ఖమ్మం

హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, అక్టోబర్ 16: ప్రపంచంలో హిందూ ధర్మానికి అత్యంత ప్రాముఖ్యత ఉందని, అనేక దేశాలు అధికారికంగా, అనధికారికంగా హిందూధర్మాలను అమలు చేస్తున్నారని, అయితే దేశంలో ఆ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్‌భాయి తొగాడియా పేర్కొన్నారు. సోమవారం ఖమ్మంలో జరిగిన మేధావుల సదస్సులో ఆయన మాట్లాడుతూ హిందూధర్మాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గ్రామగ్రామాన ప్రజలను చైతన్యంచేసి హిందూధర్మ విశిష్టతను వారికి తెలియజేయాలన్నారు. గోరక్షణ హిందూ ధర్మమని, గోవదను అడ్డుకోవాలన్నారు. సేవా కార్యక్రమాలు చేపడుతూనే విశ్వహిందూ పరిషత్ ద్వారా చేపట్టే కార్యక్రమాలపై ప్రజలను చైతన్యం చేయాలన్నారు. విహెచ్‌పి లక్ష్యాలను సాధించేందుకు ముదుండి పోరాడాలన్నారు. హిందూ సమాజమే లక్ష్యమని, హిందూధర్మం ప్రపంచవ్యాప్తంగా చాటాలని పిలుపునిచ్చారు. హిందువులంతా ఏకతాటిపైకి వచ్చి భారత్‌ను హిందూరాష్ట్రంగా ఏర్పడేందుకు కృషి చేయాలన్నారు. ధర్మాన్ని రక్షిస్తే అది తమను రక్షిస్తుందన్నారు. ఆడంబరాలు మానుకొని దేశాభిద్ధే లక్ష్యంగా కార్యచరణ రూపొందించి పాటుపడాలని సూచించారు. దేశ సంస్కృతి, ఆచారాలను కాపాడుకుంటూనే హిందూమతాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకుపోవాలన్నారు.
అనంతరం భక్తరామదాసు కళాక్షేత్రంలో జరిగిన విశ్వహిందూ పరిషత్ సమ్మేళనంలో మాట్లాడుతూ హిందూ సమాజం పట్ల చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని, దేశంలో హిందువులు మరింత అభివృద్ధి చెందాలన్నారు. ప్రతి గ్రామంలో హిందువులు సమాజ సేవకు పునరంకితమై దేశం మరింత అభివృద్ధి చెందేందుకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. హిందూధర్మం, హిందూ రాష్ట్రం, హిందూ సమాజమే తమ లక్ష్యంగా ముందుకు పోవాలన్నారు. విద్య, వైద్య రంగాల్లో విహెచ్‌పి ఎంతో ముందుందన్నారు. ప్రధాని నుండి కలెక్టర్, కిందిస్థాయి సిబ్బంది వరకు హిందువులు ఉన్నప్పుడే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. హిందువులు నిరంతరం అప్రమత్తంగా ఉండి ఎక్కడైనా హిందువులపై జరిగే దాడులను ప్రతిఘటించాలన్నారు. విహెచ్‌పి ఆధ్వర్యంలో వైద్యాన్ని మెరుగుపర్చడంతో పాటు దేశవ్యాప్తంగా మెరుగైన వైద్యాన్ని అందించే ఏర్పాట్లు చేశామన్నారు. భారత్‌ను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందన్నారు. కార్యక్రమంలో సత్యనారాయణ, సుభాష్ చత్రజీ, లక్ష్మినారాయణ, త్రిశూల్‌స్వామి, గాదెరెడ్డి, హన్మంతరావు, సునితారామారావు, అంజయ్య, శివరాం తదితరులు పాల్గొన్నారు.
స్పెషల్ డ్రైవ్ ద్వారా పెండింగ్ ఆర్జీలను పరిష్కరించాలి
* జిల్లా కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్
ఖమ్మం(మామిళ్ళగూడెం), అక్టోబర్ 16: ప్రజావాణిలో పెండింగ్‌లో ఉన్న ప్రజల ఆర్జీల స్పెషల్ డ్రైవ్ ద్వారా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం స్తానిక జిల్లా పరిషత్ సమావేశమందిరంలో ప్రజల ఆర్జీలను స్వీకరించి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుండి అందిన ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. తమ పరిదిలో పరిష్కారమయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఆరీజల సమస్యల పరిష్కారం పరిధి తమపై అదికారులైతే వారికి, డివిజన్, మండలస్థాయి అధికారులైతే వారికిపంపి, పరిష్కార స్వభావాన్ని ప్రజలకు చెప్పాలన్నారు. దరఖాస్తుల పరిష్కారంలో ఏలాంటి జాప్యం లేకుండ తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేసే సంక్షేమ పథకాలను వేగవంతంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాను ఆగ్రగామిలో నిలిపేందుకు అధికారులు తమ తమ లక్ష్యాలను పూర్తిచేసేందుకు అంకితభావంతో బాద్యతలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన నిరుపేదలందరికి అందే విధంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను స్వీకరించి పరిష్కారానికి ఆయా శాఖల అధికారులకు అందించారు. కలెక్టరేట్‌ను తరలించవద్దని, కొత్త కలెక్టరేట్ ప్రతిపాధనలు విరమించుకోవాలని పలు రాజకీయ పార్టీలు, తెలంగాణ విద్యావంతుల వేధిక ఆధ్వర్యంలో కలెక్టర్‌కు విన్నవించారు. స్థానిక మామిళ్ళగూడెం వీధిలో ప్రభుత్వం అనుమతి లేకుండ ఆస్తులు నిర్వహిస్తున్నారని దీనిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత వాసులు కలెక్టర్‌కు విన్నవించారు. కార్యక్రమంలో జెసి వినయ్‌కృష్ణారెడ్డి, డిఆర్వో శివశ్రీనివాస్, డిఆర్‌డిఎ పిడి మురళీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.