ఖమ్మం

ఖమ్మంలో ఆధునిక హంగులతో పార్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), ఏప్రిల్ 28: ఖమ్మం అర్భన్ మండలం వెలుగుమట్ల వద్ద అత్యాధునిక హంగులతో పార్కును సుందరీకరిస్తున్నామని రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. శుక్రవారం మంత్రి జిల్లా పర్యటనలో భాగంగా ముదిగొండ మండలంలోని నర్సిరీని ఆకస్మికంగా సందర్శించి అటవీశాఖ ఆధ్వర్యంలో పంచుతున్న మొక్కలను పరిశీలించారు. లక్ష మొక్కలు పెంచాలనే లక్ష్యంతో ఇప్పటికే 68వేల మొక్కలు పంపీణికి సిద్దంగా ఉన్నాయని, వీటిలో చెర్రి, చిన్నతంగేరు, బుల్‌మోహార్, రాగి, మర్రి, జామ మొక్కలు ఉన్నాయని రేంజర్ అధికారి కవిత మంత్రికి వివరించారు. అక్కడ పనిచేస్తున్న కూలీలతో మంత్రి రామన్న మాట్లాడుతూ కూలీ వేతనాలు సక్రమంగా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ముదిగొండ నుండి ముత్తారం వరకు నాలుగు కిలోమీటర్ల రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటాలని సూచించారు. అటవీశాఖ అధికారుల కృషిని ఆయన అబినందించారు. అనంతరం వెలుగుమట్ల అర్భన్ పార్కు పనులను పరిశీలించారు. 250ఎకరాలలో నగరవన యోజన పథకం ద్వారా పెంచుతున్న మొక్కలను ఆయన పరిశీలించారు. 80లక్షల వ్యయంతో జరుగుతున్న అర్భన్‌పార్కు పనుల వివరాలను సంబందిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, జిల్లా కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్, సిఎఫ్‌ఒ జి నర్సయ్య, ఎఫ్‌డిఒ ప్రకాశ్‌రావు, అధికారులు ప్రసాద్, మాదవ్, కవిత, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
భానుడి భగభగతో జనం విలవిల
కల్లూరు, ఏప్రిల్ 27: వారం రోజులుగా మండలంలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవటంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నాలుగు రోజులుగా పగలు 42 నుండి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉండటంతో ఏప్రిల్‌లో ఈ విధంగా ఉంటే మేలో ఇంకెంత ఎండలుంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో జనం తమ పనులు సైతం పక్కన పెట్టి ఇంటిపట్టున తలదాచుకుంటున్నారు. ఎండల నుండి ఉపశమనాన్ని పొందేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఎండకు తోడు వడగాడ్పులు వీచటంతో ఇళ్లల్లోని జనం, వృద్ధులు, పిల్లలు అతలాకుతలం అవుతూ మునుపెన్నడు ఇంతటి ఎండలు చూడలేదంటూ వాపోతున్నారు. ఉపశమనం కోసం చల్లటి పానీయాల కోసం పరుగులు తీస్తున్నారు. ఇళ్లల్లో ఎండ నుండి ఉపశమనం పొందేందుకు కూలర్లు, ఇళ్ల బయట పట్టాలు కట్టుకొని నీళ్లు చల్లుకుని సేదదీరుతున్నారు.