ఖమ్మం

చీరెలు కాదు బతికేందుకు భూమివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుమ్ముగూడెం, సెప్టెంబర్ 25: బతుకమ్మ పండుగ పేరుతో ఆర్భాటం చేస్తూ పేద మహిళలకు నాసిరకం చీరెలు పంపిణీ చేసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం చీరెలు ఇస్తే సరిపోదని, పేదలు బ్రతికేందుకు భూమిని పంచాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు మర్మం చంద్రయ్య, ఎండి జానీపాషాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎంపిడివో రమాదేవికి సోమవారం ఒక వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చీరెలు పంచినంత మాత్రాన పేదల జీవితంలో సంతోషం నిండదని, పేద ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్థానాలు భూ పంపిణీ, డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు, ఇందిరమ్మ పెండింగ్ బిల్లులు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు సోడె ధర్మరాజు, చిన్నారావు, పొడియం దుర్గ, విజయలక్ష్మి, దుర్గాదేవి, లలిత, వెంకటరమణ, వాణి తదితరులు పాల్గొన్నారు.
తెదేపా నియామకాల పట్ల హర్షం
ములకలపల్లి, సెప్టెంబర్ 25: తెలుగుదేశంపార్టీ పదవుల్లో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సముచితస్థానం కల్పించడంపట్ల ఆపార్టీ మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా సోమవారం మండల కేంద్రంలోనిర్వహించిన సమావేశంలో ఆపార్టీ మండల అధ్యక్షుడు పేర్ల చెన్నయ్య మాట్లాడుతూ తెదెపా జాతీయ ఉపాధ్యక్షుడుగా సండ్ర వెంకటవీరయ్య, పోలిట్‌బ్యూరో సభ్యుడిగా నామా నాగేశ్వరరావును, రాష్ట్ర కార్యదర్శులుగా మెచ్చ నాగేశ్వరరావు, మద్దినేని బేబి స్వర్ణకుమారి, జిల్లా అధ్యక్షుడిగా తుల్లూరి భ్రహ్మయ్య, కోనేరు సత్యనారాయణలను నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వీరి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పునర్వైభవాన్ని సంతరించుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుర్గాప్రసాద్, పుల్లయ్య, వెంకటేశ్వర్లు, రమేష్, శ్రీనివాస్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.