ఖమ్మం

నేటి నుంచి సింగరేణి కార్మికులకు కొత్త వేజ్‌బోర్డు ఎరియర్స్ పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, అక్టోబర్ 16: బొగ్గు గని కార్మికులకు సంబంధించిన పదో వేతన ఒప్పందం ఖరారు కావటంతో కొత్త వేజ్ బోర్డు వేతనాల ఎరియర్స్ చెల్లించేందుకు సింగరేణి యాజమాన్యం చర్యలు చేపట్టింది. ప్రతి కార్మికునికి రూ.51 వేలు అడ్వాన్సుగా మంగళవారం నుంచి చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ ఎన్ శ్రీ్ధర్ సోమవారం ప్రకటించారు. కార్మికులకు బోనస్ చెల్లించటం ద్వారా సింగరేణి సంస్థపై రూ.265 కోట్లు భారం పడుతుందని తెలిపారు. వేజ్‌బోర్డు ఒప్పందం ప్రకారం కొత్త జీతాలను జూలై 1, 2016 నుంచి అమలు చేయనున్నారు. కొత్త వేతనాల అమలు కోసం కొంత సమయం పట్టే అవకాశం ఉందన్నారు. సింగరేణి సంస్థ నెల రోజుల కాలంలో మూడుసార్లు వివిధ రూపాల్లో కార్మికులకు చెల్లింపులు జరిపిందని, దసరా పండగ సందర్భంగా అడ్వాన్సుగా రూ.120 కోట్లు, దీపావళి బోనస్‌గా రూ.336 కోట్లు, లాభాల బోనస్‌గా రూ.98.94 కోట్లు మొత్తం రూ.554.84 కోట్లు చెల్లించిందని వివరించారు. కొత్త వేతనాల ఎరియర్స్‌కు మరో రూ.265 కోట్లు చెల్లించాల్సి వస్తుందని, సింగరేణి కార్మికులకు దీన్ని తక్షణమే చెల్లించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించిన నేపథ్యంలో అమలుకు సన్నాహాలు చేసినట్లు తెలిపారు.

ఆకాల వర్షంతో దెబ్బతిన్న పత్తి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
బోనకల్. అక్టోబర్ 16: అకాల వర్షంతో ఖమ్మం జిల్లాలో పత్తి పంట దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని బిజెపి రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి శ్రీ్ధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో దెబ్బతిన్న పత్తి పంటను సోమవారం రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీ్ధర్‌రెడ్డి మాట్లాడుతూ ఆకాల వర్షాల వల్ల జిల్లాలో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వర్షాల కారణంగా కాయలు కుళ్ళిపోయి అపార నష్టం వాటిల్లి రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. వ్యవసాయశాఖాధికారులు ఇంత వరకు క్షేత్రస్ధాయిలో రైతులు ఎదుర్కోంటున్న సమస్యలు పట్టించుకోకుండా మొద్దునిద్ర పోతున్నారన్నారు. నష్టపోయిన పత్తి రైతులకు ఎకరాకు రూ 25వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువమోర్చా జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షులు గల్లా సత్యనారాయణ, డి సత్యనారాయణ, వీరెల్లి సత్యనారాయణ, గుగులోతు నాగేశ్వరరావు, బిక్షపతి, తాళ్ళురి సురేష్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టాన్ని అమలు చేయాలి
ఏన్కూరు, అక్టోబర్ 15: అసంఘటిత కార్మికులందరికి ప్రభుత్వం సమగ్ర సంక్షేమ చట్టాన్ని అమలు చేయాలని ఎఐటియుసి జిల్లా కార్యదర్శి సింగు నరసింహారావు డిమాండ్ చేసారు. స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపంలో సోమవారం ఎఐటియుసి డివిజన్ సమావేశం నిర్వహించారు. తొలుత కళ్యాణ మండపం నుండి ప్రదర్శన చేస్తు ర్యాలీగా వచ్చి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేసారు. అసంఘటిత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తహశీల్ధార్ అరుణకి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత కార్మికుల సంక్షేమాన్ని మర్చిపోయి. వారి హక్కులను కాలరాస్తున్నాయని ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రభుత్వాలు ఎన్నికల ముందు పేద ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కన పెట్టి నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. రేషన్ దుకాణాలలో 14రకాల నిత్యవసర సరుకులు ఇవ్వాలని, అన్ని రంగాల కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టాన్ని తీసుకరావాలని, డబుల్‌బెడ్‌రూం ఇండ్లు మంజూరు చేయాలని, స్కీం వర్కర్లందరికి నెలకి రు.18వేలు వేతనం ఇవ్వాలని, 55సంవత్సరాలు దాటిన ప్రతి కార్మికునకు రు. 3వేలు పించన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ నవంబర్ 9,10,11న జరిగే చలో డిల్లీ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా అసంఘటిత కార్మికులంతా కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో హమాలీ సంఘం జిల్లా కార్యదర్శి మేకల శ్రీనివాసరావు, సిపిఐ డివిజన్ కార్యదర్శి ఎర్రాబాబు, మండలకార్యదర్శి అమరనేని వీరభద్రం, ఎఐటియుసి డివిజన్ ప్రదాన కార్యదర్శి మంకెన క్రిష్ణ, నాయకులు వర్థబోయిన శ్రీను, తెప్పల సత్యం, కోటాచారి,మేడాభూషయ్య, తదితరులు పాల్గొన్నారు.