ఖమ్మం

పెనం మీద జనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(జమ్మిబండ), మే 15: భానుడు ఉగ్రరూపానికి గత రెండు రోజులుగా మధ్యాహ్నం సమయంలో బయటకు వచ్చేందుకు కూడా జనం జంకుతున్నారు. రాత్రి సమయంలో ఉక్కపోతకు అల్లాడిపోతున్నారు. సోమవారం ఖమ్మం, మధిరలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పాల్వంచ, మణుగూరు, భద్రాచలంలలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెరిగిన ఉష్ణోగ్రతలతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ఉదయం 7 గంటల నుండే ఉష్ణొగ్రత ప్రభావం తీవ్రంగా ఉండటంతో ప్రజలు ఇంటి నుండి బయటకు వెళ్ళెందుకు భయపడుతున్నారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో చిరువ్యాపారాలు చేసుకుంటు జీవిస్తున్న వారు రోడ్లపైకి వచ్చేందుకే జంకుతున్నారు. వేడిమి నుండి ప్రజలు ఉపశమనం పొందేందుకు శీతలపానీయాలు కొబ్బరిబొండాలు, జ్యూస్‌లను ఆశ్రయిస్తూ కొంతమేర ఉపసమనం పొందుతున్నారు. పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో ప్రజలు ప్రయాణాలు చేసేందుకు హడవెత్తిపోతున్నారు. ఉష్ణొగ్రతలు ఇలాగే కొనసాగితే ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టవల్సి ఉంటుంది. రోడ్లపై నీరు చల్లడంతో పాటు ఓఆర్‌ఎస్ పాకెట్స్‌ను సరఫరాచేసి ప్రజలు ఆనారోగ్యం పాలుకాకుండా తగిన జాగ్రత్తలపై విస్తృత ప్రచారం చేయవల్సి ఉంటుంది.