ఖమ్మం

బతుకమ్మా బతుకమ్మా మాతల్లి బతుకమ్మా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(కల్చరల్), సెప్టెంబర్ 24: బతుకమ్మా బతుకమ్మా మాతల్లి బతుకమ్మా అంటూ ఆదివారం జిల్లా వ్యాప్తంగా 5వ రోజు అట్లబతుకమ్మ సంబురాలను అంగ రంగవైభవంగా నిర్వహించారు. ఆదివారం కావడంతో అన్ని రంగాలకు చెందిన వ్యక్తులు మహిళలకోసం పూలను సేకరించగా భారీ బతుకమ్మలను పేర్చారు. మహిళలు పేర్చిన బతుకమ్మలను తీసుకొని ప్రతిరోజు ఆడిపాడే ప్రదేశానికి చేరుకున్నారు. బతుకమ్మా బతుకమ్మా మాతల్లి బతుకమ్మా అంటూ పెద్ద పెట్టున పాడుతూ వలయాకారంలో తిరుగుతూ నృత్యాలు చేశారు. 9 రోజుల పాటు నిర్వహించే బతుకమ్మ వేడుకలు దగ్గర పడుతున్న కొలది మహిళల్లో ఉత్సాహం పెరిగి మరింత శక్తితో కోలాటాలు, చప్పట్లతో నృత్యాలు చేయడంలో జోష్ పెంచారు. ఆదివారం ఆయా ప్రాంతాల మహిళలు గత 4 రోజులుగా చేస్తున్న బతుకమ్మ వేడుకల సందడిని చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. వారి ఇస్తున్న ప్రోత్సాహానికి మహిళలు మరింత ఉత్సాహంతో ముందుకు సాగారు. 5వ రోజున పెద్ద పెద్ద బతుకమ్మలను పేర్చడంతో వాటిని నాలుగు బజార్ల కూడళ్ళ వద్దకు చేర్చడానికి పురుషుల సహాయాన్ని తీసుకోవాల్సివచ్చింది. అనంతరం త్రీటౌన్ ప్రాంత బతుకమ్మలను, టూటౌన్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల బతుకమ్మలను మునే్నరులో నిమజ్జనం చేశారు. వన్‌టౌన్ ప్రాంత బతుకమ్మలను ప్రకాశ్‌నగర్ వద్దగల మునే్నరులో నిమజ్జనం గావించగా, టూటౌన్ ప్రాంతంలోని అధిక భాగం నాగార్జునసాగర్ కాలువలో నిమజ్జనంగా చేశారు. చివరకు అట్ల బతుకమ్మకోసం చేసిన అట్లను ప్రసాదాలుగా పంచిపెట్టుకుని ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఆదివారం మీకోసం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు
ఖమ్మం(కల్చరల్), సెప్టెంబర్ 24: నగరంలోని మంచికంటి భవన్‌లో ఆదివారం మీకోసం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర కార్యదర్శి బత్తుల హైమావతి మాట్లాడుతూ కెసిఆర్ బతుకమ్మ పేరుతో రాష్ట్ర మహిళాలోకాన్ని కించపర్చారని ఆరోపించారు. అనాదిగా వస్తున్న బతుకమ్మ వేడుక పేద ప్రజలకు అండగా అండేదని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేద మహిళల బ్రతులను చిద్రం చేసే విధంగా ఎక్సైజ్ విధానాన్ని రూపొందించారని ఆరోపించారు. పేద ప్రజల ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీసే విధానాన్ని, లిక్కర్ వ్యాపారాన్ని ఐద్వా ఆధ్వర్యంలో అడ్డుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. పలు రకాల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ వలయాకారంలో తిరుగుతూ పేదల బ్రతులు బాగుచేసే బతుకమ్మ కావాలంటూ పాటలు పాడుతూ ఆటలాడారు. ఈ కార్యక్రమంలో ఎవిఎం నాయకులు గట్టు రమాదేవి, అనుమతి, భాగం అజిత, ఐద్వా నాయకులు మాచర్ల భారతి, బుగ్గవీటి సరళ, అఫ్రోజ్‌సమీనా, బండి పద్మ, మాదినేని లక్ష్మి, కె అమరావతి, నాగసులోచన, రమ తదితరులు పాల్గొన్నారు.