ఖమ్మం

రైతులను రౌడీలను చేసిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, మే 15: రైతులను రౌడీలుగా చిత్రీకరించి కేసులు నమోదుచేసిన ఘనత కెసిఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు, సత్తుపల్లి శాసన సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య ఆరోపించారు. సోమవారం స్థానిక కొత్తగూడెం క్లబ్‌లో తెలుగుదేశం మిని మహానాడు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై అక్రమకేసులు నమోదు చేసిన ప్రభుత్వం పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకొని సస్పెండ్ చేసిందని ప్రశ్నించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విదానాలపై అసెంబ్లీలో ఎండగడుతున్న శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి తనపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ , అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకుంటుందని ఆరోపించారు. ప్రజాపోరాటాలను నీరుగార్చేందుకు కెసి ఆర్ ప్రభుత్వం ఇందిరాపార్క్ వద్దవున్న ధర్నా చౌక్‌ను ఎత్తివేసేందుకు కుట్ర చేస్తుందన్నారు. ప్రభుత్వ విధానాలపై తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉధ్యమించి ప్రజలను చైతన్యవంతులను చేయాలని పిలుపునిచ్చారు. టిడిపి కొత్తగూడెం నియోజక వర్గ ఇన్‌చార్జ్ కోనేరు సత్యనారాయణ(చిన్ని) మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గంలో 2019లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు. కొత్తగూడెం నియోజక వర్గంలో ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 373 జి ఓ ప్రకారం కొత్తగూడెం పట్టణ ప్రజలందరికి ఇంటి క్రమబద్దీకరణ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య, వైరా నియోజకవర్గ ఇన్‌చార్జ్ మాలోత్ రాందాస్ నాయక్, జిల్లా తెలుగుదేశం నాయకులు కంచర్ల గోపాల కృష్ణ, మున్సిల్ వైస్‌చైర్మన్ రావి రాంబాబు, పాల్వంచ ఎంపిపి భూక్య అరుణ, తెలుగుదేశం నాయకులు రమణమూర్తినాయుడు, తులసి రెడ్డి, గుగులోత్ కృష్ణ, కొత్తకృష్ణారావు, వైస్ ఎంపిపి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

శ్మశాన వాటిక స్థల పరిరక్షణకు చర్యలు
* కలెక్టర్ లోకేష్ కుమార్
మధిర, మే 15: మధిరలో ఆక్రమణలకు గురైన హిందూ స్మశానవాటిక స్థల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక తహశీల్ధార్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో నగర పంచాయితీ చైర్‌పర్సన్ మొండితోక నాగరాణి ఆక్రమణలకు గురైన స్మశానవాటిక స్థలాన్ని సర్వే చేయించాలని వినతిపత్రాన్ని అందచేశారు. దీంతో స్మశానవాటిక స్థలాన్ని సర్వే చేయించి ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని నాగవరప్పాడు గ్రామం వద్దగల వూర చెరువును, స్మశానవాటిక స్థలాన్ని పక్కన ఉన్న రైతులు ఆక్రమించకున్నారని సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేయాలని ఆ గ్రామ సర్పంచ్ చావలి రామరాజు వినతిపత్రాన్ని అందచేశారు. శీషం మేరి అనే మహిళ 53 సర్వే నెంబర్‌లో తనకు ఇచ్చిన ప్రభుత్వ భూమికి పాస్‌బుక్ ఇవ్వడంలేదని కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించగా నగర పంచాయితీ పరిధిలోని 5 కిలోమిటర్ల లోపు ప్రభుత్వ భూమికి పట్టాదార్ పాస్‌పుస్తకం ఇవ్వడం కుదరదని తెలిపారు. అదే విధంగా నగర పంచాయితీ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పలువురు వార్డు సభ్యులు కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందచేశారు. గ్రీవెన్స్‌లో ఆర్‌డిఓ పూర్ణచంద్, డిఆర్‌డిఓ మురళీదర్‌రావు, డిపిఓ శ్రీనివాసరెడ్డి, తహశీల్ధార్ ఎం మంగీలాల్, ఎంపిడిఓ పి ఆల్బర్ట్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు