ఖమ్మం

కలెక్టరేట్ తరలింపు విరమించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), అక్టోబర్ 23: జిల్లా ప్రజలకు అందుబాటులో నగరం సెంటర్‌లో ఉన్న కలెక్టరేట్‌ను తరలింపును విరమించుకోవాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జరిగిన గ్రీవెన్స్‌డేలో కలెక్టర్ లోకేష్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ వంద సంవత్సరాల వరకు ఉపయోగపడేలా నిర్మించిన జిల్లా కలెక్టరేట్‌ను తరలించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రస్తుత కలెక్టరేట్ 6 ఎకరాల విస్తీర్ణంలో విశాల భవనాలలో ప్రజలకు ఎంతో అందుబాటులో ఉందన్నారు. జిల్లా విభజనకు ముందు సరిపోయిన జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఇప్పుడు ఎందుకు సరిపోదని ప్రశ్నించారు. ఖమ్మంకు 8 కిలోమీటర్ల దూరంలో వెంకటాయపాలెం వద్దకు ఎందుకు తరలిస్తున్నారో చెప్పాలన్నారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు తమ వ్యక్తిగత ప్రయోజనాలు, తమ రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసమే కలెక్టరేట్ తరలింపునకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఖమ్మం బస్టాండ్, రైల్వేస్టేషన్‌కు అతి సమీపంలో ప్రజలకు అందుబాటులో ఉన్న కలెక్టరేట్‌ను తరలించాల్సి అవసరం లేదన్నారు. నూతన భవనాలు పునర్నిర్మాణం చేయాల్సి వస్తే అదే స్థలంలో ఎంతో విశాలంగా నిర్మించవచ్చని, అదికాకపోతే నగరం నడిబొడ్డున ఉన్న ఎనె్నస్పీ స్థలంలో నిర్మించాలన్నారు. నూతన కలెక్టర్ నిర్మాణంలో అఖిలపక్ష సమావేశంలో ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా నిర్లయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతకు ముందు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకున్నారు. పత్తి కొనుగోలులో జరుగుతున్న అక్రమాలను అరికట్టి సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రాంశెట్టి మనోహర్‌నాయుడు, రాపర్తి శరత్‌కుమార్, ఎండి ఫజల్, జహార్ తదితరులు పాల్గొన్నారు.

మూడున్నరేళ్ళ పాలనలో అభివృద్ధి శూన్యం
సత్తుపల్లి, అక్టోబర్ 23: అధికారంలో వచ్చి మూడన్నరేళ్ళు గడిచినా ఇంతవరకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సోమవారం స్థానిక తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 27 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రజా క్షేత్రంలో వారి పక్షాన పోరాడుతున్న టిడిపి ఆధ్వర్యంలో ప్రజల సమస్యలను తెలియజేసేందుకు అసెంబ్లీని వేదికగా చేసుకుంటున్నామన్నారు. ఒక రోజు ముందుగా ఈ నెల 26న జరిగే టిడిపి శాసనసభా పక్ష సమావేశంలో చర్చిస్తామన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, పాత ఇళ్లకు బిల్లులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, గొర్రెలు, ఇంటికో ఉద్యోగం హామీ, హడావిడిగా డిఎస్సీ ప్రకటన, వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, కార్పొరేషన్ రుణాల జాప్యం, తండాలు గ్రామ పంచాయతీలుగా మారడం, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్, జిల్లాల విభజనలో ఆశాస్ర్తియత ఇలా ఏ ఒక్కటి సవ్యంగా జరిగిన దాఖలాలే లేవన్నారు. కొత్తగా రేషన్ షాపులను రద్దు చేస్తామనే ప్రకటనలో పేదలు, నిరుద్యోగులను మరికొంత ఇబ్బందుల్లోకి నెడుతుందని సిసిఐ కేంద్రాల ఏర్పాటు ప్రకటనలకే పరిమితవ్వగా మద్దతు ధర కలగానే మిగిలిందన్నారు. సాగర్ జలాలు చాలినన్ని ఉన్నా రైతులకు ఎటువంటి స్పష్టమైన ప్రకటన రాకపోవడం, చివరి రైతులు పంటలు వేసే అవకాశం కోల్పోతున్నారన్నారు.