ఖమ్మం

ధనవంతులకు ఊడిగం చేస్తున్న మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, అక్టోబర్ 23: ప్రధాని మోడీ ధనవంతులకు ఊడిగం చేస్తున్నారని, కార్మికుల హక్కుల హక్కుల కాలరాస్తున్నారని సిఐటియూ, ఏఐటియూసి, ఐఎఫ్‌టియూ, ఐఎన్‌టియూసి నేతలు కె.బ్రహ్మాచారి, ఎ.సునీల్, ఆర్.మధుసూదన్‌రెడ్డి, అర్జున్ దుయ్యబట్టారు. కార్మికుల హక్కుల రక్షణకై నవంబర్ 9,10,11 తేదీల్లో ఢిల్లీలో జాతీయ కార్మిక సంఘాల నాయకత్వంలో జరుగుతున్న ఢిల్లీ మహాపడావ్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. సోమవారం సిఐటియూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంయుక్త సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికల ముందు కనీస వేతనం రూ.18 వేలు అమలు చేస్తామని ప్రకటించిన భాజపా ఇప్పటివరకు కనీసం వేతనం అమలు చేయడం లేదన్నారు. కార్మిక చట్టాలను సవరించడం ద్వారా మోడీ ప్రభుత్వం కార్పోరేట్ సంస్థలకు ఊడిగం చేస్తుందని విమర్శించారు. పెద్దనోట్ల రద్దు వల్ల కార్మికులు ఉపాధిని కోల్పోయారని అన్నారు. ఆర్థిక వ్యవస్థ నాశనం చేయడం కోసం భాజపా చేస్తున్న ప్రయత్నాలను కార్మికులు ఐక్యంగా ప్రతిఘటించాలని విజ్ఞప్తి చేశారు. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం సమగ్రచట్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను నాశనం చేస్తున్న చర్యలను ఖండించాలని, దేశ భవిష్యత్‌ను రక్షించేందుకు కార్మికవర్గం చేస్తున్న ఉద్యమాలను ప్రజలంతా బలపరచాలని సంఘాల నేతలు కోరారు. స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కేరళ ప్రభుత్వం మాదిరిగా భాజపా కూడా కనీస వేతనం రూ.18 వేలు నిర్ణయిస్తూ చట్టం చేయాలన్నారు. ప్రతి కార్మికుడికి పీఎఫ్, ఈఎస్‌ఐ, ప్రమాదభీమా సౌకర్యాలను కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రక్షణరంగం, బ్యాంకులు, ఎల్‌ఐసీ వంటి ప్రభుత్వ రంగ కంపెనీల్లో ఎన్‌డీఐలను రద్దు చేయాలన్నారు. నవంబర్ 9,10,11 తేదీల్లో మూడు రోజుల పాటు ఢిల్లీలోని పార్లమెంట్ వీధుల్లో మహాపడావ్ పేరిట జరిగే జాతీయస్థాయి ఉద్యమంలో జిల్లా నుంచి అన్ని సంఘాల నాయకత్వం, కార్మికులు భారీ సంఖ్యలో వెళ్తున్నారని తెలిపారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు.