ఖమ్మం

గ్రామీణ వ్యవస్థను పటిష్ఠపరుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమాలయపాలెం, జూన్ 20: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు కెసిఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందని, బంగారు తెలంగాణ సాధనకు ఇది పునాది అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం తిరుమలాయపాలెం మండల కేంద్రంలో జరిగిన గొర్రెల పంపిణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యాదవులు, కురుమలకు అందజేస్తున్న గొర్రెలను పరిశీలించారు. వారికి గొర్రెలను అందిస్తున్నట్లుగా ధృవపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కొందరు రైతులు, యాదవుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సభలో ఆయన మట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో పనిచేస్తుందన్నారు. ఇందులో భాగంగానే కురుమలు, యాదవులకు గొర్రెలను పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7లక్షల మందికి పైగా ఈ పథకంలో భాగస్వాములు అవుతున్నారన్నారు. పూర్య కాలంలో పశుసంపద అధికంగా ఉండేదని ఆవులు, గేదెలు, మేకలను పెంచి పశుగణాభివృద్ది చేసేవారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి గొర్రెలు అవసరమని ప్రభుత్వం గుర్తించిందన్నారు. రెండేళ్ళలో ఇది తరగని సంపదగా మారనున్నదన్నారు. ప్రస్తుతం ఖర్చు చేస్తున్న ఐదువేల కోట్లతో రెండేళ్ళలో 25వేల కోట్ల సంపదను సృష్టించుకోనున్నామన్నారు.
జిల్లా వ్యాప్తంగా 427గ్రామ పంచాయతీల్లో 339 సొసైటీలను ఏర్పాటు చేశామన్నారు. వాటిని ఏ,బి గ్రూపులుగా విభజించి ఏ గ్రూప్ వారికి ఈ ఏడాది పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఫారెస్ట్ ప్రాంతంలో 12వేల ప్యాకెట్ల గడ్డి విత్తనాలను కూడా వేయనున్నామన్నారు. కుల వృత్తులను కాపాడటం కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలకు ప్రజల సహకారం అవసరమన్నారు. దేశంలోనే ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా మారనున్నదని వెల్లడించారు. గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కుల వృత్తిదారులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేపడుతున్న పథకాలు ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే ఒంటరి మహిళలకు కూడా పెన్షన్లు ఇచ్చిన ఘనత తమకే దక్కిందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుండేందుకు కెసిఆర్ అనేక పథకాలు చేపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, కలెక్టర్ లోకేష్‌కుమార్, ఎమ్మెల్సీ లక్ష్మినారాయణ, డిసిసిబి చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, బుడాన్‌బేగ్, పిడమర్తి రవి, ఎంపిపి అశోక్, జడ్పీటిసి బోడా విజయ, ఎండిఓ సన్యాసయ్య, తహశీల్దార్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.