ఖమ్మం

సిపిఐ పోరుబాటకు విస్తృత ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(జమ్మిబండ), అక్టోబర్ 23: భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజాపోరు యాత్ర ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా సిపిఐ శ్రేణులు విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నెల 27 నుండి మూడు రోజులపాటు జిల్లాలో యాత్ర జరగనుంది. ఈ సందర్భంగా ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు సంబంధించి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వాల్‌పోస్టర్లు అంటించారు. యాత్ర జరగనున్న మార్గమంతటా వాల్ రైటింగ్ రాసి విస్తృత ప్రచారం చేస్తున్నారు. అనేక చోట్ల యాత్ర ప్రాధాన్యత తెలిపే పెద్ద పెద్ద ఫెక్ల్సీలను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తదనంతర పరిణామాలు, సామాజిక అభివృద్ధి, రాష్ట్ర సమగ్రాభివృద్ధి ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి ప్రజలకు వివరించే రీతిలో ప్రచారం సాగుతోంది. 27న సాయంత్రం 6 గంటలకు ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో యాత్రకు నేతృత్వం వహిస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీనియర్ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ప్రముఖ గాయకుడు గద్దర్, ఇతర వామపక్ష నేతలు, కాంగ్రెస్, టిడిపి, జెఎసి బాధ్యులు, సామాజిక సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు. జిల్లాలోని 5 నియోజకవర్గాల పరిధిలోని ప్రతి గ్రామాన విస్తృత ప్రచారం నిర్వహించేందుకు నియోజకవర్గ స్థాయి జాతాలు ఏర్పాటు చేశారు. ఈ యాత్రను పురస్కరించుకుని ఖమ్మం నగరాన్ని తోరణాలు, భారీ ఫ్లెక్లీతో అలంకరిస్తున్నారు.

వౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ ధ్యేయం

* 72 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కామేపల్లి, అక్టోబర్ 23: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఇల్లెందు శాసనసభ్యుడు కోరం కనకయ్య అన్నారు. సోమవారం మండల పరిధిలోని కామేపల్లి, మద్దులపల్లి, బాసిత్‌నగర్ గ్రామాల్లో 72 లక్షల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కామేపల్లి నుండి లచ్చతండా, కొర్రతండా, గోపాలపురం అంతర్గత రహదార్లు, ట్రైబల్ సబ్‌ప్లాన్ ద్వారా 50 లక్షల నిధులతో రహదారి అభివృద్ధి పనులు, మద్దులపల్లిలో 15.53 లక్షలతో మిషన్ భగీరథ మంచినీటి ట్యాంక్ పనులను, బాసిత్‌నగర్ గ్రామంలో 6.50 లక్షల రూపాయలతో సిసి రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వౌలిక వసతులు కల్పించడం, తాగునీరు, సాగునీరు, అంతర్గత రహదార్లను అభివృద్ధి పర్చేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ట్రైబల్ సబ్‌ప్లాన్ ద్వారా నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఆశీర్వదించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి మల్లిబాబుయాదవ్, ఎంపిపి సరిరాంనాయక్, తహశీల్దార్ వేణుగోపాల్, ఎండిఓ విజయ, వివిధ శాఖల అధికారులు మూర్తి, పొన్నం శ్రీనివాస్, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు నర్సింహానాయక్, పతే అహ్మద్, వీరారెడ్డి, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.