటి విపత్కర పరిస్థితిలో కూడా పాఠశాలల యాజమాన్యాలు సెలవులు ప్రకటించకుండా విద్యార్థులను పాఠశాలలకు రప్పించి చిన్నారులను ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. కొన్ని పాఠశాలలు జిల్లా కేంద్రానికి దాదాపు 20కిలోమీటర్ల పైగా దూరంఉన్న గ్రామాల నుండి తమ బస్సులను పంపించి చిన్నారులను బడులకు రప్పిస్తున్నారు. మద్యాహ్నం పాఠశాలు ముగిసిన తర్వాత ఎర్రటి ఎండలో ముట్టుకుంటే కాలిపోయో విధంగా ఉన్న బస్సులలో చిన్నారులను తిరిగి ఇళ్ళకు పంపిస్తున్నారు. ఇంతటి ప్రమాదకర ఎండలను పరిగణలోకి తీసుకోకుండ పాఠశాలల యాజమన్యాలు వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కల్గిస్తుంది. సుదూర ప్రాంతాల నుండి విద్యార్థులను రప్పించి తిరిగి మండుటెండల్లో పంపించడం ప్రమాదకరమని తెలిసినప్పటికీ యాజమాన్యాలకు సోయిలేక పోవడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ విద్యాశాఖాధికారులు తమకేమి పట్టనట్లుగా వ్యవహరించడం, కనీసం చిన్నారులనే ధ్యాసకూడ లేకుండా ఇటు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, అటు ప్రభుత్వ విద్యాశాఖాధికారులు వ్యవహరించడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన విద్యాశాఖాధికారులు ప్రైవేటు పాఠశాలల నిర్వహణపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

పార్టీ అభ్యున్నతికి పాటుపడాలి
* వైసిపి జిల్లా అధ్యక్షుడు లక్కినేని

ఖమ్మం(గాంధీచౌక్), ఏప్రిల్ 21: జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి కార్యకర్తలు పాటుపడాలని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్‌బాబు అన్నారు. శుక్రవారం నగరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు సంక్షేమానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అనేక పథకాలు ప్రవేశపెట్టి ప్రజా సంక్షేమానికి పాటుపడ్డారన్నారు. జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆధరణ తగ్గలేదని, గతంలో 3ఎమ్మెల్యే స్థానాలు, ఒక ఎంపి స్థానం గెలుచుకున్న ఘనత వైసిపికే దక్కిందన్నారు. ఇదే ఆధరణతో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా జిల్లా పార్టీ కార్యాలయానికి శనివారం ప్రారంభించన్నుట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆయనతో పాటు ప్రధాన కార్యదర్శులు కొండా రాఘవారెడ్డి, రఫూల్, మహేందర్‌రెడ్డి, రాంగోపాల్‌రెడ్డిలతో పాటు రాష్ట్ర నాయకులు పాల్గొంటారన్నారు. శనివారం ఉదయం జిల్లాకు రానున్న గట్టు శ్రీకాంత్‌రెడ్డికి స్వాగతం పలుకుతూ నగరంలో భారీర్యాలీ నిర్వహించనున్నట్లు, అలాగే స్థానిక రాజ్‌పధ్ పంక్షన్‌హాల్‌లో సభను నిర్వహించననున్నామన్నారు. విలేఖరుల సమావేశంలో నాయకులు సంపటి వెంకటేశ్వర్లు, వెంకట్రామిరెడ్డి, పెద్దబోయిన శ్రీనివాస్, ఆలస్యం సుధాకర్, రామారావు, సత్యనారాయణ, బాలసౌరి, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.