ఖమ్మం

అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మద్యం వ్యాపారుల ఆరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, సెప్టెంబర్ 19: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 78 మద్యం షాపులకు దరఖాస్తులు చేసేందుకు వ్యాపారస్తులు పోటీపడ్డారు. 78 షాపులకు పోటాపోటీగా దరఖాస్తులు చేసి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మద్యం వ్యాపారులు ఆరాటపడుతున్నారు. మద్యం దుకాణాలకు సంబంధించి ప్రభుత్వం డ్రా పద్ధతిలో కేటాయించేందుకు చర్యలు చేపట్టింది. మద్యం షాపు కోసం దరఖాస్తు చేసేందుకు లక్ష రూపాయల డిడితోపాటు ఐదు లక్షల రూపాయల ఇయండి చెల్లించే విధంగా ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. మద్యం షాపుల దరఖాస్తుల కోసం మంగళవారం చివరి రోజు కావడంతో ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయానికి జిల్లా నలుమూలల నుండి మద్యం వ్యాపారులు వందలాది మంది తరలిరావడంతో సందడిగా మారింది. షాపులు వేసే వ్యాపారులతో ఎక్సైజ్ కార్యాలయం కళకళగా మారింది. ఏజెన్సీ ఏరియాలో గిరిజనులు మాత్రమే దరఖాస్తు చేసే అవకాశం ఉండటంతో గిరిజన యువకులు, మహిళలతో దరఖాస్తులు చేసేందుకు వ్యాపారులు పోటీపడ్డారు. 78 షాపులు జిల్లాలో ఉండగా 48 ఏజెన్సీ ప్రాంతంలో ఉండగా 36 మద్యం షాపులు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి. జిల్లాలోని 23 మండలాలు, 4 మున్సిపాలిటీల్లో ఉన్న మద్యం షాపులకు సుమారు పనె్నడు వందలకు పైగా దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తుంది. దరఖాస్తు చేసుకున్న మద్యం వ్యాపారులకు ఈ నెల 22న ఎక్సైజ్ కార్యాలయంలో డ్రా తీసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నూతనంగా ఏర్పడ్డ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మద్యం షాపులకు భారీ డిమాండ్ పలుకుతుంది.

చీరల కొనుగోలులో భారీ కుంభకోణం
* సిపిఐ జిల్లా కార్యదర్శి హేమంతరావు
ఖమ్మం(జమ్మిబండ), సెప్టెంబర్ 19: బతుకమ్మ వేడుకలంటూ రాష్ట్ర ప్రభుత్వం చీరల కొనుగోలులో భారీ కుంభకోణానికి పాల్పడిందని సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు ఆరోపించారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి పలు సంక్షేమ పథకాల పేరుతో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగకు చేనేత చీరలు ఇస్తామన్న కెసిఆర్ నాసిరకం, నాణ్యతలేని సిల్క్ చీరలు పంపిణీ చేసి దీని వెనుక భారీకుట్ర దాగిఉందన్నారు. నాసిరకం చీరలు పంపిణీ చేస్తున్న ప్రభుత్వంపై మహిళలు మండిపడుతున్నారన్నారు. రాష్ట్ర మంత్రులు కెటిఆర్, తుమ్మలలు మహిళలు చేస్తున్నా ఆందోళనలను ప్రతిపక్షాలకు అంటగట్టడం అవివేకమన్నారు. తూకాల లెక్కన సిల్క్‌చీరలు తెచ్చిన ప్రభుత్వం తాము చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకే ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. బతుకమ్మ చీరల పేరుతో జరిగిన అవినీతిపై క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మహిళలకు చేనేత చీరలు అందించాలంటే మూడు సంవత్సరాలు పడుతుందని జౌళిశాఖ రాష్ట్ర అధికారి శైలజఅయ్యంగార్ చెప్పిన విషయాన్ని ప్రభుత్వం మరుగున పెట్టి సిల్క్‌చీరలనే చేనేత వస్త్రాలుగా పంపిణీకి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేత వస్త్రాల పేరుతో ఆడపడుచులను దగా చేసిన కెసిఆర్‌ను మహిళలు క్షమించరన్నారు. ప్రభుత్వ సొమ్ముతో ప్రచారం చేసుకుంటున్న కెసిఆర్ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. ఓట్లకోసం ప్రజలను మభ్యపెడుతున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. విలేఖరుల సమావేశంలో నాయకులు పోటు ప్రసాద్, సింగ్ నర్సింహరావు, ఎస్‌కె జానీమియా, తాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.