ఖమ్మం

ఘనంగా బతుకమ్మ సంబురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), సెప్టెంబర్ 24: బతుకమ్మ సంబురాలను మహిళలందరూ ఆనందోత్సహాలతో జరుపుకునేందుకు జిల్లాలో అధికారికంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్ అన్నారు. రాష్ట్ర పండుగైన బతుకమ్మ సంబురాల్లో భాగంగా ఐదవ రోజు ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో కలెక్టరేట్‌లో వివిధ భాగాలలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు, సిబ్బంది బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచుల ప్రధాన పండుగ బతుకమ్మ సంబురాలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సద్దుల బతుకమ్మ రోజు సర్థార్‌పటేల్ స్టేడియంలో మహా బతుకమ్మను ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది మహిళలతో ప్రత్యేక కార్యక్రమంను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెసి వినయ్‌కృష్ణారెడ్డి, జిల్లా ఉపాధి కల్పనాధికారి విజేత, తహశీల్దార్ రమణి తదితరులు పాల్గొన్నారు.