ఖమ్మం

దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుద్రంపూర్, సెప్టెంబర్ 25: దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం వికలాంగులశాఖ కమీషనర్ శైలజను హైదరాబాద్‌లోని సంక్షేమభవన్‌లో కలిసి సమస్యలతోకూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా టివిపిఎస్ అధ్యక్షుడు గుండపనేని సతీష్ మాట్లాడుతూ దివ్యాంగుల హక్కుల పరిరక్షణచట్టం 2016 నిబంధనలపై దివ్యాంగుల సాధికారతే లక్ష్యంగా రూపొందించిన సలహాల నివేధికలోని లోపాలను సరిచేసి అమలుచేయాలన్నారు. కెజి టూ పిజీ ఉచిత విద్య, రాజకీయ రిజ్వరేషన్, శరతులులేని రూణాలు, జీవనోపాధి కల్పించాలని కోరారు. ఈకార్యక్రమంలో నాయకుకలు జున్ను రాజు, మహేష్, కవిత, శ్రీను, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
డబుల్ బెడ్‌రూం లబ్ధిదారులను ఎంపిక చేసిన ఆర్డీవో
పినపాక, సెప్టెంబర్ 25: మండలంలో ఐయిలాపురంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు లబ్ధిదారులను సోమవారం ఉప్పాక పంచాయితీ సీతంపేట గ్రామం పంచాయితీ కార్యాలయంలో జరిగిన పీసా గ్రామసభలో 53 మంది లబ్ధిదారులను ఆర్డీవో శివనారాయణరెడ్డి ఎంపిక చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా నిరుపేదలను ఎంపిక చేసినట్లు తెలిపారు. డబుల్ బెడ్‌రూమ్ కేటాయింపుల్లో ఒత్తిళ్లు కానీ, పైరవీలకు కానీ ఆస్కారం లేకుండా తెల్లరేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులను పరిగణలోకి తీసుకోవడం జరిగిందన్నారు. గ్రామ పంచాయితీలో ఎక్కువ మంది తెల్లరేషన్ కార్డులు ఉన్న వాళ్లు ఉండటంతో అందులో కూడా పూర్తిస్థాయిలో దారిద్య్రరేఖ అంచున జీవనం గడుపుతున్న నిరుపేదలను ఎంపిక చేయడం జరిగిందన్నారు.
వైభవంగా శాకాంబరి అలంకారం
భద్రాచలం టౌన్, సెప్టెంబర్ 25: భద్రాచలం పట్టణంలోని శ్రీ గాయత్రి సర్వ దేవతా సన్నిధానంలో 33 అడుగులు ఉన్న విశ్వమాతకు సోమవా రం శాకాంబరి అలంకారం చేశారు. అన్నపూర్ణమాతగా ఆలయంలో అమ్మవారు భక్తులకు ద ర్శనమిచ్చారు. ఆలయ వ్యవస్థాపకుడు కాకరాల శర్మ విశేష పూజలు నిర్వహించారు. శాకాంబరి అలంకారంలో ఉన్న విశ్వమాతకు భక్తులు పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.