ఖమ్మం

కెసిఆర్‌కు గుణపాఠం తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), ఏప్రిల్ 28: అధికారం ఉందని నోటికి వచ్చినట్లు మాట్లాడితే తగిన గుణపాఠం చెప్పక తప్పదని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థాయిని మరచి కాంగ్రెస్‌ను తిట్టడమే లక్ష్యంగా కెసిఆర్ వ్యహరిస్తున్నారని తగిన సమయంలో గుణపాఠం ప్రజలే చెబుతారన్నారు. వరంగల్‌లో జరిగిన టిఆర్‌ఎస్ సభలో శిఖండులు, వెధవలు అని అనుచిత వ్యాఖ్యలు చేసిన కెసిఆర్ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్క మాటా మాట్లాడలేదని, శిఖండి ఎవరో అక్కడే తేలిపోయిందన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కెసిఆర్ పట్ల విద్యార్థులు ఎక్కడ తిరగబడతారోనని తప్పించుకున్న సిఎం కాంగ్రెస్‌ను దూషించడం శోచనీయమన్నారు. రైతుల సభ అన్న కెసిఆర్ మిర్చికి మద్దతు ధర కల్పించాలని ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో రైతులు విధ్వంసానికి పాల్పడ్డ సంఘటనతో ఏది రైతు ప్రభుత్వమో తేలిపోయిందన్నారు. బలం లేనివాడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారని, ప్రజా సమస్యలపై అడిగే వారందరూ దద్దమ్మలు అనడం కెసిఆర్ నైజం అన్నారు. ఆనాడు ఆంధ్రోళ్ళు ద్రోహులు అన్న కెసిఆర్‌కు ఇప్పుడు తెలంగాణ పట్ల అదే ధోరణి అవలంబిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మంచినీళ్ళు అందించలేని ప్రభుత్వం మద్యాన్ని ఏరులై పారిస్తూ బడుగు, బలహీన వర్గాల ప్రజల బతుకులతో ఆడుకుంటున్నారని ప్రజా సంక్షేమం అంటున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేతనైతే రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. విలేఖరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఐతం సత్యం, కార్పొరేటర్ బాలగంగాధర్‌తిలక్, నాయకులు తాజుధ్దీన్, బాలాజిరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.