ఖమ్మం

నూతన కలక్టరేట్ నిర్మాణంపై ప్రజా బ్యాలెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, అక్టోబర్ 23: సమీకృత కలెక్టరేట్ పేరుతో ఖమ్మం నగరంలో ఉన్న కలెక్టరేట్ తరలింపును నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్ళల్లో ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసి పార్టీల ప్రధాన నేతలు మాట్లాడుతూ నగరంలో అందరికీ అనుకూలంగా ఉన్న కలెక్టరేట్‌ను తరలించడం వెనక అధికార పార్టీ నేతల కుట్ర దాగి ఉందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా విలువలను నిర్లక్ష్యం చేస్తూ నియంత పాలన సాగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రజా బ్యాలెట్‌లో 3,378 మంది పాల్గొన్నారని, అందులో 3,227 మంది తరలించవద్దని ఓటు చేసినట్లు వారు వెల్లడించారు. 91 మంది వెంకటాయపాలెం, 51 మంది నోటాకు ఓటు వేసినట్లు తెలిపారు. మెజార్టీ ప్రజాభిప్రాయానికి విలువనిచ్చి కలెక్టరేట్ తరలింపు విరమించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కలెక్టరేట్‌ను తరలించే ప్రయత్నాన్ని విరమించుకోకపోతే ప్రజాందోళన తప్పదన్నారు.

ఏజెన్సీ ప్రాంతంలోని మద్యం షాపులకు టెండర్లు ఖరారు
కొత్తగూడెం, అక్టోబర్ 23: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజన్సీ ప్రాంతంలోని మద్యం షాపుల టెండర్లు సోమవారం ఖరారయ్యయి. జిల్లా వ్యాప్తంగా 39 ఏజన్సీ మద్యం షాపులకుగాను 1216 మంది టెండర్లు దాఖలు చేశారు. సోమవారం స్థానిక కొత్తగూడెం క్లబ్‌లో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సమక్షంలో డ్రా తీశారు. 39 వైన్ షాపుల్లో ఏడు షాపులను మహిళలు డ్రాలో సొంతం చేసుకున్నారు. మద్యం షాపులకు సంబంధించి గిరిజనుల ద్వారా గిరిజనేతరులు దరఖాస్తులు చేయించి, దరఖాస్తు ఫారాలను పూర్తి చేయించటంతోపాటు డ్రాలో వైన్ షాపులు వచ్చిన వారి పేరు మీద డబ్బులను డిపాజిట్ చేసే పనిలో బినామీలు నిమగ్నమయ్యారు. దరఖాస్తుదారులైన గిరిజనుల కంటే గిరిజనేతరుల హడావుడి అధికంగా కనిపించింది. వైన్‌షాపులకు మహిళలు, యువతుల నుంచి అధికంగా దరఖాస్తుల రావటం చర్చనీయాంశంగా మారింది. చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాలకు చెందిన వైన్ షాపులకు సంబంధించి 196 దరఖాస్తు చేశారు. మద్యం షాపుల డ్రా సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కొత్తగూడెం క్లబ్ సమీపంలోకి ఇతరులను అనుమతించకుండా ముం దస్తు చర్యలు చేపట్టారు.