ఖమ్మం

ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(జమ్మిబండ), జూన్ 20: జిల్లాలో సాగునీటి కోసం చేపడుతున్న అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రఘునాధపాలెం మండలం జూన్‌బాద్‌తండా వద్ద మునే్నరు వాగుపై 1.90కోట్ల వ్యయంతో నిర్మించిన చెక్‌డ్యాం అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఇంకను అసంపూర్తిగా ఉన్న డ్యాం పనులను వేగవంత చేసి వెంటనే పూర్తి చేయాలని సూచించారు. మునే్నరువాగు నీరు చుట్టుప్రక్కల గ్రామాలకు సాగునీరు అందించే విధంగా చెక్‌డ్యాంలు నిర్మాణం చేపట్టాలన్నారు. మునే్నరు వాగు ఎల్లప్పుడు నీటితో నిండిఉండే విధంగా డ్యాం నిర్మాణం చేపట్టాలన్నారు. మునే్నరు వాగుపై అదనంగా మరొక చెక్‌డ్యాం నిర్మించేందుకు డిజైన్ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నిర్మించిన చెక్‌డ్యాంతో పరిసర ప్రాంతాలలోని 500ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుందన్నారు. అనంతరం చింతపల్లి చెరువును మంత్రి పరిశీలించారు. ఈ చెరువును సుందరంగా ఆదర్శవంతమై చెరువుగా అభివృద్ధి పరచాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పి చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, డిసిసిబి చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, ఖమ్మం ఆర్డీఒ పూర్ణచందర్‌రావు, జడ్పి సిఇఒ మారుపాక నగేష్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.