ఖమ్మం

నిజాలు మాట్లాడితే విమర్శలా...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), జూలై 18: వాస్తవాలు మట్లాడిన భట్టివిక్రమార్కపై తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు టిఆర్‌ఎస్ నేతలు ప్రత్యారోపణలకు దిగుతున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఐతం సత్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిఆర్‌ఎస్ నేతలు కొండబాల కోటేశ్వరరావు ఆయన అనుచరులు భట్టిని విమర్శించడం వారి రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. భక్తరామదాసు ప్రాజెక్ట్ నీటికేటాయింపులు జరగలేదని, సాగర్ ఆయకట్ట పంటపొలాలు బీడుభూములుగా మారతాయన్నారు. భక్తరామదాసు ప్రాజెక్ట్‌కు 7టిఎంసి నీటికేటాయింపునకు అనుమతులు పొందవల్సి ఉందన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్ట్‌లు ఎలా చేపడతారో టిఆర్‌ఎస్ నేతలే చెప్పాలన్నారు. తమ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులనే రీడిజైనింగ్ పేరుతో కోట్లాది నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, నిజాలు మాట్లాడితే నిందారోపణలు చేస్తున్నారన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం మాటల గారడితో ప్రజలను, రైతులను మభ్యపెడుతున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో వారే గుణపాఠం చెబుతారన్నారు. విలేఖరుల సమావేశంలో కార్పొరేటర్ వడ్డెబోయిన నర్సింహరావు, పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
ఉనికి కోసమే భట్టి ఆరోపణలు
* మండలాధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు
బోనకల్లు, జూలై 18 : కాంగ్రెస్ ఉనికి కోసమే టిఆర్‌ఎస్ పార్టీపై, కెటిఆర్‌పై భట్టి విక్రమార్క తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని టిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం స్ధానిక టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణా అన్ని రంగాల్లో ముందంజలో ఉండేలా సిఎం కెసిఆర్ అహర్నిశలు కృషిచేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవనే భట్టి విక్రమార్క కెసిఆర్, కెటిఆర్‌లపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ గ్రామస్థాయిలో రోజురోజుకు బలోపేతమవుతుందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారన్నారు. ఇప్పటికైనా భట్టి టిఆర్‌ఎస్ పార్టీపై చేస్తున్న ఆరోపణలు మానుకోవాలన్నారు. విలేఖరుల సమావేశంలో తాళ్ళురి డేవిడ్, ప్రదీప్, బోయినపల్లి మురళి, సత్యనారాయణ, మోదుగుల నాగేశ్వరరావు తదితరులున్నారు.

ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలి
* సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు
ఖమ్మం రూరల్, జూలై 18: లక్ష కోట్ల రూపాయలతో వ్యవసాయ ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈడిమాండ్‌పై ఈనెల 24వ తేదీన చేపట్టే జిల్లా కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని కోరుతూ సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు మంగళవారం మండలంలోని వరంగల్ క్రాస్‌రోడ్‌లో జీపుజాతా కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోతుందని, వ్యవసాయమంటే భయపడే దుస్థితి నెలకొందన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకున్న దాఖలాలు లేవన్నారు. పంట పండితే గిట్టుబాటు ధర ఉండదు, గిట్టుబాటు ధర ఉన్నా పంట పండే పరిస్థితి లేదని, అందుకే వ్యవసాయ ఉత్పత్తుల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. బిజెపి, టిఆర్‌ఎస్ పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందాయన్నారు. అర్హులందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు, కెజీ టు పీజీ ఉచిత విద్య అందించాలని సిపిఐ డిమాండ్ చేస్తుందన్నారు. పోడు సాగు రైతులపై రాష్ట్ర ప్రభుత్వం హింసాత్మక చర్యలకు పాల్పడుతుందని, ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. హైద్రాబాద్ నడిబొడ్డున వేలాది ఎకరాలు ఆక్రమించుకుంటున్న వారిని వదిలేసి పోడు సాగుచేసుకుంటున్న రైతులపై కేసులు నమోదు చేయడం విచారకరమన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోటు ప్రసాద్, దండి సురేష్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మిడకంటి చిన వెంకటరెడ్డి, నాయకులు పగిళ్ల వీరభద్రం, సిహెచ్ భాస్కర్, వెంపటి సురేందర్, రామకోటి, శాబాదు నారాయణరెడ్డి, రాము, వెన్నం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.