ఖమ్మం

ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా కలెక్టరేట్ తరలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(జమ్మిబండ), అక్టోబర్ 17: ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా కలెక్టరేట్‌ను తరలిస్తున్నారని, దీని వెనుక అధికార పార్టీ నేతల స్వార్థం ఉన్నదని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపించారు. కలెక్టరేట్ తరలింపును నిరసిస్తూ మంగళవారం సిపిఐ, సిపిఎం, సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసి, తెలుగుదేశం, టిజెఏసి, తెలంగాణ విద్యావంతుల వేధిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ, సిపిఎం, న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శులు బాగం హేమంతరావు, పొన్నం వెంకటేశ్వర్లు, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, కోలేటి నాగేశ్వరరావు, టిడిపి జిల్లా అధ్యక్షుడు తుళ్ళూరి బ్రహ్మయ్యలు మాట్లాడుతూ నగరంలో ప్రభుత్వ భూములు ఉన్నా వాటిని కాదని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి వెంకటాయపాలెం గ్రామం వద్ద భూములు కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సమీకృత కలెక్టరేట్ నిర్మాణం పేరుతో కొందరి వ్యాపారాలకు ఈ ప్రభుత్వం పావుగా ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుత కలెక్టరేట్ గతంలో 46మండలాలకు సేవలందించిందని, ఇప్పుడు 21మండలాలకే జిల్లా పరిమితమైందని, ప్రధాన కార్యాలయాలన్ని నగరంలోనే ఉన్నాయని, అయినా కమీషన్ల కోసం ప్రభుత్వం కలెక్టరేట్‌ల నిర్మాణం చేపట్టిందన్నారు. దీనిని జిల్లా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, నిర్ణయం మార్చుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు తిలక్, శివయ్య, కృష్ణారావు, వెంకన్న, పోటు ప్రసాద్, జానీమియా, సలాం, నున్నా నాగేశ్వరరావు, సమీనా, సరళ, చిరుమామిళ్ళ నాగేశ్వరరావు, అశోక్, రవి, గాంధీ తదితరులు పాల్గొన్నారు.

2..50కోట్లతో చేపట్టిన పనులపై ప్రజావేదిక
కల్లూరు, అక్టోబర్ 17: మహాత్మగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకంలో మండలంలో రూ. 2.50కోట్లతో నిర్వహించిన పనులపై మంగళవారం 11వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదికను నిర్వహించారు. ఈ వేదికలో డిఆర్‌డిఎ పిడి ఇందుమతి జరిగిన పనులపై వివరణలు సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండలంలో 2016 ఆగస్టు నుండి 2017 ఆగస్టు వరకు మంజూరైన నిధులతో వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల తవ్వకాలు, పంట కాల్వల మరమ్మత్తులు, పొలాల్లో పూడికతీత పనులు, చెట్టు నాటటం వంటి పనులను ఉపాధిహామీ కూలీలతో నిర్వహించారు. జరిగిన పనులు సక్రమంగా జరిగాయా లేక అవకతవకలు ఏర్పడ్డాయా అనే దానిపై అధికారులు వేదికలో పరిశీలించారు. ఇజిఎస్ కూలీలకు సక్రమంగా కూలీ డబ్బు పంపిణి జరిగిందా, మస్టర్లు సక్రమంగా ఉన్నాయా అనే దానిపై సంబంధిత అధికారులు పరిశీలించారు. దీనిలో భాగంగా సంబంధిత అధికారులు గతంలో మండలంలో పర్యటించి కూలీల ఇంటిఇంటికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అధికారి భానుశ్రీ, సీనియర్ క్వాలిటి కంట్రోల్ అధికారి సూర్యప్రకాష్, అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ కృష్ణ, స్టేట్ రిసోర్స్ పర్సన్ తీగల రాజు, ఎంపిడిఒ శివకుమారి తదితరులు పాల్గొన్నారు.