ఖమ్మం

నిరంతర కృషి వల్లే అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: ప్రజల మద్దతు, నిబద్దత, సమన్వయంతో చేసిన నిరంతర కృషివల్లే అభివృద్ధి సాధ్యమవుతున్నదని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కలెక్టర్, పోలీస్ కమిషనర్‌లతో కలిసి పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమల్లో ఖమ్మంజిల్లా అగ్రగామిగా నిలిచిందన్నారు. మహనీయుల ఆశయాలు, త్యాగాలను ఆదర్శంగా తీసుకొని ప్రపంచ దేశాలలోనే రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింభిస్తూ రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి ఆశయం మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని హరితరాష్ట్రంగా మార్కేందుకు జరుగుతున్న చర్యల్లో ఖమ్మం అగ్రగామిగా నిలుస్తున్నదన్నారు. వ్యవసాయ రంగాన్ని, రైతులను ఆదుకునేందుకు వచ్చే ఏడాది నుంచి ఎకరానికి నాలుగువేల ఎకరాలను ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 1652కోట్ల రుణమాఫీ చేయడమే కాకుండా పంట రుణాల నిర్దేశిత లక్ష్యాలను సాధించేదిశగా పనిచేస్తున్నామన్నారు. జిల్లాలో అత్యంత ప్రాధాన్యతకలిగిన ఉద్యాన పంటలను పలు పథకాలతో ప్రోత్సహిస్తున్నామన్నారు. సాదాబైనామా పట్టాల ప్రక్రియలో జిల్లాలో ఇప్పటివరకు 96వేల మంది రైతులకు పట్టాలను అందించిన ఘనత మనకే దక్కిందన్నారు. పట్టణ ప్రాంతాలతో సమానంగా గ్రామీణ ప్రాంతాలకు 24గంటల నిరంతర విద్యుత్‌ను అందిస్తున్నామని, వచ్చే రబీ సీజన్ నుంచి వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. 510కోట్ల రూపాయలతో విద్యుత్ సబ్‌స్టేషన్లు, ఉప కేంద్రాలను నిర్మిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన భద్రాద్రి పవర్‌ప్లాంట్ నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందన్నారు. జిల్లా రైతాంగం ఎదురుచూస్తున్న సీతారామ ప్రాజెక్టును 8వేల కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశామని, ఇది పూర్తయితే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని 10లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. గోదావరి జలాలను పాలేరు, వైరా జలాశయాలకు అనుసంధానం చేసి ఖమ్మం జిల్లాలోని కరువును పారద్రోలుతామన్నారు. గడువులోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నిర్దేశిత సమయంకంటే ముందుగానే పూర్తిచేసిన భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా 70వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని, 572కోట్ల ప్రపంచబ్యాంకు నిధులతో చేపట్టిన ఎనె్నస్పీ కాల్వల ఆధునీకరణ పనులు తుదిదశకు చేరుకున్నాయన్నారు. మిషన్ కాకతీయ ద్వారా ఖమ్మం జిల్లాలో 173కోట్లతో 697చెరువులు పునఃరుద్దరించామన్నారు. ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి పక్కారోడ్లు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి రెండు వరసల రోడ్లు, జిల్లా కేంద్రం నుంచి రాజధానికి నాలుగు వరుసల రోడ్లు ఉండేలా మొత్తం 1713కిలోమీటర్ల రహదార్ల విస్తరణ చేపట్టామని, ఇందుకు 1601కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రతి నియోజకవర్గంలోనూ క్యాంపు కార్యాలయాలు, ఖమ్మం-సూర్యాపేట, ఖమ్మం-అశ్వారావుపేట, ఖమ్మం-కోదాడ రోడ్లను జాతీయ రహదార్లుగా మార్చి 1700కోట్లతో పనుల ప్రారంభానికి ఆదేశాలు జారీ చేశామన్నారు.
కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు 704కోట్లతో 53కిలోమీటర్ల రైల్వేలైను సర్వే పనులు జరుగుతున్నాయని, త్వరలోనే ముఖ్యమంత్రి దీనికి శంకుస్థాపన చేయనున్నారన్నారు. మెరుగైన వైద్యం అందించేందుకు జిల్లా ఆసుపత్రిని నిమ్స్ తరహాలో అభివృద్ధి చేసేందుకు నిర్ణయించి ఇప్పటికే 20కోట్లతో 150పడకల మాతా శిశు సంక్షేమ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ఈ విద్యా సంవత్సరంలో 154ప్రాథమిక పాఠశాలల్లో కొత్తగా ఇంగ్లీష్ మీడియం ద్వారా బోధన జరుగుతున్నదని, అన్ని విద్యా సంస్థల్లో వౌళిక సదుపాయాలు కల్పించామన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించేందుకు 1831కోట్లతో చేపట్టిన పనులు ఉగాది నాటికి పూర్తికానున్నాయన్నారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా 118కోట్లతో 456రోడ్లు పూర్తి చేశామని, 57గ్రామ పంచాయతీల్లో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. రాష్ట్రంలో డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ళను ఎర్రవల్లి తరువాత ఖమ్మం జిల్లాలోనే ప్రారంభించామని, జిల్లాకు 8600గృహాలు మంజూరు కాగా 2670నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. మైనార్టీల సంక్షేమంలో భాంగా 7గురుకుల విద్యాలయాలు ప్రారంభించుకున్నామన్నారు. షాదీ ముబాకర్, కల్యాణలక్ష్మి, ఒంటరి మహిళా పెన్షన్ల ద్వారా అనేక మందికి లబ్ధి జరుగుతున్నదన్నారు. గొర్రెల సంపదను అభివృద్ధి చేసేందుకు 23కోట్లతో యాదవులకు గొర్రెలను పంపిణీ చేశామన్నారు. జాతీయ ఉపాధిహామీ పథకం కింద 56,396కుటుంబాలకు బీమా చేయించడం జరిగిందన్నారు. జిల్లాలో నిరుద్యోగ యువత కోసం నూతన పరిశ్రమల స్థాపనలు, ఐటిహబ్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. ప్రభుత్వ పథకాలను అందరు సద్వినియోగం చేసుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలని, బంగారు తెలంగాణ సాధనలో జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్, పోలీస్ కమిషనర్ తఫ్సీర్‌ఇక్బాల్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.