ఖమ్మం

సాగర్ ఆయకట్టుకు నీరు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, అక్టోబర్ 17: నాగార్జున సాగర్ ఎడమ కాల్వ పరిధిలోని ఆయకట్టుకు నీరును విడుదల చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరు ప్రాంతంలో పంటలు ఎండిపోతుండటంతో వారు రాష్టమ్రంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి తమ పంటలు కాపాడాలని విజ్ఞప్తి చేయగా ఆయన ఆదేశాల మేరకు మంగళవారం సాగర్ కాల్వకు నీటిని విడుదల చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతుండటం, రబీకి నీరు అందుతుందని ఆశాభావంతో ఉన్న రైతులకు ఈ నిర్ణయం కొంత ఊరటనిచ్చింది. అధికారులు కూడా సాగర్ నుంచి నీరు వస్తాయనే ధీమాతో జిల్లాలోని 1.50లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. పాలేరు, ఖమ్మం, వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల పరిధిలోని అనేక గ్రామాలకు సాగు, తాగునీటిని ఈ నీటిద్వారానే అందించనున్నారు. బిబిసి కెనాల్‌కు కూడా నీటిని విడుదల చేయనున్నారు.
ఇదిలా ఉండగా ఆయకట్టుకు నీటి విడుదలతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గత ఐదేళ్ళుగా సాగర్ ఆయకట్టులో బీళ్ళుగా మారిన పొలాలను ఈ ఏడాది పండించుకుంటుండగా నీరు అందదేమోననే ఆందోళనలో ఉన్న రైతులకు ఆశ నింపింది. కాగా ఆయకట్టు రైతుల పంటలకు సరిపోను నీటిని విడుదల చేస్తామని, నీటిని పొదుపుగా వాడుకోవాలని, పైభాగంలో ఉన్నవారికి కూడా నీరు అందేలా రైతులే జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇదే క్రమంలో వైరా, పెద్దవాగు, లంకాసాగర్ ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుకు కూడా త్వరలోనే నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ఆ ప్రాజెక్టులు కూడా పూర్తిస్థాయిలో నిండుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పిహెచ్‌సిని సందర్శించిన డిప్యూటీ డిఎంహెచ్‌వో, ఎంసిహచ్‌వో
జూలూరుపాడు, అక్టోబర్ 17: స్థానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డిఎంహెచ్‌వో సువర్ణ, మాతా శిసు సంక్షేమం జిల్లా ప్రోగ్రాం అధికారి ఎస్‌డి రాంకుమార్‌లు మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో పరిసరాల పరిశుభ్రత, రోగులకు అందుతున్న వైద్యం, వైద్య సిబ్బంది పనితీరు వంటి పలు అంశాలను పరిశీలించారు. ఆసుపత్రిలో డెలివరీ అయిన మహిళలకు కెసిఆర్ కిట్టులను అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు జరగటం వలన తల్లి,బిడ్డల ఆరోగ్యానికి శ్రేయస్కరమని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండటంతోపాటు శిక్షణ పొందిన వైద్యులు, నర్సులు సేవలందించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం మెరుగైన వైద్యంతోపాటు, కెసిఆర్ కిట్టుతో ప్రోత్సాహకాలను అందిస్తుందన్నారు. ఇప్పటికే స్థానిక పిహెచ్‌సి ద్వారా 28 కెసిఆర్ కిట్టులను పంపిణీ చేసినట్లు తెలిపారు. రోగులకు వైద్యం అందించటంలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

స్వఛ్చ్భారత్, హరితహారాన్ని బాధ్యతగా తీసుకోవాలి
*వనజీవి రామయ్య
పాల్వంచ, అక్టోబర్ 17: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ్భారత్, హరితహారాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని వనజీవి రామయ్య అన్నారు. మంగళవారం కెటిపిఎస్ ప్రాంగణంలోని డిఎవి పాఠశాలలో ఖమ్మంకు చెందిన ప్రముఖ వైద్యులు డా జివి మురళి ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో వనజీవి రామయ్య దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 24 శాతం ఉన్న అడవులను 33 శాతం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టిందని, దీనిని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు. స్వచ్ఛ్భారత్ ప్రతి ఇంటి నుండి ప్రారంభం కావాలని, పరిసరాల పరిశుభ్రతతోనే వీధులు, గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతాయన్నారు. తన కోసం తాను బతుకుతూ, సమాజ శ్రేయస్సు కోసం ఆలోచించేవాడే ధన్యుడన్నాడు. అనంతరం డా మురళి మాట్లాడుతూ మహాత్మాగాంధీ తెలిపిన విధంగా పరిసరాల పరిశుభ్రత పాటిస్తే ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటారని అన్నారు. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మితో పాటు, వనలక్ష్మిని పూజించాలని కోరారు. అనంతరం పాఠశాల ఆవరణలో వనజీవి రామయ్య దంపతులతో కలిసి మురళితో పాటు పాఠశాల యాజమాన్యం, విద్యార్ధులందరూ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్ధులు చేసిన నృత్యాలు పలువురిని ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో డిపిఆర్‌ఒ శ్రీనివాసరావుతో పాటు పాఠశాల యాజమాన్యం సిబ్బంది పాల్గొన్నారు.