ఖమ్మం

అమరుల త్యాగాలు మరువలేనివి: ఏఎస్పీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, అక్టోబర్ 20: ప్రజల కోసం పోలీసు అమరవీరులు చేసిన ప్రాణ త్యాగం మరువమలేనిదని భద్రాచలం ఏఎస్పీ సునీల్‌దత్ అన్నారు. పోలీసు సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులతో కలిసి భద్రాచలంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ దేశ రక్షణతో పాటు ప్రజలకు అన్ని వేళల్లో రక్షణ కల్పిస్తున్నామన్నారు. ప్రజా రక్షణతో పాటు పోలీసులు సామాజిక సేవల్లో ముందుండాలని అన్నారు. పోలీసు సేవలు పేద ప్రజలకు అండగా నిలుస్తాయని పేర్కొన్నారు. దేశ భద్రతకు సైనికులు, ప్రజల రక్షణకు పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. విధి నిర్వహణలో కష్టించి పని చేస్తున్న పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణకు ఎంతో కృషి చేస్తున్నారని, పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం పోలీసుస్టేషన్‌లో ఓపెన్‌హౌస్ నిర్వహించి పోలీసులు ఉపయోగించే ఆయుధాల పేర్లు, వాటి పనితీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిఐ బాణాల శ్రీనివాస్, ఎస్సై కరుణాకర్, ట్రాఫిక్ ఎస్సై అబ్బయ్య, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోపి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

రాంపురం రైతులకు అండగా ఉంటాం
* అఖిలపక్షం నాయకులు
కొత్తగూడెం రూరల్, అక్టోబర్ 20: సింగరేణి సంస్థ చేపట్టిన నూతన బొగ్గుగని తవ్వకాల కారణంగా భూములు కోల్పోతున్న రాంపురం రైతులకు అండగా ఉండామని అఖిలపక్షం నాయకులు అన్నారు. చుంచుపల్లి మండల పరిధిలోని రాంపురం గ్రామంలో శుక్రవారం అఖిలపక్షం నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీమంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, టిడిపి జిల్లా అధ్యక్షలు కోనేరు సత్యనారాయణలు మాట్లాడారు. తాము బొగ్గుగని తవ్వకాలకు వ్యతిరేకం కాదని, భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలన్నారు. ఎన్నో సంవత్సరాలుగా భూమిని నమ్ముకొని జీవిస్తున్న రైతులకు అన్యాయం చేయకుండా చూడాల్సిన బాధ్యత సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వానిదేనన్నారు. మండల పరిధిలోని 9 ఇంక్లైన్, 7 ఇంక్లైన్, పెనగడప ప్రాంతాల రైతుల భూములను తీసుకొని సంస్థ ఎటువంటి నష్టపరిహారం చెల్లించలేదన్నారు. సింగరేణి యాజమాన్యం రాంపురం రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఎటువంటి నష్టం జరిగినా సహించేది లేదని హెచ్చరించారు. గ్రామస్తులకు అండగా ఉండి భూములకు కొరకు పోరాడతామని హమీ ఇచ్చారు. అనంతరం రైతులతో కలిసి గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి గిడ్ల పరంజ్యోతిరావు, కాంగ్రెస్ నాయకులు వనమా రాఘవేంద్రరావు, కాసుల వెంకట్, జక్కం సీతయ్య, కరాటే రామస్వామి, సిపిఐ నాయకులు మండే వీరహనుమంతురావు, శ్రీను, టిడిపి నాయకులు రావి రాంబాబు, గుగులోతు కృష్ణ, కట్టా నరసింహారావు, చెన్నారావు, విశ్వనాధం, కట్టా పిచ్చయ్య, పులిచర్ల సత్యం, నరేందర్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.