ఖమ్మం

అంబేద్కర్ సంస్కరణలు రాష్ట్రంలో అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపురం హవేలి, ఏప్రిల్ 14: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి వేడుకలను గురువారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి జడ్పీ సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భక్తరామదాసు మందిరంలో ఆయన మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించటంతో పాటు బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతిగా అభివర్ణించారు. 14గంటల పనిదినాన్ని 8గంటలకు కుదించిన ఘనత కూడా ఆయనకే దక్కిందన్నారు. అంబేద్కర్ చేసిన సంస్కరణలే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా షెడ్యూల్డ్‌కులాల అభివృద్ధికి జిల్లాలో 5.29కోట్ల రూపాయల ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్పుల కోసం ఖర్చు చేస్తున్నామన్నారు. 21కళాశాలలో 1711మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు, వసతిసౌకర్యాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. కులాంతర వివాహాలు చేసుకున్న 146జంటలకు 68.60లక్షలను అందించినట్లు వెల్లడించారు. కల్యాణ లక్ష్మీ పథకం కింద 2,984మంది లబ్ధిదారులకు 15కోట్ల రూపాయలను అందించామన్నారు. దళితులకు భూపంపిణీలో సామాజిక హోదా కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన భూపంపిణీ కార్యక్రమంలో ఇప్పటి వరకు 460ఎకరాల భూమిని గుర్తించటం జరిగిందన్నారు. ప్రతి నెల 80నుంచి 90ఎకరాల భూమిని పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. అనంతరం జడ్పీచైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణలు కలెక్టర్‌తో కలిసి తిరుమలాయపాలెం, ముదిగొండ, ఖమ్మం అర్బన్, కూసుమంచి మండలాలకు చెందిన 28మంది లబ్ధిదారులకు 78.23ఎకరాల భూమిపత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో జెసి దివ్య, ఏజెసి బాబురావు, ఆర్డీవో వినయ్‌కృష్ణారెడ్డి, అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ వెంకటేశ్వర్లు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు అచ్యుతానంద గుప్తా, మెప్మా పిడి వేణుమనోహర్ తదితరులు పాల్గొన్నారు.
టిఆర్‌ఎస్ కార్యాలయంలో...
తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయంలో అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బేగ్, నాయకులు ఆర్జెసి కృష్ణ, వెంకటేశ్వర్లు, సుధాకర్, మురళీ, పాపాలాల్, మురళీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా మేయర్ పాపాలాల్, డిప్యూటీ మేయర్ మురళీప్రసాద్‌లు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో...
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదే విధంగా ఖమ్మం ఎమ్మెల్యే అజయ్‌కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వైఎస్‌ఆర్‌సిపి ఆధ్వర్యంలో...
బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను వైఎస్‌ఆర్‌సిపి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ కార్పొరేటర్లు వెంకయ్య, పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
బిజెపి ఆధ్వర్యంలో...
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదే విధంగా బిసి సంఘాలు, ఇతర సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నేతలు అంబేద్కర్ విగ్రహానికి, ఆయా కార్యాలయాల్లో అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.