ఖమ్మం

ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, ఏప్రిల్ 15: భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున విచ్చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు హెలీప్యాడ్ వద్ద ఘన స్వాగతం లభించింది. జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ ఛైర్‌పర్సన్ గడిపల్లి కవిత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. హౌసింగ్ అతిథిగృహంలో కొద్దిసేపు సేదతీరి సీతారాముల కల్యాణానికి ముఖ్యమంత్రి దంపతులు బయలుదేరారు. స్వామికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి కళ్యాణం తిలకించాక తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు. హెలీప్యాడ్ వద్ద మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్, ఐజీ నవీన్‌చంద్, డిఐజి మల్లారెడ్డి, ఎస్పీ షాన్‌వాజ్‌ఖాసీం, జేసీ దివ్య, ఐటీడీఏ పీవో రాజీవ్‌గాంధీ హన్మంతు వీడ్కోలు పలికారు.