ఖమ్మం

అటవీ భూములు ఖాళీ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తుపల్లి, సెప్టెంబర్ 25 : నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన 170 కుటుంబాలు సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో 1993 నుండి 250 ఎకరాలలో పోడు కొట్టుకొని అటవీ భూమిని సాగు చేసుకుంటున్నా, అటవీశాఖ అధికారులు దౌర్జన్యంగా భూములు ఖాళీచేయాలని సోమవారం బోర్లకు ఉన్న విద్యుత్ కనెక్షన్లు తొలగించేందుకు విద్యుత్‌శాఖ అధికారులతో రంగంలోకి దిగారు. దీంతో ఆయా రైతులు అడ్డుకొని తిరుగుబాటు చేయడంతో వెనుదిరిగి వెళ్ళారు. 1990వ సంవత్సరంలో అటవీభూమిని పోడు చేసుకొని జీడిమొక్కలు, ఇతర పంటలు సాగు చేసుకుంటున్నామని, దీంతో అటవీశాఖ అధికారులు అడ్డుతగలడంతో అప్పటి తహశీల్దార్ 1993-94 సంవత్సరంలో పహాణీలు ఇచ్చారాని దీంతో భూములు సాగు చేసుకుంటున్నామని పోడుదారులు తెలిపారు. అంతే కాకుండా 2009లో హైకోర్టులో ఈ భూములపై స్టేతెచ్చుకొని పంటలను సాగుచేసుకుంటున్నామని, అయినా అటవీశాఖా ఎఫడిఓ సతీష్‌కుమార్, రేంజర్ వెంకటేశ్వర్లు, సెక్షన్ ఆఫీసర్ మధన్, సిబ్బంది కక్షసాధింపు చర్యలు చేపడుతున్నారని,అడపా దడపా ఏళ్ళ తరబడి సాగు చేసుకుంటున్నా భూములపై అధికారులు తమ పంటలపై దాడులు చేస్తున్నారని వాపోయారు.హైకోర్టులో స్టే ఉన్నా అటవీశాఖ అధికారులు దాడులు చేయటం ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. రాష్టర్రోడ్ల భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏళ్ళతరబడి సాగుచేసుకుంటున్నా భూముల జోలికి పోవద్దని అటవీశాఖ అధికారులకు చెప్పారని అయినా అటవీశాఖ అధికారులు మమ్మల్ని పీడించుకు తింటున్నారని వాపోయారు. పంటలు చేతికొచ్చే సమయంలో విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తామని ఏడీఈ జీవన్‌కుమార్, ఏఈలను తీసుకొచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ విషయమై సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో కూడా పిర్యాదు చేశామని పోడు రైతులు వాపోయారు. పెద్ద ఎత్తున్న రైతులు ఎదురు తిరగడంతో అటవీశాఖ అధికారులు, విద్యుత్‌శాఖ అధికారులు వెనుతిరిగి వెళ్ళారు. ఈ కార్యక్రమంలో పోడు రైతులు బెజవాడ భిక్షమారావు, యార్లగడ్డ దయానంద్, కుసిని మల్లయ్య, వాసం శ్రీనివాసరావు, పిట్ల లక్ష్మీ, నూనావత్ శ్రీనివాసరావు, లూకావత్ లక్ష్మయ్య, నాగులు, జోగి లక్ష్మ, కోటేశ్వరమ్మ, కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ కమీషనర్‌పై దాడి
* ఇల్లెందులో ఫ్లెక్సీల వివాదం
* కమీషనర్‌కు మద్దతుగా ఉద్యోగుల నిరసన

ఇల్లెందు, సెప్టెంబర్ 25: పట్టణంలో ఫ్లెక్సీల తొలగింపు వివాదం చిలికిచిలికి గాలివానలా మారింది. సోమవారం ఉదయం కమిషనర్ రవిబాబు ఇంటిపై టిఆర్‌ఎస్ కౌన్సిలర్ జానీ, పార్టీకి చెందిన నాయకులు కమీషనర్‌పై దౌర్జన్యానికి పాల్పడ్డారు. టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఫ్లెక్సీలను తొలగించడం పట్ల ఆగ్రహించిన నేతలు కమిషనర్‌పై దాడిచేశారు. డెప్యూటీ సిఎం మహమూద్ అలీ రాక సందర్భంగా పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. వాటిని ఉద్దేశ్యపూర్వకంగానే కమిషనర్ తొలగించారని టిఆర్‌ఎస్ నేతలు పేర్కొంటున్నారు. అటువంటిది ఏమీలేదని పార్టీలతో నిమిత్తం లేకుండా ఎవరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా తొలగిస్తున్నామని, విధి నిర్వహణలో భాగంగానే చర్యలు చేపట్టామని కమిషనర్ తెలిపారు. ఉద్దేశ్యపూర్వకంగానే తన ఇంటిపై దాడిచేసి తనను కొట్టారని ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్ అధికారులకు కమిషనర్ ఫిర్యాదు చేశారు. కాగా తాము కమిషనర్‌పై దాడి చేయలేదని, ప్రశ్నించడమే జరిగిందని దానిని కమిషనర్ వక్రీకరించాలని చూస్తున్నారని టిఆర్‌ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఇదిలావుండగా కమిషనర్‌కు మద్దతుగా ఉద్యోగులు, కార్మికులు విధులు బహిష్కరించారు. వివిధ ప్రాంతాలలో ఉన్న చెత్తను ప్రధాన రహదారిపై వేసి నిరసన వ్యక్తం చేశారు. దాడి ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.