ఖమ్మం

మద్యం కిక్కు లక్కు ఎవరికో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), సెప్టెంబర్ 21: మద్యం దుకాణాల అదృష్టవంతులెవరో నేడు తేలనుంది. జిల్లాలో మొత్తం 83 మద్యం దుకాణాలకు 4029మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో 83మందిని లాటరీ పద్ధతి ద్వారా ఖరారు చేయనున్నారు. అందుకోసం స్థానిక సీక్వెల్ రిసార్ట్స్‌లో శుక్రవారం లాటరీ తీసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్ సమక్షంలో డ్రా తీయనున్నారు. రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా నుండే అత్యధికంగా 4029 దరఖాస్తులు వచ్చాయి. ఆ తరువాత సూర్యాపేట జిల్లా నుండి ఎక్కువ స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. ఖమ్మం జిల్లాకు మొత్తం 83షాపులకు 4029 దరఖాస్తులు రాగా మారెమ్మగుడి ప్రాంతంలోని రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామంలోని మద్యం దుకాణానికి అత్యధికంగా 140దరఖాస్తులు వచ్చాయి. చింతకాని మద్యం దుకాణానికి 120దరఖాస్తులు రాగా ఖమ్మంలోని 16నెంబర్ షాపుకు అతి తక్కువగా 16దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది మద్యం దుకాణ లైసెన్సు రెండేళ్ళ వరకు పొడిగించడం, ఈ సమయంలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉండటంతో ఈ దుకాణాలకు గతంకంటే ఈ ఏడాది ఎక్కువ డిమాండ్ పెరిగింది. మద్యం వ్యాపారులు సిండికేట్ అయి దుకాణాలను దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. సిండికేట్‌గా ఏర్పడిన వ్యాపారులు దాదాపు 50నుండి వంద దరఖాస్తులు వేరు వేరు పేర్లమీద దరఖాస్తులు చేసినప్పటికీ వాటిని దక్కించుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. దుకాణాల లైసెన్సులను లాటరీ పద్దతిలో కేటాయిస్తున్నప్పటికీ లాటరీ ద్వారా తమకే వచ్చే విధంగా తమ తమ వ్యక్తుల ద్వారా దరఖాస్తులను సమర్పించారు. బినామిలుగా కొంతమంది వ్యక్తులను పెట్టుకొని దరఖాస్తు చేయించిన సిండికేట్ వ్యాపారస్తులు దుకాణం రాని వ్యక్తులకు చెల్లించిన సొమ్మును ఇచ్చే విధంగా, ఒకవేల దుకాణం దక్కితే చెల్లించిన సొమ్ముకు రెట్టింపుగా ఇచ్చి ఆ దుకాణాన్ని సిండికేట్ వ్యాపారస్తులు చేజిక్కించుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. గత ఏడాది మొత్తం జిల్లాలో 68దుకాణాలకు 4325దరఖాస్తులు రాగా 23కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది 83దుకాణాలకు 4029దరఖాస్తులు రాగా 40.29కోట్ల రూపాయల ఆదాయం ఎక్సైజ్ శాఖకు వచ్చింది. శుక్రవారం స్థానిక సీక్వెల్ రిసార్ట్స్‌లో కలెక్టర్ సమక్షంలో లాటరీ పద్దతిలో దుకాణాలను కేటాయించనున్నారు. ఈ లాటరీలో పాల్గొనేందుకు దరఖాస్తుదారుడు తప్పనిసరిగా దరఖాస్తుకు సంబంధించిన స్లిప్పును తప్పనిసరిగా తెచ్చుకోవాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ సోమిరెడ్డి తెలిపారు. దరఖాస్తుదారులు సకాలంలో లాటరీ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని, దరఖాస్తుదారులు హాజరు కానిపక్షంలో అతని దరఖాస్తును లాటరీ నుండి తొలగించబడుతుందన్నారు. 4029మంది దరఖాస్తుదారులలో 83మందిని లాటరీ పద్దతి ద్వారా లైసెన్సుదారులను కేటాయించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను పకడ్భందీగా ఏర్పాటు చేశామని సోమిరెడ్డి పేర్కొన్నారు.

మండలంలో వాడవాడలా దుర్గామాతకు పూజలు
బోనకల్లు, సెప్టెంబర్ 21: మండలంలోని అన్ని గ్రామాల్లో వీధివీధిన దుర్గామాతకు దేవిశరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. మండల కేంద్రంలోని ఎస్‌టి కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహానికి జడ్పిటిసి బానోతు కొండ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటి రోజు ఆదిలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన దుర్గామాతను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. దసరా సెలవుల సందర్భంగా గ్రామాలు సందడిగా మారాయి.

గార్లలో వైభవంగా ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు
గార్ల, సెప్టెంబర్ 21: గార్ల మండలంలో శ్రీదేవి నవరాత్రుల ఉత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. దుర్గాదేవి ప్రతిష్ట కోసం ప్రత్యేకంగా మందిర్లను ఏర్పాటు చేసి వేదపండితుల మత్రోచ్ఛరణల మధ్య దుర్గాదేవిని ప్రతిష్టించారు. దేవి శరన్నవ రాత్రుల ఉత్సవాల సందర్భంగా ప్రతి రోజు అష్టాత్తర పూజ, సహస్ర కుంకుమ పూజలుంటాయని నిర్వాహకులు తెలిపారు. కాగా గార్ల ఎవిఅర్ ఫంక్షన్ హాల్, లక్ష్మినారాయణ స్వామి దేవాలయంలో ప్రతిష్ట నిర్వాహకులు దేవి మాలలు ధరించారు.