ఖమ్మం

మిర్చిని ప్రభుత్వమే కొనాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), మే 10: మిర్చికి 15వేలు మద్దతు ధర కల్పించి నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఎఐకెఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి కెచ్చెల రంగయ్య డిమాండ్ చేయాలి. స్థానిక సంఘ కార్యాలయంలో గురువారం జరిగిన ముఖ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మిర్చి పంట దాదాపు 2లక్షల ఎకరాలలో సాగుచేసి 3లక్షల టన్నుల దిగుబడి వచ్చిందన్నారు. ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేయడం కారణంగానే రైతుల మిర్చిని ఆశ్రయించారన్నారు. తీరా పంట చేతికి వచ్చిన తర్వాత ప్రభుత్వం రైతాంగాన్ని పట్టించుకోలేదన్నారు. కావాలనే దళారులు, వ్యాపారులు అధికారులతో కుమ్మక్కై ప్రారంభంలో ఉన్న క్వింటా మిర్చి 13వేల ధరను 3వేలకు పడవేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కడుపు మండిన రైతులు అధికారులను నిలదీసి ఆందోళనకు దిగారన్నారు. మిర్చి రైతుల ఆందోళనలను సాకుగా చూపి పది మంది రైతులపై అక్రమ కేసులు బనాయించి జైలు పంపించడంపై ఆయన మండిపడ్డారు. రైతు పండించిన మిర్చికి మద్దతు ధర ఇవ్వలేని ప్రభుత్వం రైతులపై రాజద్రోహం కేసులు బనాయించడం చేతనైందన్నారు. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే అధికారులు కేసులు పెట్టారన్నారు. మిర్చికి 15వేలు మద్దతు ధర ప్రకటించి, రైతులపై పెట్టిన అక్రమ కేసులు భేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

బొగ్గుగని కార్మికుల భవిష్యనిధిని ఇపిఎఫ్‌లో కలిపిత సమ్మె తప్పదు
* సింగరేణి జెఎసి నాయకులు వెల్లడి

కొత్తగూడెం, మే 10: బొగ్గుగని కార్మికుల భవిష్యనిధిని ఎంప్లాయిస్ ప్రాఫిడెంట్ ఫండ్ (ఇపిఎఫ్)లో కలిపితే సమ్మె తప్పదని సింగరేణి జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు వెల్లడించారు. బుధవారం వికె 7 ఇంక్లైన్‌లో నిర్వహించిన సమావేశంలో కార్మికులను ఉద్దేశించిన జెఎసి నాయకులు మాట్లాడారు. ప్రకృతికి విరుద్దంగా తమ ప్రాణాలను సైతం ఫణంగాపెట్టి, రక్తాన్ని చెమటగా మార్చి ఉత్పత్తి, ఉత్పాతకతలను తీసి సింగరేణిని లాభాల బాటలో నడిపిస్తున్న బొగ్గుగని కార్మికులకు సిఎంపిఎఫ్‌ను ఇపిఎఫ్‌లో కలపడాన్ని సహించేది లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉధ్యమిస్తామని హెచ్చరించారు. కేంద్ర బొగ్గుగని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సిఎంపిఎఫ్ ట్రస్టు బోర్డు 1998 నుంచి బొగ్గుగని కార్మికులు పింఛనుతోపాటు భవిష్యనిధి, గ్రాడ్యుడిటీ చెల్లిస్తుందని, ఇపిఎఫ్‌లో సిఎంపిఎఫ్‌ని విలీనం చేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా గ్రాడ్యుడిటీ పింఛను వర్తిస్తుంది కాబట్టి తక్షణమే ఈ విధానాన్ని విరమించుకోవాలని కోరారు. కార్మికుల సమస్యల సాధన కోసం ఐదు జాతీయ సంఘాలు జూన్ 19వ తేదీ నుంచి 21 వరకు సమ్మెకు పిలుపునిచ్చాయని, హక్కుల సాధన కోసం సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జెఎసి నాయకులు కూసన వీరభద్రయ్య, కర్ల వీరస్వామిలు ప్రసంగించగా నాయకులు కుమార్ రావు, రాంచందర్, గౌస్, సారయ్య, ప్రకాశ్‌రావు, శంకర్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.

పాల్వంచలో ఎటిఎం దొంగ అరెస్ట్

పాల్వంచ, మే 10: పాల్వంచ పట్టణంలోని పలు ఎటిఎం సెంటర్లలో ఒక వ్యక్తి చాకచక్యంగా ఎటిఎం నుండి డబ్బులను డ్రా చేస్తున్న వ్యక్తిని బుధవారం పాల్వంచ పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి పట్టణ ఎస్‌ఐ కరుణాకర్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. పాల్వంచలోని ఎర్రగుంట గ్రామానికి చెందిన బూర శ్రీనివాస్ అనే వ్యక్తి ఎటిఎం సెంటర్ వద్ద ఉండి సైబర్ నేరాలకు పాల్పడుతుండేవాడని తెలిపారు. ఈ నెల 5న పాల్వంచకు చెందిన గంగిశెట్టి ప్రసాదు, ఎస్‌కె రజాక్‌మియాలు డబ్బుల కోసం ఎటిఎం వద్దకు వెళ్లగా వారిరువురికి ఎటిఎం నుండి డబ్బులను డ్రా చేసుకోవటం తెలియకపోవటంతో అక్కడే ఉన్న శ్రీనివాస్‌ని ఆశ్రయించారు. దీంతో శ్రీనివాస్ చాకచక్యంగా వారిరువురి వద్ద నుండి ఎటిఎం కార్డులు తీసుకొని ముందుగా డబ్బులను డ్రా చేసి వారికిచ్చిన అనంతరం తిరిగి వారికి ఎటిఎం కార్డులు ఇచ్చే ముందు శ్రీనివాస్ వద్ద ఉన్న మరో ఎటిఎం కార్డులను వారికిచ్చి ప్రసాదు, రజాక్‌మియాలకు చెందిన ఎటిఎం కార్డులను తీసుకొని మరో ప్రదేశానికి వెళ్లి కొంత డబ్బులను డ్రా చేశాడు. వారిరువురి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయగా బుధవారం ఎటిఎం సెంటర్ వద్ద తారసపడుతున్న శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయట పడింది. శ్రీనివాస్ వద్ద నుండి రూ. 23వేల నగదును ఎటిఎం కార్డును స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపర్చనున్నట్లుగా తెలిపారు.