ఖమ్మం

సింగరేణిలో సమ్మెకు కార్మిక సంఘాల ఆత్రుత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జూన్ 6: సింగరేణిలో సమ్మె చేసేందుకు కార్మిక సంఘాలు ఆత్రుత పడుతున్నాయి. వారసత్వ ఉద్యోగాలే ప్రధాన లక్ష్యంగా ఐదు జాతీయ కార్మిక సంఘాలు సింగరేణిలో సమ్మె చేసేందుకు కార్మికులను సమాయత్తం చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో సుమారు 55 వేల మంది కార్మికులు సమ్మెలోకి దిగనున్నారు. సింగరేణిలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు వారసత్వ ఉద్యోగాలతోపాటు ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత నెల సింగరేణి యాజమాన్యానికి ఐదు జాతీయ కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చాయి. సమ్మెపై సింగరేణి యాజమాన్యం ఐదు జాతీయ కార్మిక సంఘాలతో మే 27వ తారీఖున హైద్రాబాద్‌లో చర్చలు జరిపాయి. వారసత్వ ఉద్యోగాలపై సింగరేణి యాజమాన్యం పూర్తి స్థాయిలో హామీ ఇవ్వకపోవటంతో కార్మిక సంఘాలు పోరాటాల వైపు మొగ్గు చూపాయి. సమ్మెకు కార్మికులను సన్నద్ధం చేసేందుకు జాతీయ కార్మిక సంఘ నాయకులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కొత్తగూడెంలోని సిఐటియు కార్యాలయంలో సమ్మె పరిస్థితులపై కార్మిక సంఘాల నాయకులు కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్మిక సంఘాలు సమ్మెబాట పడుతున్న నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం గుర్తింపు సంఘం ఎన్నికల కోసం ప్రయత్నిస్తుండటంతో కార్మిక సంఘాలు ఎన్నికలు ఇప్పుడు అవసరం లేదంటూ తిరస్కరించి సమ్మె విజయవంతం చేసేందుకు చర్యలు చేపట్టారు. సింగరేణి యాజమాన్యం నిర్దేశించుకున్న ఉత్పత్తి లక్ష్యం సమ్మె కారణంగా నీరుగారే ప్రమాదం ఉండటంతో సమ్మె నివారించేందుకు పావులు కదుపుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితికి అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు మాత్రం సమ్మెను వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేయకపోవటం గమనార్హం. ఏది ఏమైనా సింగరేణిలో దేశ వ్యాప్త బొగ్గు పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు సిఎంపిఎఫ్‌ను ఇపిఎఫ్‌లో విలీనం చేయటాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈ నెల 19,20,21 తేదీల్లో సమ్మె నిర్వహించనున్నారు. ఈ సమ్మె వలన సింగరేణి బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు ప్రారంభం
రుద్రంపూర్, జూన్ 6: తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లా సబ్ జూనియర్ హాకీ పోటీలు కొత్తగూడెం హాకీ క్లబ్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ పులి గీత హాజరై మాట్లాడుతూ పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహీత నందనూరి ముఖేష్‌కుమార్ కొత్తగూడెం రావటం ఆనందదాయకమని అన్నారు. క్రీడలు చిన్నారుల్లో ఏకాగ్రత, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తాయన్నారు. చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడలను కెరీర్‌గా మలుచుకుని జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. అనంతరం ముఖేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో జాతీయ క్రీడ అయిన హాకీని మరింతగా అభివృద్ధి పరచేందుకు కృషి చేస్తానని అన్నారు. తెలంగాణ హాకీ ఆసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పాటుపడతానని తెలిపారు. క్రీడలను అభివృద్ధి పరచేందుకు త్వరలో మరిన్ని మైదానాలను అందుబాటులోకి తెస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకుడు జివికె మనోహర్, అథ్లెటిక్ ఆసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మహిధర్, అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ తలశిల భరత్‌కృష్ణ, నిర్వాహకులు భట్టు ప్రేమ్‌కుమార్, లాజరస్, సలీంఖాన్, రిటైర్డ్ ఎమ్మార్వో నాగరాజు, టిఆర్‌ఎస్ నాయకులు లగడపాటి రమేష్, కోచ్ ఇమాం, సలీం, చారి పాల్గొన్నారు.