ఖమ్మం

అటవీహక్కు చట్టాన్ని పటిష్ఠంగా అమలుపరచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), జూన్ 20: అటవీహక్కు చట్టాన్ని పటిష్ఠంగా అమలు పరుస్తూ పోడు సాగుచేసుకొని జీవిస్తున్న గరిజన రైతులకు పట్టాలు ఇవ్వాలని సిపిఐ(ఎంఎల్), న్యూడెమోక్రసి రాష్ట్ర సహయ కార్యదర్శి పోటు రంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో 7లక్షల ఎకరాలలో పోడును సాగుచేస్తున్నారని, వీటిలో కేవలం 1.5లక్షల ఎకరాలకు మాత్రమే హక్కు పత్రాలు ఇచ్చారన్నారు. అటవీ, రెవిన్యూ శాఖాధికారులు మిగతా భూములకు పట్టాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. దశాబ్దాల తరబడి పోడును సాగుచేసుకుంటున్న గిరిజనులు, పేదలు హక్కుల కోసం పోరాడి సాధించుకున్న అటవీహక్కుల చట్టంను పాలకులు అటకెక్కించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం నెపంతో మొక్కలు నాటే సాకును చూపుతూ పోడుసాగుదారులపై అధికారులు దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేసిన పంటలను సైతం నాశనం చేస్తున్నారన్నారు. ఇదేమని అడిగిన వారిపై అక్రమంగా కేసులు బనాయిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ ఏడాది కూడా సత్తుపల్లి, పెనుబల్లి, తల్లాడ, ఏన్కూర్ తదితర ప్రాంతాల్లో గిరిజనులు సాగుచేసుకుంటున్న పోడు భూముల్లో అధికారులు అడ్డుకుంటూ పిడి యాక్ట్ పెడతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పోడుసాగుదారులపై జరుపుతున్న దౌర్జన్యాలను నిలిపివేసి వారిని అదుకోవాలని డిమాండ్ చేశారు. విలేఖరుల సమావేశంలో గోకెనెపల్లి వెంకటేశ్వర్లు, రాయల చంద్రశేఖర్, ఆవుల వెంకటేశ్వర్లు, జి రామయ్య, సివై పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

పొంగిన ప్రవహిస్తున్న పాకాల ఏరు
* రాకపోకలకు అంతరాయం
గార్ల, జూన్ 20: నర్సంపేట అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో పాకాల ఏరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో గార్ల మండలం రాంపురం గ్రామపంచాయతీకి రాకపోకలు నిలిచి పోయాయి. అనుకోకుండా గత రాత్రి కురిసిన వర్షంతో ఒకే సారి వరద నీరు పాకాల ఏటిలోకి చేరటంతో ఏరు రెండు అంచులకు ఆనుకొని ప్రవహిస్తోంది. రాంపురం ప్రజలు రాకపోకలు సాగించేందుకు, గార్ల పట్టణ ప్రజలకు తాగునీరు అందించేందుకు పాకాల ఏటిపై రోడ్‌వే కమ్ చెక్‌డ్యాం నిర్మాణం గావించారు. వరద నీటిలో చెక్‌డ్యాం పూర్తిగా మునిగి పోవటంతో రాంపురం పంచాయితీలోని మద్దివంచ, కొత్తతండా, పులిగుట్టతండాలతో పాటు కొరివి, డోర్నకల్, మహబూబాబాద్ మండలాలోని పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. ప్రతి నిత్యం తమ కనీస అవసరాలు తీర్చుకునేందుకు అయా గ్రామాల ప్రజలు గార్లకు వస్తుంటారు. గత రెండు రోజుల నుంచి వరద ఉధృతి తగ్గక పోవటంతో రైల్వే వంతెనే అధారంగా కొందరు నడకదారి ద్వారా గార్లకు చేరుకొని తమ అవసరాలు తీర్చుకుంటుంన్నారు. పాకల ఏటిపై నిర్మించిన రోడ్‌వే కమ్ చెక్‌డ్యాం ఎత్తు పెంచాలని గతంలో పలుమార్లు అ ప్రాంత ప్రజలు చేసిన విజ్ఞప్తులు ప్రభుత్వం పట్టించుకోక పోవటంతో ప్రజలు గత కొనే్నళ్ళుగా ఇబ్బందులు ఎదుర్కొంటునే ఉన్నారు. ఇప్పటికైన పాలకులు పరిశీలన జరిపి గార్ల పాకాల ఏరు చెక్‌డ్యాం ఎత్తు పెంచాలని ప్రజలు కోరుతున్నారు.