ఖమ్మం

రాజకీయ విమర్శలకే నేతల ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్), అక్టోబర్ 17: రైతాంగ సమస్యలను పరిష్కరించటంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని, దానిని కప్పిపుచ్చుకునేందుకే టిఆర్‌ఎస్ నేతలు రాజకీయ విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు తుళ్ళూరి బ్రహ్మయ్య ఆరోపించారు. మంగళవారం స్థానిక జిల్లా టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సత్తుపల్లి ఎమ్మెల్యేపై జిల్లా టిఆర్‌ఎస్ నాయకులు విమర్శలు చేసే అర్హత లేదన్నారు. రైతు సమస్యను పక్కన పెట్టి కేవలం వ్యక్తులపై విమర్శలు చేయటం అలవాటుగా మారిందన్నారు. రాష్ట్ర మంత్రిగా ఉండి ఒక శాసనసభ్యుడిపై విమర్శలు చేయటం సిగ్గుచేటన్నారు. సాగర్ ఎడవ కాలువ ద్వారా నీటిని విడుదల చేయకపోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందులలో ఉంటే దానిని పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. వ్యవసాయ రంగానికి ఉపయోగపడాల్సిన జిల్లా జలాలను మిషన్ భగిరధ పేరుతో తాగునీటికే ఉపయోగిస్తున్నారన్నారు. వైరా రిజర్వాయర్‌ను కేవలం సాగునీరు లక్ష్యంగా అప్పటి నిజాం పాలకులు నిర్మించారన్నారు. అటువంటి వైరా రిజర్వాయర్ కింద ఉన్న పంటలకు 3సంవత్సరాలుగా నీరు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. భక్తరామదాసు ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదన్నారు. అలాగే సీతారామ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఒక్క శాతం కూడా పని పూర్తి చేయలేదని దుయ్యబట్టారు. జిల్లా జలాలను మంచినీటికే ఉపయోగిస్తే జిల్లాలోని పంటలు, రైతులు ఏమి కావలని ప్రశ్నించారు. ఇప్పటికైనా జిల్లాలోని రైతాంగం కోసం సాగర్ జలాలను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకోవాలని లేని పక్షంలో ప్రత్యేక కార్యాచరణతో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు కూరపాటి వెంకటేశ్వర్లు, మందడపు వెంకటేశ్వర్లు, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

తన్నీరు శోభారాణికి జాతీయ అవార్డు
ఖమ్మం(కల్చరల్), అక్టోబర్ 17: ఖమ్మం నగరానికి చెందిన తన్నీరు శోభారాణికి కళ, సేవారంగాలలో అత్యుత్తమ సేవలకుగాను వే ఆఫ్ ఫౌండేషన్ సంస్థ జాతీయ అవార్డును అందజేసింది. సోమవారం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో జరిగిన జాతీయస్థాయి సాంస్కృతిక కళా మహోత్సవం 2కె-17లో ఈ అరుదైన గౌరవం ఆమెకు దక్కింది. ఈ సందర్భంగా ఆమె మంగళవారం ఖమ్మంలో మాట్లాడుతూ తిరుపతి అర్బన్ ఎఎస్‌పి ఎంవిఎస్ స్వామి, టిటిడి బోర్డు సభ్యులు భానుప్రకాష్‌రెడ్డి, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్టు ప్రవీణ్‌చక్రవర్తి, కళా తపస్వీ, సాహితీ సార్వభౌమ వేదవ్యాస్‌రంగ భట్టార్ తదితర ప్రముఖుల చేతుల మీదుగా ఆవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ అవార్డు తనలో ఉన్న కళా, సేవారంగాలకు మరింత ఊతాన్ని ఇచ్చిందని, ఈ స్పూర్తితో ఆయా రంగాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానన్నారు. జాతీయస్థాయి అవార్డు అందుకున్న తన్నీరు శోభారాణిని నగర, జిల్లా రాజకీయ, కళా రంగ ప్రముఖులతో పాటు జిల్లా స్థాయి అధికారులు ఆమెను అభినందించారు.