ఖమ్మం

ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన టిఆర్‌ఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, సెప్టెంబర్ 21: ప్రచార ఆర్బాటాలతో రాష్ట్ర ప్రజలను మోసంచేస్తూ టిఆర్‌ఎస్ పాలన నడుస్తుందని, దీనిపై క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రతి కార్యకర్త ముందుండాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయంతో టిఆర్‌ఎస్ కార్యకర్తలనే రైతు సమన్వయ సమితులుగా ఏర్పాటు చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టివిక్రమార్క, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరిలు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రజలను చైతన్యం చేసేందుకు గురువారం ఖమ్మంలో నిర్వహించిన ఇందిరమ్మ రైతుబాట అవగాహన సదస్సులో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఏకపక్ష నిర్ణయంతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయన ఇచ్చిన వాగ్ధానాలను కనుమరుగు చేసేందుకే భూప్రక్షాళన ముందుకు తీసుకువచ్చిందన్నారు. భూ రికార్డులు ఆయన హయాంలోనే చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్న కెసిఆర్ ఏడు దశాబ్ధాల క్రితమే కాంగ్రెస్ భూ సర్వేలు జరిపిన విషయాన్ని గుర్తించాలన్నారు. భూమి, భూమిపై హక్కుల కోసం దునే్నవానికే భూమి వంటి అనేక ఉద్యమాలు జరిగాయని, ఆనాడే దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు 10లక్షల ఎకరాల భూములపై హక్కులు కల్పించిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయకుండానే కొత్త వాగ్ధానాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని గుర్తించాలన్నారు. రైతు సమన్వయ సమితుల ద్వారా ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా మండల కమిటీలు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం బలవంత భూసేకరణకు పాల్పడుతుందన్నారు. అటవీహక్కు చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నారని, కెసిఆర్ నిరంకుశ పాలనను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు కమీషన్లకు కక్కుర్తి పడి రీడిజైన్ల పేరుతో వేలాదికోట్ల రూపాయలను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లు కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. దళితులకు ఎక్కడా మూడెకరాలు ఇచ్చింది లేదని, డబుల్‌బెడ్‌రూమ్‌లు అటకెక్కాయని దుయ్యబట్టారు. బంగారు తెలంగాణ అంటూ రాష్ట్ర ప్రజలను అనేక రకాలుగా మోసం చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో గుణపాఠం తప్పదన్నారు. నాసిరక పాలనలో నాసిరకం చీరలు మహిళలకిచ్చి చేనేత వస్త్రాలంటూ నమ్మబలికారన్నారు. ఇంతటి దుర్మార్గమైన పరిపాలన ఎన్నడూ చూడలేదని, 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అయితం సత్యం, జిల్లా ఇంచార్జ్ శ్రీ్ధర్‌బాబు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సంబాని చంద్రశేఖర్, వనమా వెంకటేశ్వర్లు, కోదండరాంరెడ్డి, రేగా కాంతారావు, అనీల్‌కుమార్‌యాదవ్, బెల్లయ్యనాయక్, కె లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎన్డీ రామన్న దళం, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు
* ఉలిక్కిపడ్డ ఏజన్సీ ప్రాంతం
* తృటిలో తప్పించుకోడంతో తప్పిన పెనుముప్పు
టేకులపల్లి, సెప్టెంబర్ 21: మండలంలోని సిద్ధారం అటవీ ప్రాంతంలో సిపి ఐ (ఎంఎల్) న్యూ డెమొక్రసీ (చంద్రన్నవర్గం), రామన్న అజ్ఞాత దళ సభ్యులు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గురువారం తెల్లవారుజామున పోలీసులతో ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల రాకను పసిగట్టిన దళం అక్కడి నుంచి తృటిలో తప్పించుకోడంతో పెనుముప్పు తప్పింది. లేకుంటే న్యూ డెమొక్రసీ అజ్ఞాత రామన్న దళం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చేదని స్థానికులు భావిస్తున్నారు. సభ్యులు వారి కిట్ బ్యాగులు, బియ్యం, వస్తు సామగ్రిని వదిలేసి పారిపోయారు. సంఘటనా స్థలంలో వస్తు సామగ్రితోపాటు ఒక 8 ఎంఎం, ఒక తపంచా, ఒక రివాల్వర్ స్వాధీనపరుచుకున్నట్లు పోలీసులు తెలిపారు. గురువారం తెల్లవారుజామున దళానికి, పోలీసులకు ఎదురు కాల్పులు జరిగి రామన్న దళంలో ముగ్గురు హతం అయ్యారని రెండు జిల్లాల వ్యాప్తంగా ప్రచారం జరగడంతో ఆ పార్టీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. టేకులపల్లి ప్రాంతంలో సంఘటన చోటుచేసుకోడంతో మండల ప్రజలు ఎక్కడికక్కడ గుంపులుగా చేరి ఎదురు కాల్పుల సంఘటనపై మాట్లాడుకున్నారు. చివరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్న విషయం తెలయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

సిపిఐ (ఎంఎల్), న్యూడెమొక్రస్రీ దళ సభ్యుడు అరెస్ట్
* ఎదురు కాల్పుల్లో పోలీసులు, నక్సల్స్‌కు గాయాలు కాలేదు
* జిల్లా ఎస్సీ అంబర్ కిషోర్‌ఝా
కొత్తగూడెం, సెప్టెంబర్ 21: సిపిఐ (ఎంఎల్), న్యూ డెమొక్రసీ పార్టీ, చంద్రన్న వర్గానికి చెందిన రామన్న దళం సభ్యుడు మడవి భీమా అలియాస్ గౌతమ్‌ను అరెస్టు చేసినట్లు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అంబర్ కిషోర్‌ఝా తెలిపారు. టేకులపల్లి మండలం బోడు పోలీసుస్టేషన్ పరిధిలో గురువారం పోలీసులు, రామన్న దళానికి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని స్పష్టం చేశారు. ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిపిఐ (ఎంఎల్), న్యూ డెమొక్రసీ దళాలు సంచరిస్తున్నట్లు కచ్చితమైన సమాచారం అందడంతో పోలీసు బలగాలు గాలింపు చర్యలు చేపడుతుండగా, నక్సలైట్లు కాల్పులు జరపటంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని తెలిపారు. దళ సభ్యునిగా పనిచేస్తున్న గౌతమ్‌ను, 8 ఎంఎం రైఫిల్స్ రెండు, ఒక రివాల్వర్, ఎయిర్ గన్, 8ఎంఎం రౌండ్స్ 54, 11 కిట్ బ్యాగులు, ప్టాస్టిక్ షీట్స్, ఆలివ్ గ్రీన్ దుస్తులను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. పాల్వంచ మండలం నర్సంపేట మండలంలో ఇటీవల జరిగిన హత్య కేసులో మోరె రవితోపాటు గౌతమ్‌కు సంబంధాలు ఉన్నట్లు ప్రకటించారు. తెలంగాణ ప్రాంతంలో వలస వచ్చిన గొత్తి కోయలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వలస వచ్చిన గొత్తి కోయలు చట్టానికి లోబడి నివసించాలన్నారు. లేనిపక్షంలో పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ సమావేశంలో ఇల్లందు డిఎస్పీ ప్రకాశరావు, కొత్తగూడెం డిఎస్పీ సురేంద్రరావు, టేకులపల్లి సిఐ డి రమేష్, బోడు ఎస్సై అనిల్‌లు పాల్గొన్నారు.