ఖమ్మం

నిర్బంధాలు ఎదిరించైనా పోడు భూములను కాపాడుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జూన్ 20: తెలంగాణ ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు సృష్టించినా పోడు భూములను కాపాడుకుంటామని సిపిఐ ఎంఎల్ న్యూ డెమొక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు బాలచంద్ర షడంగి అన్నారు. సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో మంగళవారం పోడు వ్యవసాయదారులు కొత్తగూడెంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుండి ప్రారంభమైన ప్రదర్శన కలెక్టరేట్‌కు చేరింది. కలెక్టరేట్‌ను ముట్టడించిన అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం హరితాహారం పేరుతో ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూములను లాక్కునేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొడతామని అన్నారు. అనేక పోరాటాలు చేసి సాధించుకున్న అటవీ హక్కుల యాజమాన్య చట్టాన్ని నీరుగార్చే విధంగా ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని ఆరోపించారు. అన్నంపెట్టే రైతన్నపై ప్రభుత్వ కక్ష సాధించే చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం నిర్వహించిన పోరాటాలో స్ఫూర్తితో పోడు భూములపై ఎలాంటి త్యాగాలకైనా వెనకాడేదిలేదన్నారు. ప్రభుత్వం దళితులకు, గిరిజనులకు మూడెకరాల వ్యవసాయ భూమి ఇస్తామని హామీ ఇచ్చి వాటిని అమలు చేయకుండా ఉన్న భూమిని లాక్కుంటోందని విమర్శించారు. ఎఐకెఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు, పివోడబ్ల్యు రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ, గుండాల, బయ్యారం జెడ్పీటీసీ సభ్యులు గొగ్గెర్ల లక్ష్మీ, గౌని ఐలయ్య తదితరులు ప్రసంగిస్తూ పేదల సంక్షేమాన్ని తెలంగాణ ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించారు. పేదలు అభివృద్ధి సాధించకుండా బంగారు తెలంగాణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ పార్టీ నాయకులు ముక్తి సత్యం, జెడ సీతారామయ్య, మాచర్ల సత్యం, రేసు బోసు, తుపాకుల నాగేశ్వరరావు, ఉమర్, కందికట్ల సురేందర్, సంజీవ్, సతీష్, నగేష్, లాలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శనకు అగ్ర భాగాన అరుణోదయ కళాకారులు డప్పు నృత్యాలు చేశారు.