ఖమ్మం

భానుడి భగభగలతో మండుతున్న కొత్తగూడెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, ఏప్రిల్ 28: భానుడి భగభగలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలు అగ్ని గోళంగా మారుతున్నాయి. సింగరేణి కాలరీస్, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్, నవభారత్ ఫెర్రో అల్లాయిస్, ఎన్‌ఎండిసిల నుంచి వచ్చే కాలుష్యం కారణంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెంలో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఉదయం తొమ్మిది గంటల నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండటంతో మధ్యాహ్నం సమయంలో బయటకి రావటానికి ప్రజలు భయపడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు కూలర్లు, ఎసిలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో వాటి ధరలకు రెక్కలొచ్చాయి. సింగరేణి కాలరీస్‌లో మొదటి, రెండవ షిఫ్టులకు కార్మికులు అధిక శాతం గైర్హాజరవుతున్నారు. వాతావరణ సమతుల్యం లోపించటంతో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతుంది. సింగరేణి ఓపెన్ కాస్ట్‌ల పుణ్యమా అని అడువులు అంతరించిపోవటంతో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రత వలన ఇబ్బందిపడే ప్రజలకు ప్రభుత్వం ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయాలి.
సత్తుపల్లిలో ఘోర రోడ్డుప్రమాదం
* శుభకార్యానికి వెళుతూ అమ్మమ్మ, మనుమడు దుర్మరణం
* మరో ఇద్దరికి తీవ్రగాయాలు
సత్తుపల్లి, ఏప్రిల్ 28: బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురై అమ్మమ్మ, మనుమడు దుర్మరణంచెందిన సంఘటన సత్తుపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సత్తుపల్లి పట్టణంలోని హనుమాన్‌నరగ్‌కు చెందిన బోగి కృష్ణకుమారి (62), రేగళ్ల వంశీ కృష్ణ(12) సాయిది జగదీశ్వరి, చామణి వౌనికబిందులు సత్తుపల్లి మండలం కిష్టాపురం గ్రామంలో బంధువుల ఇంట్లో అన్నప్రాసన కార్యక్రమానికి వెళ్ళేందుకు సత్తుపల్లి ప్రధాన రహదారి టివిఆర్ టవర్స్ వద్ద ఆటో ఎక్కారు. ఆటోలో ఎక్కిన ఐదు నిమిషాల్లో సత్తుపల్లిలోని పెద్ద వంతెన వద్ద అశ్వారావుపేట నుంచి సత్తుపల్లి వైపు వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అమ్మమ్మ బోగి కృష్ణకుమారి, మనుమడు రేగళ్ల వంశీ కృష్ణలు అక్కడికక్కడే మృతిచెందగా, ఒకే కుటుంబానికి చెందిన సాయిది జగదీశ్వరి, వౌనికబిందుతో పాటు ఆటో డ్రైవర్ సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామానికి చెందిన సాధు శివకృష్ణ, ఆటోలో ప్రయాణిస్తున్న నాగేశ్వరరావులకు తీవ్రగాయాలయ్యాయి. అందరూ కలిసి ఆనందంగా ఆటో ఎక్కిన ఐదు నిమిషాల్లోప్రమాదంలోజరిగి క్షతగాత్రులు హాహాకారాలు పెడుతుండంతో స్థానికులు శ్రమించి ఆటోను లారీ కింది నుంచి బయటకు తీసి క్షతగాత్రులను మరో ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని సత్తుపల్లి సీఐ పల్నాటి రాజేందర్ ప్రసాద్ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి, పోస్టు మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.లు తీవ్రగాయాల పాలయ్యారు.
మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి
* రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న
ఖమ్మం(గాంధీచౌక్), ఏప్రిల్ 28: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు తమ కర్తవ్యంగా భావించాలని, ఖమ్మం జిల్లాకు చెందిన వనజీవి రామయ్య పద్మశ్రీ అందుకోవడం రాష్ట్రానికే గర్వకారణమని రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. శుక్రవారం అటవీశాఖ కార్యాలయంలో పద్మశ్రీ దరిపల్లి రామయ్య దంపతులను జోగు రామన్న సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామన్య కుటుంబంలో జన్మించి సమాజానికి విశేష సేవలు అందించిన రామయ్యను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పర్యావరణాన్ని రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాద్యతగా పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ముందుకు రావాలన్నారు. ఇంత బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన రామయ్యకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. మంత్రి జోగు రామన్న అటవీశాఖ కార్యాలయంలో వనజీవి రామయ్య దంపతులతో కలసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ కన్సర్వేటర్ నర్సయ్య, జిల్లా అటవీ శాఖాధికారి సునిల్, అధికారులు ప్రకాశ్‌రావు, జి ప్రసాద్, వేణుమాధవ్, కవిత తదితరులు పాల్గొన్నారు.