ఖమ్మం

సామాజిక తెలంగాణకై సిపిఐ పోరుబాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతకాని, అక్టోబర్ 16: సామాజిక తెలంగాణ సాధనకై సిపిఐ పోరుబాట కార్యక్రమం కొనసాగుతున్నదని సిపిఐ జిల్లా కార్యదర్శి భాగం హెమంతరావు అన్నారు. సోమవారం మండల కేంద్రం చింతకాని సిపిఐ పార్టీకార్యాలయంలో మండల కౌన్సిల్ సమావేశం బాలా మదుసుదన్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర అకాంక్షను సాధించుకునేందుకు అనేక మంది నాయకులు, ప్రజల పోరాటాలు నిర్వహించారన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల అకాంక్షలను నెరవేర్చడంలో కేసిఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన హామీలను ఎఒక్కటి నేరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతున్నదన్నారు. తెలంగాణలో దోరలపాలన కొనసాగుతున్నదన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తెచ్చిన ఘనుడు ముఖ్యమంత్రి కేసిఆర్ అని అభివర్ణించాడు. వ్యవసాయరంగం నిర్వీర్యమైందని, ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. ప్రజాపక్షాన సిపిఐ ఉద్యమాలు ఉదృతం చేస్తుందన్నారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రజావ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా సిపిఐ పోరుబాటు ప్రజలు మద్దతు పలుకుతున్నరన్నారు. ఈ నెల 27, 28, 29 తేదీలలో ఖమ్మం జిల్లాలలో పోరుబాట కొనసాగనున్నదని పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. పోరుబాట విజయవంతానికై ఈ నెల 28న ప్రొద్దుటూరుస గ్రామంలో సిపిఐ బహిరంగ సభ జరగనున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి దూసరి శ్రీరాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు జమ్ముల జితెందర్‌రెడ్డి. నాయకులు కనపర్తి గోవిందరావు, వేపూరి రవీంద్రబాబు, పావులూరి మల్లిఖార్జున్, పగిడిపల్లి ఏసు, సింగారపు సత్యనారాయణ, కూచుపుడి రవి, మండె కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.
శ్రీఅన్నపూర్ణాంబ సమేత కాశీవిశే్వశ్వరాలయంలో
కార్తీకమాస మహోత్సవాలు
ఖమ్మం(కల్చరల్), అక్టోబర్ 16: కార్తీకమాసాన్ని పురస్కరించుకుని నగరంలోని సుగ్గులవారి తోటలో వేంచేసి ఉన్న శ్రీఅన్నపూర్ణాంబ సమేత కాశీవిశే్వశ్వరస్వామి దేవాలయంలో ఈ నెల 20 నుండి నవంబర్ 18 వరకు కార్తీకమహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ బుద్దవరపు శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. సోమవారం స్ధానిక ఆలయ ప్రాంగణంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్తీకమాసం నెల రోజులపాటు ఈ ఆలయంలో ఉదయం 5:30 గంటలకు శ్రీకాశీవిశే్వశ్వరస్వామికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చాన అత్యంత వైభవంగా నిర్వహించబడుతుందన్నారు. భక్తులు తెల్లవారు జామునే ఆలయానికి చేరుకుని పై రెండు పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆయన కోరారు. 23న సోమవారం నాగులచవితి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుందని, ఆ రోజున అభిషేకాలు తెల్లవారుజామున 3 గంటల నుండి 6 గంటల వరకు మాత్రమే జరుగుతాయన్నారు. అలాగే ప్రతిరోజు సాయంత్రం 5:30 గంటల నుండి మహిళా భక్తబృందంచే విష్ణుసహస్రనామ, భగవద్గీత, హనుమాన్‌చాలీసా, శివస్తోత్రనామ, కార్తీకపురాణ పారాయణం నిర్వహించబడుతుందన్నారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని తీర్ధప్రసాదాలను స్వీకరించి స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. ఈ సమావేశంలో భక్తమండలి అధ్యక్షుడు చారుగుండ్ల వెంకటేశ్వరరావు, కోశాధికారి అనుముల రామాచారి, పాలక మండలి సభ్యులు మండా శ్రీనివాసరావు, దేవర రాజేశ్వరి, లగంసాని వెంకటేశ్వర్లు, కుందెన రమేష్, బాదంపూడి పార్వతీశం శర్మ, సుగ్గుల వంశీకులు తదితరులు పాల్గొన్నారు