ఖమ్మం

కొత్త పత్తితో కళకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్), అక్టోబర్ 16: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కొత్త పత్తి రాకతో కళకళలాడుతుంది. రైతుల ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంట చేతికి రావటంతో అమ్ముకునేందుకు మార్కెట్‌కు తరలిస్తున్నారు. పత్తి పంటకు ఈసారి అయిన గిట్టుబాటు ధర వస్తుందని ఆశించిన రైతులకు గత సంవత్సరంలాగానే వ్యాపారుల చేతుల్లో దోపిడి గురికాకతప్పటం లేదు. పత్తి సీజన్ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే మార్కెట్‌కు కొత్త పత్తి అధికశాతంగా వచ్చి చేరుతుంది. సోమవారం ఖమ్మం మార్కెట్‌కు కొత్త పత్తి 18,081బస్తాలు రావటంతో మార్కెట్‌లో వ్యాపారులు, రైతులతో కొంత సందడి నెలకొంది. ఈ నెల మొదటి వారంలో మార్కెట్‌లో సిసిఐని ప్రారంభించినప్పటికి ఇంతవరకు అమలుకు మాత్రం నోచుకోలేదు. సిసిఐ ద్వారా తమ పత్తి పంటకు కనీస మద్దతు ధర లభిస్తుందని ఎంతో ఆశగా మార్కెట్‌కు వస్తున్నామని రైతులు వెల్లడిస్తున్నారు. మార్కెట్‌కు వచ్చిన తరువాత సిసిఐ ఇంకా అమలులో లేదని తెలియటంతో తీసుకువచ్చిన పత్తి పంటను తిరిగి తీసుకువెళ్ళలేక వచ్చిన ధరకే అమ్ముకుంటున్నామని రైతులు వాపోతున్నారు. శనివారం మార్కెట్‌లో పాత పత్తికి 4,800రూపాయలు ఉండగా కొత్త పత్తికి 4,470రూపాయలను మార్కెట్ నిర్ణయించింది. మార్కెట్‌లో సిసిఐ లేకపోవటంతో వ్యాపారులు ముందుగానే రైతుల పంటలను పరిశీలించుకొని 3,200నుండి 3,700రూపాయలకు బేరసారాలు చేసిన తరువాత ఈనామ్ పద్దతిలో కొనుగోలు చేస్తుండటం గమనార్హం. దీంతో పత్తి రైతులు చేసేదేమిలేక వచ్చిన ధరకే పంటను అమ్ముకోవల్సి వస్తుందని వెల్లడిస్తున్నారు. దీనికి తోడు దీపావళి పండుగ దగ్గర పడుతుండటంతో వ్యాపారులు చెప్పిన ధరకే అమ్ముకుంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో ఇంత జరుగుతున్నప్పటికి మార్కెట్ అధికారులు సైతం పట్టించుకోకపోవటం గమనార్హం.
జిల్లాలో రూ.831కోట్లతో రోడ్లు, వంతెనల నిర్మాణాలు
* ఆర్‌అండ్‌బి ఎగ్జికూటివ్ ఇంజనీరు రాజేశ్వరరెడ్డి
జూలూరుపాడు, అక్టోబర్ 16: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని పలు మండలాల్లో రూ.831 కోట్ల ప్రత్యేక నిధులతో 74 రహదారులు, 23 వంతెనల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు ఆర్‌అండ్‌బిశాఖ ఎగ్జిగ్యూటివ్ ఇంజనీరు జి రాజేశ్వరరెడ్డి తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోజరుగుతున్న ఫోర్‌లైన్ రోడ్డు పనులను ఇఇ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఇప్పటికే 3 రహదారులు, 15 వంతెనల నిర్మాణ పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు త్వరితగతిన జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం పూర్తి నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణ పనులు సాగుతున్నాయని, నాణ్యత కొరవడిన పనులకు బిల్లులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన వెంట డిఇ నాగేశ్వరరావు, ఎఇ లక్ష్మణ్ నాయక్‌లు ఉన్నారు.

చిమ్మపుడి ప్రభుత్వ పాఠశాలకు
ఇంగ్లీష్ టీచర్‌ను కేటాయించాలి
ఖమ్మం(కల్చరల్), అక్టోబర్ 16: రఘునాధపాలెం మండలం చిమ్మపుడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 4 నెలలుగా ఖాశీగా ఉన్న ఇంగ్లీష్ టీచర్‌పోస్టును వెంటనే భర్తీ చేయాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ, విద్యార్ధులు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గ్రీవెన్స్‌డే సందర్భంగా కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చింతల రుమేష్, తాళ్ళ నాగరాజులు మాట్లాడుతూ విద్యాసంవత్సరం ప్రారంభమై 4 నెలలు గడుస్తున్నప్పటికిని నేటికి ఆ పాఠశాలలో విద్యార్ధులకు ఇంగ్లీష్ పాఠాలు చెప్పడానికి ఆ విభాగానికి చెందిన టీచర్‌ను నియమిండంలో ప్రభుత్వం, విద్యాశాఖాధికారులు పూర్తిగా విఫలమైనారని ఆరోపించారు. గత రెండు నెలలుగా విద్యార్ధులు, గ్రామ పెద్దలు అనేక రూపాల్లో ఆందోళనలు చేపట్టినప్పటికిని డిఇఓగాని, ఎంఇఒగాని పట్టించుకున్న పాపానపోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఆ పాఠశాలకు ఇంగ్లీష్ టీచర్‌ను కేటాయించి విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించాలని, లేని పక్షంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనలును ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. అనంతరం జిల్లా విద్యాశాఖాధికారితో వాగ్వాద్దం చోటుచేసుకుంది. కచ్చితంగా రెండు రోజుల్లో టీచర్‌ను నియమిస్తామని డిఇఒ హామీనిచ్చినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు బి విద్యాసాగర్, గ్రామ పెద్దలు నాగిరెడ్డి, విద్యార్ధులు పాల్గొన్నారు.