ఖమ్మం

కృష్ణ మాదిగ అక్రమ అరెస్టుకు నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్), జూన్ 27: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిగల కోసం పోరాడుతున్న ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అక్రమ అరెస్టుకు నిరసగా మంగళవారం స్థానిక జెడ్పి సెంటర్‌లోని అంబేద్కర్ సెంటర్‌లో ఎంఆర్‌పిఎస్ నాయకులు కళ్ళకు గంతెలు కట్టుకొని, కాళ్ళు, చేతులకు సంకెళ్ళు వేసుకొని నిరసన, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్‌పిఎస్ జిల్లా ఇన్‌చార్జ్ ఇరుగు పిచ్చయ్య మాట్లాడుతూ అమరావతిలో తలపెట్టిన కురుక్షేత్ర మహసభ విజయవంతం కోసం సన్నాహక సదస్సులు జరుపుతున్న మందకృష్ణమాదిగను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. అరెస్టు చేసిన మందకృష్ణ మాదిగను వెంటనే విడుదల చేయాలని, కురుక్షేత్ర మహసభకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమరావతిలో నిర్వహించే మహసభకు అనుమతి ఇవ్వకపోతే టిడిపి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంజయ్య, రాము, క్రాంతి, ఆశోక్, అంబేద్కర్, శ్యామల, లక్ష్మయ్య, నాగేశ్వరరావు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
నేలకొండపల్లిలో...
నేలకొండపల్లి: ఎంఆర్‌పిఎస్ వ్యవస్ధాపకుడు మందకృష్ణమాదిగ అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ నేలకొండపల్లిలో ఎంఆర్‌పిఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సోమవారం నేలకొండపల్లి పెట్రోల్ బంకు వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు మందకృష్ణమాదిగను అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు కళ్లకు గంతలు కట్టుకుని చేతులు, కాళ్లను తాళ్లతో కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మండల ఇన్‌చార్జ్ నూకల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రజా హక్కులను కాల రాస్తున్నాడని, ప్రజాస్వామ్యంను ఖూని చేస్తున్నాడని ఆరోపించారు. జూలై 7న అమరవతిలో జరిగే కురుక్షేత్రం మహాసభకు ప్రతి ఒక్కరు హాజరై చంద్రబాబుకు బుద్ధి చెప్పాలన్నారు. అవరావతి సభ విజయవంతకు ప్రతి నాయకుడు తరాలి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో విస్సాక్, వీరిమదు మాదిగ, శ్రీను మాదిగ, బొడ్డు వెంకన్న, వెంకటేశ్వర్లు, మహేష్, రాంబాబు, రామరావు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
తిరుమలాయపాలెంలో...
తిరుమలాయపాలెం: జూలై 7న అమరావతిలో మాదిగలు, ఇతర ఉపకులాలు నిర్వహించ తలపెట్టిన మాదిగల కురుక్షేత్ర మహాసభను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడ్డుకుంటున్నాడని పేర్కొంటూ మంగళవారం ఎంఆర్‌పిఎస్ కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కళ్ళకు గంతలు కట్టుకొని చేతులు, కాళ్ళకు బంధాలు వేసుకొని నల్లజెండాలతో స్థానిక అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఎంఆర్‌పిఎస్ జిల్లా సీనియర్ నాయకులు కందుల బాబు, మండల అధ్యక్షులు పగిడిపల్లి బాబు, నాయకులు టేకుమట్ల బాబు, గొర్రెపాటి దర్గయ్య, గంటా కృష్ణ, గుగ్గిళ్ళ అశోక్, పెద్దరాములు, నాగయ్య, చాగంటి నాగయ్య, సాగరిక, ఆరెంపుల బాబు తదితరులు పాల్గొన్నారు.

వస్త్రాలపై జిఎస్‌టిని ఉపసంహరించుకోవాలి
* సత్తుపల్లిలో వస్తద్రుకాణాల బంద్
సత్తుపల్లి, జూన్ 27: వస్త్రాలపై జీఎస్‌టి (వస్తుసేవల పన్ను) ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మంగళవారం సత్తుపల్లి క్లాత్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వస్తద్రుకాణాలు బంద్‌చేశారు. సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు చిట్లూరి రుక్మంధర్‌రావు, ప్రధాన కార్యదర్శి మల్లూరి అంకమరాజు మాట్లాడుతూ ఇప్పటి వరకు వస్త్రాలపై పన్నులేదన్నారు. జీఎస్‌టి ప్రవేశపెట్టడం వల్ల వస్త్రాలపై పన్నులు విధించటంతో ప్రజలపై తీవ్రమైన భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వస్త్ర వ్యాపారులు రేపాకుల శ్రీను, బోశెట్టి రమేష్, రతికంటి సత్తిబాబు, వక్కలగడ్డ ఆంజనేయులు, కొత్తూరు రాజేష్, రేపాకుల కుమార్, సిహెచ్ దాసరధి, సత్తార్ పాల్గొన్నారు.