ఖమ్మం

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొణిజర్ల, జూన్ 20: యోగా అంటే కేవలం ఆసనాలే కాదు.. ముఖారవిందంలో చిరునవ్వు, నడకలో వేగం, మాటల్లో సూటితనం స్పష్టత, మనిషిలో గణనీయమైన, సానుకూలమైన మార్పు ఇన్ని లక్షణాలు యోగాతో సాధ్యమని నిరూపించింది యోగా. యోగాపట్ల ఉన్న సవాలక్ష సందేహాలను పక్కన పెడితే..ఒంటికి యోగా మంచిదేనని శాస్ర్తియంగా రుజువైంది. భారత్‌లో పుట్టిన యోగా విశ్వవ్యాప్తమైన అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. సాధారణంగా యోగా అనగానే ఆసనాలు గుర్తుకొస్తాయి. కానీ యోగా ప్రయోజనాలు, పరిధి విస్తృతం. జీవనశైలిని, ఆలోచనను, ప్రవర్తనను యోగా సాధన విశేషంగా ప్రభావితం చేస్తుంది. యోగాతోనే అందం, ఆరోగ్యం సిద్ధిస్తుందని, యోగా వలన మరేన్నో ప్రయోజనాలున్నాయని శాస్ర్తియంగా రుజువైంది. అందుకే యోగా అంతర్జాతీయంగా యోగా ప్రాచుర్యం పొందింది. ఏదైన పని సమర్థంగా జరగాలన్నా, తాము చేసే పనుల్లో నైపుణ్యత సాధించాలన్నా యోగాను ఆశ్రయిస్తున్నారు. యోగాలో ఆష్టాంగ స్థితులను క్రమ పద్ధతిలో ఆచరిస్తే సత్ఫలితాలు సాధ్యమని యోగా గురువులు సెలవిస్తున్నారు. నేటి వేగవంతమైన జీవనంలో మనిషిలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మానసిక ఒత్తిడి కారణంగా వ్యాధుల బారిన పడి అనారోగ్యం పాలౌతున్నారు. ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ యోగాను అశ్రయిస్తున్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాపై స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో పిడి శ్రీనివాస్ విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ఉపయోగాలను తెలియజేస్తున్నారు. యోగా దినోత్సవం రోజున పాఠశాలలో 300 మంది విద్యార్థులతో యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీనివాస్ తెలిపారు.