ఖమ్మం

ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏన్కూరు, సెప్టెంబర్ 21: మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో దేవి నవరాత్రి ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా ఏన్కూరు, గార్లఒడ్డు, నాచారం, టిఎల్‌పేట, తిమ్మారావుపేట గ్రామాలలోని దేవాలయాలను విద్యుత్‌దీప కాంతులతో అలంకరించారు. కొన్ని గ్రామాలలో అమ్మవారికి ప్రత్యేక మండపాలను ఏర్పాటు చేశారు. ఏన్కూరులో అమ్మ వారిని మేళ తాళాలతో, కోలాట నృత్యాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్టించారు. తొలి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరీదేవి అవతారంలో దర్శనమిచ్చింది. దీంతో మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం మహిళలంతా బతుకమ్మలను ఎత్తుకొని వచ్చి గౌరిదేవికి పూజలు చేసి బతుకమ్మల చుట్టు తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆటపాట కార్యక్రమం నిర్వహించారు.

తిరుమలాయపాలెం మండలంలో...
తిరుమలాయపాలెం: మండలంలోని వివిధ గ్రామాల్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. కనకదుర్గా అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేసి తొమ్మిదిరోజుల పాటు పూజలు నిర్వహిస్తారు. తిరుమలాయపాలెం, పిండిప్రోలు, సుబ్లేడు, కాకరవాయి, బీరోలు తదితర గ్రామాల్లో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలను కొనసాగిస్తున్నారు.

సర్వశక్తి స్వరూపిణి బతుకమ్మ
ఖమ్మం(మామిళ్ళగూడెం), సెప్టెంబర్ 21: సృష్టి అనాది నుండి ప్రకృతిని దేవతగా పూజించడంలో స్ర్తిశక్తి ఉందని, ఆ శక్తి స్వరూపానే్న పూలరూపంలో పూజించే బతుకమ్మను సర్వశక్తి స్వరూపిణిగా పూజిస్తున్నామని జీవన సాఫల్య అవార్డు గ్రహిత చాగంటి కృష్ణమూర్తి అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగ సంబురాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. ప్రపంచ స్థాయిలో బతుకమ్మకు గుర్తింపు తెచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ బతుకమ్మను ఘనంగా నిర్వహించే దానిలో భాగంగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అన్ని జిల్లాలో ఆడపడుచులు బతుకమ్మను ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు.