ఖమ్మం

రక్తదానంతో ప్రాణాలు కాపాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(జమ్మిబండ), అక్టోబర్ 20: రక్తదానం చేయడంతో ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడిన వారవుతారని పోలీస్ కమిషనర్ తఫ్సీర్‌ఇక్బాల్ పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా పోలీస్ కమిషనర్ ప్రధాన కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం ట్రాఫిక్ సిఐ నరేష్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్స్ రక్తనాదం చేసి పలువురి మన్ననలు పొందారు. హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సుధాకర్‌రెడ్డి ఇప్పటివరకు 20సార్లు రక్తదానం చేయడాన్ని అధికారులు అభినందించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ తఫ్సీర్‌ఇక్బాల్ మాట్లాడుతూ విధి నిర్వహణలో దేశంకోసం అశువులు బాసిన పోలీస్ అమవరీరులను స్మరించుకోవడం కర్తవ్యంగా భావించాలన్నారు. పోలీసులు విధి నిర్వహణతో సేవా కార్యక్రమాల్లో ముందుండాలన్నారు.